Monday, August 24, 2009

Nancy Drew నించి ఇల్లేరమ్మ కధల దాకా నా journey

చిన్నప్పుడు మాకు స్కూల్ నించి రాగానే టిఫిన్ తినే అలవాటుండేది. పొద్దున్నా, మధ్యాన్నం రెండు సార్లు అన్నం తింటామని అమ్మ మా మీద జాలి పడి ప్రతి సాయంత్రం టిఫిన్ చేసేది. బజ్జీలు, పకోడీలు, దోసెలు మా అమ్మకి టైం లేకపోతే ఉప్మా. ఈ ఉప్మా లో చాల రకాలు ఉండేవి బియాపు రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా.... సరే ఉప్మా సంగతి వేరే పోస్ట్ లో రాస్తా లెండి. చెప్పోచేదేంటంటే, మేము ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకోగానే, మా అమ్మ మా వైపు కోపంగా చూసేది. ఇక మేం చేసేది లేక చచ్చినట్టు టేబుల్ దగ్గర కూచుని తినేవాళ్ళం. అసలు సంగతేంటంటే మా ఇంట్లో అందరికి, (ఒక్క అమ్మ కి తప్ప) ఒక పిచ్చలవాటు (మా అమ్మ వాడే పదం) ఉంది. అదేంటంటే ఏదైనా తింటుంటే పుస్తకాలు చదవటం. మీరు చిన్న చాక్లెట్ ముక్క ఇవ్వండి, మేం పుస్తకాలు వెతుకుతాం తినే ముందర. మా నాన్న వాళ్ళింట్లో అందరికి ఈ రోగం (again, మా అమ్మ వాడే పదం) ఉంది. మేమెవ్వరమ్ పుస్తకాలు లేకుండా బ్రతక లేం. Period.

స్కూల్ లో ఉన్నప్పుడు tinkle, చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, పంచతంత్ర స్టోరీస్ (తెలుగు, ఇంగ్లీష్), టిన్-టిన్, Enid Blyton వ్రాసిన Famous Five, Five Find Outers and the Dog (ఇంకా చాల సిరీస్ ఉండేవి. పేర్లు గుర్తుకు రావట్లేదు) లాంటి పుస్తకాలన్నీ ఏక బిగిన దొరికినవి దొరికినట్టే చదివేదాన్ని. పుస్తకం మొదలు పెడితే ఫినిష్ చేసే వరకు ఆగేది లేదు. సమ్మర్ లో మా అమ్మ, నాన్న నేనేదో పాపం చాల మంచి పిల్లనని నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అన్ని కోనేసేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను maths, science పాఠాలన్ని చదివేసి ప్రిపేర్ అయ్యిపోతానని. మన దగ్గర అల్లాంటి పప్పులెం ఉడకవ్. సమ్మర్ హాలిడే లో చదువుకోడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఫ్రండ్స్ చూస్తే నవ్వుతారు కూడా. కాని మధ్యాన్నం ఎండ లో ఆడుకుంటే వడ దెబ్బ (అంటే ఎండ దెబ్బ, మనం తినే వడ కాదు) కొడుతుంది కదా? మనం లైబ్రరీ నించి తెచ్చుకున్న కామిక్స్ ముందురోజు రాత్రే చదివేస్తాం కదా? అందుకని, మధ్యాన్నం పూట చక్కగా, నెక్స్ట్ ఇయర్ తెలుగు, లేదా హిందీ లేదా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివేసుకోవాలన్న మాట. టెన్త్ క్లాసు అయ్యేవరకు ఇలా కాలక్షేపం చేశా.

ఇంటర్ కి వచ్చాక ఈ EAMCET గొడవలో పడి ఇంటికి ప్రతి నెల పేపర్ అబ్బాయి తీసుకొచ్చే చందమామ తప్ప పెద్ద పుస్తకాలేం చదవలే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు. అంత చిన్చేటట్టు చదివినా ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు, అది వేరే విషయం. ఇంటర్ అయ్యాక జూన్ లో మొదలు పెట్టా మళ్ళి పుస్తకాల పరంపర. ఇంక మనం ఆల్మోస్ట్ డిగ్రీ లోకోచ్చేసాం కదా. మనం చదివే పుస్తకాలు మనం డిసైడ్ చేసేసుకోవచ్చన్నమాట. అంటే ఇప్పుడింక నాన్న మనతో లైబ్రరీ కొచ్చి మనకి పుస్తకాలు సెలెక్ట్ చెయ్యరు. మనమే చేసుకోవాలి. మొదట్లో అయితే లైబ్రరీ కెళ్ళి బుక్స్ తెచ్చులోవటం, పెద్ద అడ్వెంచర్. అప్పుడు చదివానేను Nancy Drew ఇంక Hardy Boys ఏక బిగిన. మొత్తం లైబ్రరీ లో ఉన్న అన్ని టైటిల్స్ చదివేసా.

BSc లో ఉండగా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు Mills and Boon romances గురించి. ఇప్పుడు తలచు కుంటే నవ్వొస్తుంది ఆ పుస్తకాలు ఎంత exciting గా చదివేవాళ్ళం. అమ్మ కి తెలిస్తే తిడుతుందేమో అన్న భయం. అదే టైం లో నాన్న "Reader's Digest" తెప్పించేవారు. అది చదవటం అప్పుడు అలవాటు చేసుకున్నానంటే ఇప్పటికి మానలేదు. సరే తెలుగు నొవెల్స్ ని కూడా ఓ పట్టు పడదాం అని చెప్పి లైబ్రరీ కి వెళ్లి వెతికా. అందరు ఎండమూరి, ఎండమూరి అని ఒకటే తెగ చెప్పేస్తారు కదా, అసలు ఎవరా ఎండమూరి? ఏమా కధ అని చెప్పి వెన్నెల్లో ఆడపిల్ల చదివా. అంత ఇంటరెస్టింగ్ పుస్తకం నా ఫస్ట్ తెలుగు నోవెల్ అయ్యినందుకు నాకు ఇప్పటికి చాల సంతోషం గా ఉంది. ఆ నోవెల్ లో రమ్య ని రేవంత్ కి చూపించనందుకు ఇప్పటికి నాకు ఎండమూరి గారి మీద కోపమే.

తరవాత Scientific Fiction అలవాటయ్యిది. దాంతో పాటే Womens' Era, Femina లాంటి periodicals కూడా. ఇక్కడి కొచ్చాక లైబ్రరీ విషయం లో మాత్రం నాకైతే పండగే. ఒక బుక్ మనదగ్గర పది రోజులు పెట్టుకోవచ్చు. లైబ్రరీ లో ఒకే author వ్రాసిన పుస్తకాలన్నీ ఒక దగ్గరే ఉండడంతో అవన్నీ ఒక దాని తరవాత ఒకటి చదివి, ఆ రచయత స్టైల్ ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేదాన్ని. మంచి మంచి రచయితల పుస్తకాలు చదివి, ఆ రచయిత రైటింగ్ స్టైల్ ని analyze చేసి, ఆ analysis కి పుస్తక రూపం ఇవ్వాలని నా అభిలాష. "దానికి చాల టైం ఉందిలే. ముందు పుస్తకం సరిగ్గా చదవటం నేర్చుకో. ఒక లైన్ అర్ధం కాకపోతే పేజి తిప్పేస్తావ్" అంటారా? సరే. అలాగే కానీండి.

"That's the way the cookie crumbles", "house keeper of the professor" లాంటి సైన్స్ కి సంబంధించిన పుస్తకాలు ఇక్కదికోచ్చాకే చదివాను. Motivational reading మాత్రం నాకు అలవాటవ్వలె. క్రిందటి సంవత్సరం నా స్నేహితురాలు "ఇల్లేరమ్మ కథలు" పుస్తకం ఇచ్చింది. అది చదివి మా ఆయనకీ కూడా అనువాదం చేసి చెప్పాను. చిన్నపిల్లల పుస్తకాలతో మొదలైన నా పుస్తకాల పిచ్చి, ఇల్లేరమ్మ కధల దగ్గరకోచేసరికి ఒక phase complete అయ్యినట్టనిపిస్తోంది. ఇప్పుడింక చిన్న పిల్లల చేష్టలు మానీసి, కొంచెం intellectual పుస్తకాలు మొదలెట్టాలి. ఏమంటారు?

Sunday, August 16, 2009

మా ఇంటికి భోజనానికి రండి Part 3

2003 లో మా university కి ఒక కొత్త అమ్మాయి వచ్చింది (పేరా? కొంచెం సేపు అంజలి దేవి అనుకోండి). కొన్ని రోజుల తరువాత మేమిద్దరం మంచి ఫ్రండ్స్ అయ్యాం. ఒక రోజు వాళ్ళింటికి లంచ్ కి వెళ్ళా. ఉగాది పండగ అనుకుంటా. పులిహోర, బెండకాయ పులుసు, ఆనపకాయ కూర అంటూ మొదలెట్టిందతే. లిస్టు ఆగట్లేదు. ఎంత బాగా చేసిందంటే home touch ఉంది అన్నింటిల్లో. వాళ్ళింటికి అప్పటినుంచి ప్రతి నెల ఒక్కసారైనా వెళ్ళేదాన్ని(పిలిచినా, పిలవకపోయినా). మా అమ్మ మూడేళ్ళ క్రితం US వచ్చినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాం. ఇంక చూస్కోండి. మా అమ్మ ఒకటే సుత్తి. "నువ్వుకూడా వంట నేర్చుకోవాలి" అని. సరే ఆ తరవాత నా పెళ్లి జరిగింది. ఇక్కడ important విషయమేంటంటే, మా అత్తగారింటిలో అందరు భోజన ప్రియులే. మా సార్ తో సహా. అంటే ఎప్పుడు ఫుల్లుగా తింటారని కాదు. tasty గా ఉన్న dishes ని appreciate చేస్తారని అర్ధం. అబ్బ అర్ధం చేసుకోరు. సరే పెళ్ళయ్యాక కొన్ని రోజులకి మా అయన ఇందిర గారి మహానంది cooking బ్లాగ్ పరిచయం చేసారు (ఆ సైట్ లోనించే నేను మొదటి సారి కూడలి కి వచ్చింది). ఇందిర గారి పుణ్యమా అని నేను చించేసా. ఆవిడ ఏది చేస్తే నేనది రిపీట్ చెయ్యడం. కూరలు, పప్పులు, పులుసులు ఒకటేంటి? రెండు మూడు సార్లు అంజలి దేవి (మా ఫ్రెండ్)మా ఇంటికొచ్చి అదిరిపోయింది. "నువ్వేనా ఈ వంట చేసినది....." అని. వాళ్ళింటికి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేను ఏంటో తెలుసా? గోంగూర పప్పు, బీరకాయ కూర, సాంబార్, పులిహోర, వడియాలు (తను పెట్టలేదు లెండి, ఉరికే వేయించింది). పైగా మరుసట్రోజు మేము బయలుదేరేలోపు ఉప్మా కూడా చేసింది. దాంతో నాకు మళ్ళి lecture మొదలు. నీకసలు ఇలాంటివి తెలిదు. చూడు ఎంత తొందరగా breakfast చేసి పెట్టిందో. ఎవరైనా మనింటికొస్తే నువ్వు కూడా వాల్లతోపాటే లేట్ గా లేస్తావు. వాళ్ళు ఎ Dunkin Donuts లో కాఫీ తాగి వెళ్ళాల్సిందే అని. నాకైతే పిచ్చ కోపమొచ్చేసింది. ఇలా ఎవరు మంచిగా వంట చేసిన నాకే తగులుకునేతట్టుంది అని చెప్పి అసలు వంట వండడంలో ఉన్న basics నేర్చుంటే అందులో ఉన్న enjoyment అర్ధమవుతుందేమో అని అటు వైపు concentration పెట్టా. అప్పుడర్థమయ్యింది కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుస్తే చాలు వంట ఆదరకోట్టేయ్యచ్చని. For example, కూర ముక్కలు "cook" అవుతున్నప్పుడే ఉప్పు వేసేస్తే ఉప్పు మంచిగా absorb అయ్యి రుచి గా ఉంటుంది. ఈ విషయం నాకు ముందు తెలీదుగా? లాస్ట్ లో ఉప్పు వేస్తే ఏదో వెలితున్నట్టు అనిపించేది. ఏంటో అర్ధమయ్యేది కాదు. ఇల్లాంటి సంగతులు తెలిసాయిగా. ఇంక చూస్కోండి. చించేసా. మొన్న మా ఇంటికి ఫ్రండ్స్ ని పిలిచాం (భోజనానికి). Tofu curry, "Puli Kozumbu" (తమిళ వంటకం లెండి, నేర్చుకున్నా. Yeah), అరిటికాయ వేపుడు, బొప్పాసకాయ కూర, పాయసం చేశా. మా ఆయనేమో ములక్కాడ సాంబార్ చేసారు. ఆ రోజు టైం లేదు అందుకే తను ఒక్క వంటకం చేసి నన్ను బ్రతికించారు. ఆ వచ్చిన వాళ్ళు, పాయసం రౌండ్ complete అయ్యాకా "మీరు వంట బలే బాగా చేస్తారు ముఖ్యంగా ములక్కాడ సాంబార్ అదుర్స్" అని (నన్ను)పొగిడి వెళ్ళారు.
ప్చ్. ఎం చేస్తాం?......

Monday, August 10, 2009

మా ఇంటికి భోజనానికి రండి. Part 2

చాలా గొప్పగా వంట చేసే ఫ్రండ్స్ అని చెప్పాకదా. ఇప్పుడు ఆ ఫ్రండ్స్ ని గురించి తెలుసుకుందాం. సమ్మర్ లో 4th of july వీకెండ్ కి ఫ్రండ్స్ నయాగరా వెళ్దామంటే సరే అని రెడీ అయ్యా. ఒక couple, వాళ్ళ ఫ్రండ్స్ ఇద్దరు, నేను వెళ్దామని ప్లాన్. US కి వచ్చాక నా ఫస్ట్ ట్రిప్. తొమ్మిది గంటల ప్రయాణం. మాట్లాడుకుంటూ వెళ్తుంటే టైం తెలీలేదు. ఆ ఒచ్చిన ఫ్రండ్స్ ఇద్దరిలో ఒకతనేమో ఫార్మసి డిపార్టుమెంటు లో Ph.D చేస్తున్నాడు. అబ్బ దారి పొడుగునా ఒకటే సుత్తి. తెగ బోర్. ఇంకొకతనేమో microbiology లో Ph. D చేస్తున్నాడు. చెన్నై కుర్రోడు. పుస్తకాలు, సినిమాలు అంటూ చాల కబుర్లు చెప్పాడు. మూడు రోజులు చాల సరదాగా గడిచి పోయింది. ఇంటికొచ్చేసి నా గొడవలో నేను పడిపోయాను. ఒక వారం తరవాత తెగ బిజీ గ lab lo పని చేసుకుంటుంటే, నాకోసం ఎవరో వచ్చారంటే బయటకి ఒచ్చాను. చూస్తే chennai microbiology!!! ఎందుకోచ్చాడబ్బా అని అనుకుంటుంటే "I am making Dosa tonight. Stop by on the way home" అన్నాడు. ఇంతక ముందే చెప్పాకదా university లైఫ్ లో ఎవరైనా తినడానికి పిలిస్తే మాట్లాడకుండా వెళ్లి తినోచ్చేయ్యలని. సరే ఎలాగు వంట చెయ్యటానికి ఓపిక లేదు మంచి టైం లో invitation ఒచ్చిందిలే అని వెళ్ళా. కొబ్బరి చట్ని, ఆలూగడ్డ కూర తో నోట్లో పెట్టుకుంటే కరిగి పోయేటట్టు ఉన్నాయా దోసలు. ఇదేంట్రా దేవుడా. "ఆడపిల్లలు కూడా సిగ్గుపడేటట్లు నువ్విలా దోశలు వెయ్యతమేంటి బాబూ" మొహం మీదే అడిగేసా. "it is not that hard. making the batter just takes time" తీసి పారేసినట్టుగా నవ్వుతు సమాధానం చెప్పాడు. చెప్పొద్దూ, నాకైతే బలే సిగ్గేసింది. ఇది లాభం లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని బయటకి మాతం పళ్ళికిలించి, "dosa was really tasty. Thanks" అనేసి బయటపడ్డా. నెల రోజులాగి వాడిని (ఈ నెల రోజుల్లో చాల మంచి ఫ్రండ్స్ అయిపోయాం, అందుకే వాడు అనటం), వాడి కజిన్ ని కూడా పిలిచా డిన్నర్ కి. సరే ఆరవ జనాలు కదా అని, సాంబార్ attempt చేశా (MTR mix తో). తినేసి ఏమి పెద్ద comment చెయ్యకుండానే వెళ్లి పోయ్యరిద్దరూ. చెప్పొచ్చేదేంటంటే microbiology సహాయంతో ఆతరవాత నేను చాల dinner లు, lunch లు ఇచ్చాను. superb గా వంట చేస్తాడు. అతనికి తెలీని dish లేదు. అతను భోజనానికి పిలిచాడంటే జనాలు పనులాపుకుని మరీ వస్తారు. ఆ తరవాత ఎప్పుడు దోసలు చేయ్యలనిపించినా నా apartment లో చేసేవాడు. తనకి assistant లు ఇష్టం అట. తను దోసలు చేస్తుంటే మిగతా వాళ్ళందరూ మెక్కుతూనే ఉంటారు తప్ప హెల్ప్ చెయ్యరు. కాని నేను మాత్రం, serve చెయ్యటం, దోశ మీద కూర వెయ్యటం, పొడి వెయ్యటం, ఉల్లిపాయలు తరగటం చేస్తా కదా. అందుకని తతంగమంతా మా ఇంట్లో ఉండేది. Party అయ్యాక మా రూంమేట్స్ అనేవారు "క్లీన్ అప్ పెద్ద గోల కాని, ఫస్ట్ క్లాసు దోసలు తిన్నాం. నువ్వుకూడా అల మంచిగా దోశ చెయ్యటం నేర్చుకోరాదు, మనం ఎంచక్కా ప్రతి సండే దోసలు తినొచ్చు అని". అసలు సిసలైన point ఏంటంటే, ఆ (ఈ) మహానుభావుడికి మేము కలిసిన నాలుగేళ్ళకి నన్ను పెళ్లి చేసుకోవాలనే సంకల్పం ఒచ్చింది, మా పెళ్లి కూడా అయ్యింది. తనకైతే పెర్మనెంట్ అసిస్టెంట్ దొరికింది కాని ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిస్తే చాలు మా ఇంట్లో అయితే పెద్ద యుద్ధమే. ఏది ఓ పట్టాన నచ్చదు. కూర ముక్కల size దగ్గరినుంచి అంత perfect గా ఉండాల్సిందే. ఒక్కొక్కసారైతే భలే ఒళ్ళు మండిపోతుంది. కాని end result మాత్రం మహా tasty. 2000 లో నేను చేసిన సాంబార్ ఎలా ఉంది అనడిగితే నవ్వేసి ఊరుకుంటాడు. వాళ్ళ కజిన్ "అది సాంబారా? చా?" అంటాడు. ఆ సంగతి ఎవ్వరికి చెప్పొద్దని ఇద్దరి దగ్గర స్టాంపు పేపర్ మీద సంతకం తీసుకున్నా. మా ఇంట్లో డిన్నర్ party ల గురించి, ఇంకొక మంచి cook దోస్త్ గురించి నెక్స్ట్ పోస్ట్ లో చెప్తా. మా ఆయన తినటానికి టేబుల్ ముందర కూర్చున్నారు నాదే ఆలస్యం. వస్తా.

Thursday, August 6, 2009

మా ఇంటికి భోజనానికి రండి Part 1

అసలు... వీకెండ్ ఎందుకు? అహ ఎందుకని అడుగుతున్నా? అసలు వీకెండ్ ఎందుకంటే .... మనం పొద్దున్నే, అంటే ఎ ఎనిమిదిన్నరకో లేదా తోమ్మిదిన్నరకో లేచి, పదిన్నరకి బ్రష్ చేసి, మనకిష్టమొచ్చిన టిఫిన్ మెక్కి, ఎ ఒంటి గంటకో స్నానం చేసి, కొంచెం సేపు పడుక్కుని, లేచి, ఈమెయిలు చెక్ చేసుకుని, టీవీ చూసి, వంట చేసుకుని, తిని, వాకింగ్ కి వెళ్లి వచ్చి పడుకోవటానికి. ఇలాంటి ప్రశాంతమైన వీకెండ్స్ మనం ఎంజాయ్ చెయ్యటం చూసి, దేవుడికి జెలసి వచ్చి మన బుర్రలో ఒక ఆలోచన పెడతాడు. అదేంటంటే ఎవరినైనా లంచ్ కో లేదా డిన్నర్ కో పిలవటం.
ఇంక చూస్కోండి. ఫ్రైడే నించి మొదలవుతుంది గొడవ. మా అమ్మ ఎవరినైనా భోజన్ననికి పిలిస్తే టక టకా ఎలా వంట చేసేదో తెలీదు కాని, నాకైతే పెద్ద nightmare. అలా అని నాకు వంట చెయ్యడం రాదనుకోకండి. బాగానే వండుతాను.
కాకి పిల్ల కాకికి ముద్దు కదా, ఆ టైపు లో. వంట చేసేటప్పుడు నాకోచ్చే పెద్ద ప్రాబ్లం. Taste చెయ్యకపోవటం. చిన్నప్పుడు మా అమ్మ వంట చేసేటప్పుడు చూసేదాన్ని. ప్రతి వంటకాన్ని స్టవ్ ఆఫ్ చేసేముందర చెంచా తో తప్పకుండ రుచి చూడవలసిందే. ఇప్పుడు తెలుస్తోంది. నా వంటకి వంకలు పెట్టినట్టు మా అమ్మ వంటకి ఎవ్వరు వంకలు ఎందుకుపెట్టలేదో. అయినా రుచి చేసి చూద్దాం అన్న ధ్యాసే ఉండదు నాకు. సరే డిన్నర్ invitation విషయానికొస్తే.... హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు మనం కిచెన్ లో ఉన్న అమ్మతో మాట్లాడడానికి తప్పితే అటు వైపు వెళ్ళే ఛాన్స్ లేదు. At the most, అప్పుడప్పుడు కూరని మాడిపోవకుండా కలపటం, గిన్నెల మీద మూత పెట్టటం లాంటివి చేసేదాన్నేమో. ఇక్కడి కొచ్చాక, చదువుకున్నన్ని రోజులు university ఉన్న తొట్టి గ్యాంగ్ మన టైపు వాళ్ళే కాబట్టి ఎప్పుడైనా తినటానికి రమ్మన్నా, గమ్మునోచీసి తిని లాబులకి వెళ్లి పోయేవాళ్ళు. దీపావళి, హోలీ లాంటి పండగలకి మన ఇండియన్ స్టూడెంట్ అస్సోసిఅషన్స్ ఉండనే ఉన్నాయి. చక్కగా ఇంట్లో పూజ్చ్చేసుకునోచ్చేసి "Diwali Dhamaka" లో లాగించేయ్యటమే.
ఇలా మన ఇష్టం వచినట్టు మనం బ్రతుకుతున్న రోజుల్లో మన ప్రశాంతతని భంగ పరచటానికి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవేంటంటే, చాలగోప్పగా వంట చేసే స్టూడెంట్స్ మనకి ఫ్రండ్స్ అవ్వటం, లేదా మనకి పెళ్లి అవ్వటం. నా విషయం లో ఈ రెండు జరిగాయి. Details తరువాతి post లో.