Wednesday, July 22, 2009

అమ్మ బాబోయ్ exams ..... అయ్యబాబోయ్ results

చిన్నప్పుడు నాకో అభిప్రాయముండేది. అదేంటంటే మనకి exams ఉన్నప్పుడు మనతోబాటు చుట్టుపక్కలుండే సమస్త జీవ కోటి భయం భయంగా, ప్రతి క్షణం టెన్షన్ తో ఉండాలని. పొరపాట్న ఎవరైనా నాకు ఏమాత్రం సంబంధం లేని విషయం గురించి నవ్వుకున్నాకాని నన్ను, నా exam సరిగ్గా వ్రాయలేని అసమర్ధతని చూసి నవ్వుతున్నారని నాకనిపించేది. పైగా, నా ఎగ్జామ్స్ జరుగుతుంటే ఇంట్లో ఎవ్వరు TV పెట్టకూడదు, షాపింగ్ కి వెళ్ళకూడదు, ఎంజాయ్ చెయ్యకూడదు అని తెగ రూల్స్ పెట్టేదాన్ని. ఎందుకంటే మరి నేను ఎంజాయ్ చెయ్యట్లేదు కదా అందుకన్నమాట. ఎగ్జామ్స్ మొదలవ్వగానే దేవుళ్ళకి మొక్కుకోవడం మొదలెట్టేసేదాన్ని. ఎగ్జామ్స్ మంచి మార్కులతో పాస్ చేయించు దేవుడా, సో అండ్ సో రోజు ఉపవాసం ఉంటాననో, లేక ఇంకేదో మొక్కేసేదాన్ని. ఏదైనా పేపర్ బాగా వ్రాయకపోతే ఇంటికొచ్చి పిచ్చి పిచ్చిగా ఏడిచే దాన్ని. ఇవ్వాళ్ళ పేపర్ బాగా రాయలేదు, ఫెయిల్ అయిపోతాను ... అని. On top of that ఇంకొక అలవాటుండేది. ఇంటికొచ్చి అన్నం తింటున్నప్పుడు, ఆరోజు పేపర్ ని తల్చుకుని, ఎన్నెన్ని లైన్లు వ్రాసాను, దానికి ఎన్నెన్ని మార్కులిస్తారు అని guess చెయ్యటం. At least 50% అయినా రాకపోతుందా? అని నన్ను నేను సద్దిచెప్పుకోవటం. మా అమ్మకి నేనిది బాగా అలవాటుచేసానేమో, మా తమ్ముడి exams అయినప్పుడు తెగ భయపడి పొయ్యేది. వాడు exam అయ్యాక ఇంటికి రాగానే "ఎలా రాసావురా" అని గుమ్మంలోనే అడిగేది. మా వాడికి అసలే తిక్క. వాడికి ఒళ్ళుమండి "Pen తో" అని లోపలి వెళ్లి పొయ్యేవాడు. దాంతో యుద్ధం స్టార్ట్. "చూసావా, నేనింత ఆత్రంగా అడిగితే ఎలా తిక్క సమాధానం చెప్తున్నాడో?" అని.
ఇదంతా ఒక ఎత్తైతే results ముందు ఇంకొక టైపు భయం. "అసలు పాసవుతానా, పేపర్ లో నా నెంబర్ కనిపిస్తుందా?" ఇలాంటి డౌట్ లు. మా చిన్నాన్న గారు నా ఫేస్ చూసి నాకున్న ప్రస్తుత భయం యొక్క కారణం కనిపెట్టేవారు. "దీని ఫేస్ ఇలా ఉందేంటి? Exams అవుతున్నాయా?" అనేవారు.
ఇంత stress లో మనం ఉంటె, జనాల ఉపదేసాలోకటి. "At the most ఏమవుతుంది, మళ్ళి ప్రిపేర్ అవ్వాలి అంతే కదా. Knowledge కోసం చదవాలి కాని, మార్కుల కోసం కాదు" అని. ఎహే ఉరుకొండి. నేను చదివేది మార్కుల కోసమే అంటే వినిపించుకోరు. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది. అందుకే ఎవరైనా ఎగ్జామ్స్ అని భయపడే పిల్లల్ని చూసి వాళ్లకి సింపతి చూపిస్తాను తప్ప అనవసరంగా ప్రీచింగ్ చెయ్యను.

Thursday, July 16, 2009

నేను- నా sweet tooth

చిన్నప్పుడు పుట్టిన రోజునాడు పొద్దున్నే లేచి, తలస్నానం చేసి, నాన్నగారితో నారాయణగూడ లో ఉన్న Balaji Mithai Bhandaar లో కలాకంద్, కోవా చెరో కిలో ఇంకా ఆరోజు ఫ్రెష్ గా చేసిన, మనకి చాల నచ్చేసే రెండు మూడు రకాలు చెరో పావు కిలో ఇంకా కారబ్బూంది తెచ్చేసుకుంటే కాని birthday మొదలయినట్టు అనిపించేది కాదు.
అసలు స్వీట్ ని ఎలా తినాలంటే:
మనకిష్టమొచ్చిన స్టొరీ బుక్ ని తెరిచి, కధ చదవటం మొదలుపెట్టి, చిన్న ముక్క నోటితో కొరికి, దానిని minimum ఐదు నిమిషాలు చప్పరించి, ఆ తీపి, యాలకుపొడి వాసన, కుంకుమపువ్వు (స్వీట్ లో ఉంటె) flavor ని ఆస్వాదించి అప్పుడు కొంచెం కొంచెం గా మింగాలి. ఆహా ఆ అనుభవాన్ని మాటలతో చెప్పలేము కదా.
నేను చిన్నప్పటి నుంచి desserts కి వీరాభిమానిని. స్వీట్ అంటే ఇష్టం లేని మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారంటే నేను చిన్నప్పుడు నమ్మేదాన్ని కాదు. అసలు స్వీట్ తినకుండా మనుషులు ఎలా ఉండగాలుగుతారండి. ఉగాది, దసరా, దీపావళి లాంటి పండగలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ చేసేవారు బూంది లడ్డు, కజ్జిజాయలు, లస్కోరా (దీన్నే కొబ్బరి లౌజు కూడా అంటారని తరవాత తెలిసింది). ఆహా, ఆ కర్పూరం వాసనా, చక్కర పాకం లో just వేసిననందువల్ల ఇంకా ఉన్న crispyness, తిన్నవారికే తెలుస్తుంది ఆ మజా ఏంటో.
నా లెక్క ప్రకారం స్వీట్స్ ని చాల రకాలుగా categorize చేయొచ్చు. చెప్తావినండి:
మొదటి category:
Routine type - andhra type:
Routine type అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టక టకా నారాయణగూడ వరకు వెళ్లి తెచ్చుకునే టైపు.
Andhra type అంటే ఆవైపునే ఉన్న విజయ కాటేజీ లేదా కొంచెం ఎక్కువ నడిచి చిక్కడపల్లి వరకు వెళ్లి బందర్ mithai bhandaar లో తెచ్చుకునే అరిసెలు, కాజాలు మరియు బందరు లడ్డు లాంటివి. వీటిని ఆంధ్ర టైపు అని నేను ఎందుకన్నానంటే మా ఇంట్లో ఏదైనా చిన్న సైజు ఫంక్షన్ (బారసాల లాంటిది) జరిగినా లేదా అమ్మ వైపు చుట్టాలు రాజమండ్రి ప్రాంతాలనుంచి వచ్చినప్పుడు అమ్మ అవే తెచ్చేది (లేదంటే మేం వెళ్లి తెచేవాళ్ళం). పైగా వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ కొట్టేది. "అరిసెలు ఓ అరకిలో పట్రండి. స్వీట్ తెమన్నా కదా అని "peda" అని చెప్పి నాలుగు కోవా బిళ్ళలు తీసుకురావద్దు. ఆ పేరు వింటే వాళ్ళు తినరు కూడాను". మా మావయ్య పెళ్లి కాకినాడ లో జరిగింది. అప్పుడే మనకి ఎవరో కాకినాడ కాజా introduce చేసారు. ఈ category కి ఆంధ్ర టైపు అని నేను పేరు పెట్టడానికి ఇది కూడా కారణం. MSc అయ్యాక SR Nagar లో work చేసినప్పుడు అక్కడ స్వగృహ ఫుడ్స్ అని చాల స్వీట్ షాప్స్ తెరిచారు. ఇక నాకైతే పండగే. అక్కడే మనం పూత రేకులు కూడా తిన్నాం. అసలు ఆ ఆర్టిస్టిక్ ability కి చెప్పాలండి జోహార్లు. ఆ సన్న సన్నని పేపర్ లాంటి దాని మధ్యన ఆ చక్కర పొడి. అయ్యో.......
ఇక second way of categorization: Traditional type-Almond House type
నేను కొంచెం పెద్దయ్యాక ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిన తరవాత మా ఫ్రెండ్స్, నేను కలిసి హిమాయత్ నగర్ వైపు Curry Puff, pizza లాంటివి తినటానికి వెళ్ళే వాళ్ళం. ఆరోజుల్లో అది చాల happening place. అక్కడ almond house అని early 90s లో అనుకుంట స్టార్ట్ చేసారు. ఆ షాప్ లో ప్రతి స్వీట్ లో ఒక బాదాం ఉంటుంది. ఆ షాప్ లో నేను అన్ని variety లు taste చెయ్యలేదు.
ఇక పొతే ఇంకో category. అదేంటంటే regular-Occasional
Regular అంటే ఈజీ గా దొరికే స్వీట్లు. Occasional అంటే మనకి అంత వీజీ గా దొరకవు. అప్పుడప్పుడు దొరుకుతాయి. అమ్మ, నాన్న teachers ని కలవటానికి స్కూల్ కి వచ్చినప్పుడు పక్కనే abids John bakery లో దొరికే pastry లు, ముందు చెప్పినట్లు హిమాయత్నగర్ కి వెళ్ళినప్పుడు కొంచెం డబ్బులు మిగిలితే "King and కార్డినల్ (స్పెల్లింగ్ కరెక్ట్ కదా?)" లో కొనుక్కునే pastry లు అలాన్తివన్నమాట.
గత ఐదారేళ్లుగా ఇంకో కొత్త category కనిపెట్టా. "దేశి-విదేశి" అంటే "Indian-foreign"
Indian అంటే మన ఇండియన్ grocery stores లో దొరికే మోతీ చూర్ లడ్డు, జిలేబి, బర్ఫీ లాంటివి. Foreign అంటే Panna Cotta, cannoli, Tiramisu, cheese cake లాంటివి.
మనం స్వీట్స్ ని climate ని పట్టి కూడా categorize చెయ్యొచ్చు. సమ్మర్ లో అయితే ఐస్ క్రీం లాంటివి తినాలి. చలి కాలం లో అయితే పాకం లో వేసిన జంతికలు, ఇక్కడ US లో అయితే funnel cake లాంటివి తినొచ్చు. అలాగే మనకి stress బాగా పెరిగిందనుకోండి, అది పోగొట్టుకోవటానికి కొన్ని combinations తినొచ్చు, For example గులాబ్ జామున్ ని ఒక 30 seconds వేడి చేసి chilled custurd తో తినచ్చు.
రుచిగా చేసిపెట్టే వాళ్ళు ఉండాలేకాని నాలాగ స్వీట్స్ ని లోట్టలేసుకుని తినేవాళ్ళకి కొదవా చెప్పండి? మీకు తెలిసిన లేదా మీరు కనిపెట్టిన కొత్త స్వీట్లు లేదా category లు ఎవైనా ఉంటె వెంటనే తెలియజేయగలరు.

Tuesday, July 14, 2009

మావారు బంగారు కొండా......

మీకేదైనా తెలుగు సినిమా పాట గుర్తొచ్చిందా? నాక్కూడా.
అదేంటమ్మాయి? ఇన్ని రోజులు నీ బాగోగులు చూసిన అమ్మానన్నని, అన్నదమ్ములని, అక్కచెలెల్ని అందరిని పక్కన పెట్టి, మీ ఆయన గురించి రాస్తావేంటి? అనకండి. ఏదో ఈ టైటిల్ పెట్టి post వ్రాయలనిపించి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మా అయన విషయానికొద్దాం. మా ఆయనలో నాకు చాలా చాలా నచ్చే విషయం ఏంటంటే, నన్ను ఎప్పుడు కంట్రోల్ చెయ్యటానికి ట్రై చెయ్యరు. మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చక్రాలు తిప్పుకుంటే, నేను చదువుకోవటానికి US వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఇంట్లో (కార్ లో) పరిచయమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్ మే. Ph. D అయ్యిన్తరవాత తనకి NY లో ఉద్యగం వచ్చింది. నాకేమో వేరే ఊర్లో. తరవాత సంవత్సరానికి మా పెళ్ళయ్యింది. ఇప్పటికి మా పెళ్ళయ్యి మూడేళ్లు కావస్తుంది. అయినా ఉద్యోగరీత్యా వేరే ఊర్లోనే ఉంటున్నాము. కనపడిన ప్రతి వాడు, "when will you and your husband stay in the same city" అనో, "you need to make a decision soon and stay in the same place" అనో, లేక ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి "after a few years, you will have kids and stay home anyway. Why do you want to go through all these troubles" అనో హింసిస్తాడు తప్ప, ఆయన మాత్రం ఎప్పుడు job వదిలి పెట్టమని చెప్పలేదు. నా professional development కి సలహలిస్తారే కాని "నువ్వేలాగో కొన్ని రోజుల తరవాత NY కి వచేస్తావుకా? ఎందుకు చెప్పు నీకీ ప్రమోషన్ల గొడవ?" అని discouraging గ మాట్లాడరు. ఎవరినైన మా ఇంటికి డిన్నర్ కి పిలుస్తే నేను రెండు items చేస్తే నాకు సాయంగా ఆయన నాలుగు చేస్తారు. పైగా నా ఫ్రెండ్స్ వస్తే "నువ్వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వంట నేచేస్తాలే" అంటారు. ఎప్పుడైనా "అబ్బ Mango లస్సి తాగాలని ఉంది" అంటే, "సాయంత్రం రెడీగా ఉండు, ఎడిసన్ వెళ్లదాం" అంటారు. ఇదంతా తెలుగులో అనుకుంటున్నారా? ఆలా అయితే మీరు సాంబార్ లో కాలేసినట్టే. హ్హ హ్హ హ్హ. ఎందుకంటే నేనేమో తెలుగు, ఆయనేమో అరవం. మా conversation ఇలా ఉంటుంది:
"ఏమండి, ఇంద movie పొలామా?"
"Which movie"
"Lord of the Rings"
"evening ready ఆ ఇరు"
"what time ఇంటికి వరపోరే?"
"అంజు మనికి (ఐదు వెళ్ళు చూపిస్తూ)"
"సల్వార్ wear pannatumma, jeans wear pannatumma"?
"Why don't you wear a చీర today?
ఇది నిజ్జంగా నిజం. నేను exaggerate చెయ్యట్లా. ఇందులో ఉన్న మూడు languages ని మీరు ఇప్పటికే కనిపెట్టారు కదా.
ఏంటి? ఆయన మీద చాల మంచి మాటల్ని చెప్పి too much senti అయిపోతున్నానా? నాకు చిరాకు తెప్పించే పనులు కూడా చేస్తాడు ఒక్కొక్కసారి. అవి నెక్స్ట్ టపా లో చెప్తా.

Monday, July 13, 2009

బలె బలె
ఎప్పటినుంచొ (అంటె 2008 నుంచి) బ్లొగ్ రాద్దాము,రాద్దాము అనుకుంటె ఇప్పటికి కుదిరింది. అలా అని నెను యమ బిసి కాదండి బాబు. ఏదొ బద్ధకం. సరె ఇక మొదలుపెట్టాకదా. ఇక చూస్కొండి.