Monday, October 26, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 1)


"ఆరోగ్యం జాగర్త అమ్మా, వేళకి సరిగ్గా తిను", "బ్యాంకు డ్రాఫ్టు జాగర్త గా పెట్టుకో తల్లి. మూర్తి అంకుల్ ఫోన్ నెంబర్ ఉంది కదా? ఎం అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి. బెంగ పెట్టుకోకు". "అక్కా, ఇదిగో FiveStar మళ్ళి ఎప్పుడు తింటావో ఏమో"

ఇలాగే ఉండేవి ఆ రోజుల్లో airport లో send-off లు. ఇప్పుడు ఇలాగే ఉంటాయి, కాకపోతే పరిస్థితులు మారాయి. అప్పట్లో (నేను చెప్పేది దాదాపు పదేళ్ళ క్రిందటి సంగతి) మనల్ని airport కి దిగపెట్టే వాళ్ళు మనం ఫ్లైట్ ఎక్కటం కన్నాల్లోంచి చూసేవారు హైదరాబాద్ airport లో. ఇప్పుడా సదుపాయం లేదు. నేను ఇక్కడికి మొదటి సారి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కటం రెండో సారి. వీసా వచ్చిన తరవాత మా నాన్న నన్ను తిరుపతి తీసుకెళ్ళి అక్కడనించి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకొచ్చారు. నాకు ఫ్లైట్ ఎక్కటం (మరియు దిగటం), బెల్ట్ మీదనించి సామాను తీయటం లాంటివి ప్రాక్టీసు చేయించటానికి. ఆయన చాదస్తం కాని, ఒక సారి సామాను కనిపిచించిన తరవాత దాన్ని తీయక చస్తానా? అసలే అందులో అమ్మ పెట్టిన పచ్చళ్లు, బాలాజీ mithai భండార్ లో కొన్న కలాకండ్, Concise Inorganic Chemistry - JD Lee లాంటి ముఖ్యమైనవి ఉంటేను.

ఎందుకో ఫ్లైట్ take off అప్పుడు బలే బెంగ వేసింది. కాని అమెరికా వెళ్తున్నాను అన్న ఆనందం ఆ బెంగని గుండెలో ఒక మూలకి నెట్టేసింది. మొత్తానికి Ahmedabad, Amsterdam తిరిగి, కొత్త పరిచయాలు చేసుకుంటూ, సర్టిఫికేట్ లు, passport, I-20, మరియు ముఖ్యంగా "assistantship letter" ఉన్నాయా లేదా అని మాటి మాటికి check చేసుకుంటూ చేరాల్సిన చోటికే చేరా. మధ్య మధ్య నాకొక వింతైన భయం కూడా వేసింది, కరెక్ట్ ఫ్లైట్ ఎక్కానా, లేదా అని. అవును మరి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కకుండా, ఒకే సారి ఇంత దూరం వస్తున్నప్పుడు భయం వేస్తుంది కదా? ఫ్లైట్ దిగంగానే మా university కి చెందిన ఇద్దరు సుందర వదనులు నన్ను రిసివ్ చేసుకున్నారు. వాళ్ళని "సుందర వదనులు" అని అనటానికి వెనకాల చాల ఫ్లాష్ బ్యాక్ ఉంది. దీని గురించి వేరే పోస్ట్ రెడీ చేస్తున్నా. ఇక నా కధలోకి వస్తే, ముందే రూమ్మేట్ ని మాట్లాడేసుకున్నా కాబట్టి నన్ను వాళ్ళు ఇంటి దగ్గరకి తీసుకొచ్చారు. నా రూమ్మేట్ ఆరోజు చుట్టుపక్కల ఉండే అందరిని డిన్నర్ కి పిలిచింది. అప్పుడు గమనించ లేదు కాని తరవాత అనిపించింది అందరు అబ్బాయిలే, ఒక్క అమ్మాయి కూడా లేదు. సరే, డిన్నర్ అయ్యింది అందరు వెళ్ళిపొయ్యారు. ఇక తరవాతి రోజు university కి వెళ్లి చించేయ్యడమే (అని అప్పుడు అనుకున్నా, తరవాత తెలిసింది, in front crocodile festival అని). "అమెరికాలో Week 1" వచ్చే వారం.

గమనిక: అసలైతే "అమెరికా లో Day 1" అని టైటిల్ పెడదామనుకున్నా, కాని మొదటి రోజు మైగ్రేన్ వచ్చి పడుకున్నా కాబట్టి మొదటి రోజు was not very eventful.
వేమూరి వెంకటేశ్వర రావు గారు (నా అమెరికా ప్రయాణం) వ్రాసినంత ఇంటరెస్టింగ్ గా వ్రాయలేనేమో కాని, నా అనుభవాల్ని మీ అందరితో పంచుకోవాలని కోరిక. రేపు కలుస్తా.

Tuesday, October 13, 2009

తెలుగు సినిమా లో నాకు తెలిసిన కామెడీ కారులు (అంటే..... comedians అన్నమాట)



లాంగ్, లాంగ్ అగో సో లాంగ్ అగో,.... నేను తెలుగు సినిమాలు విచ్చల విడిగా చూసే రోజుల్లో.... వద్దులెండి, ఉపోద్ఘాతం టూ మచ్ గా ఉంది. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. ఇదిగో వచ్చేసా.
నేను మొదట మొదట తెలుగు సినిమాలు చూడటం రెండో క్లాసు లో అనుకుంటా మొదలెట్టా. మోస్ట్ అఫ్ ది టైం అవి NTR లేదా ANR హీరోలు గా ఉండే సినిమాలే. వాటిల్లో నాకు బాగా గుర్తున్న కమెడియన్ రాజబాబు. అతని డైలాగ్లు నాకు అంతగా గుర్తు లేవు. కాని సన్నగా ఉండే ఆ మనిషి, తాగుబోతు రోల్ చేస్తున్నప్పుడు పడిపోతూ మాట్లాడటం మాత్రం బాగా గుర్తుంది. ఆ తరవాత తెలుగు సినిమాలల్లో నాకు గుర్తున్నంతవరకు గొప్ప కమెడియన్లు సుత్తి pair. సుత్తి అనే మాట "నాలుగు స్తంభాలాట" లో అనుకుంటా మొదట introduce చేసారు. ఆ పిక్చర్ లో వాళ్ళ కామెడీ మాత్రం సూపర్. రక రకాల సుత్తులని డిఫైన్ చేసి చెప్పే డైలాగ్ కత్తి గా ఉంటుంది. కొన్ని రోజుల తరవాత శ్రీవారికి ప్రేమలేఖ అని ఇంకో సినిమా వచ్చింది. మా అమ్మ సాధారణం గా సినిమాలకి వెళ్ళదు. మా అమ్మ రావాలి అంటే చాల కండిషన్స్ ఉంటాయి. అది కే. విశ్వనాధ్ సినిమా అయి ఉండాలి, ఒక్క అసభ్యకరమైన మాట కాని, సీన్ కాని ఉండకూడదు.... ఇలా పలురకాలుగా ఉంటాయా కండిషన్స్. అలాంటిది మా అమ్మని కూడా ఆ సినిమాకి రెండో సారి తీసుకెళ్ళాం. సినిమా లో కామెడీ ని మా అమ్మ బాగా ఎంజాయ్ చేసింది. తరవాత చాలా రోజులు మన సుత్తి ద్వయం తెలుగు సినిమా లో unbeatable గానే ఉన్నారనుకుంటా. తరవాత కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కూడా చాల రోజులే నడిపించారు. కాకపోతే కోట కొన్ని విలన్ రోల్స్ కూడా వెయ్యడంతో ఆయన ని నేనెప్పుడు established కమెడియన్ కింద లేక్కకట్టలేదు. Then, one fine day .....ENTER అరగుండు బ్రహ్మనందం. కామెడీ లో అతనికి అతనే సాటి (at least, in my opinion). ఒక పిసినారి (కోట) దగ్గర పనివాడి రోల్ లో అదరగొట్టాడు. సినిమా పేరు గుర్తు లేదు. అందులో తిట్లు, "beach దగ్గర రొయ్యలు అమ్ముకునే మొహం" ఈ టైపు లో ఉంటాయి. పదేళ్ళ క్రితం ఇక్కడ కొచ్చినప్పటినుంచి సినిమాలు చూడటం తగ్గించాను. అందుకే సునీల్ గురించి నాకంతగా తెలీదు. ఇంక females లో మాత్రం శ్రీలక్ష్మి. Her expressions and dialogue delivery are totally worth watching the movie.
తెలుగు సినిమాల్లో నాకు నచ్చిన కొన్ని కామెడీ సన్నివేశాలు/dialogues:

నాలుగు స్తంభాలాట: దేఫినిషన్స్ ఫర్ సుత్తి. ఇందులో బెస్ట్ "reverse hammering"
____________ : కోట శ్రీనివాసరావు కోడి ని వేలాడకట్టి అన్నం తినటం.
చంటబ్బాయి: చిరంజీవి, సుత్తి వేలు, సాక్షి రంగారావు (చెవిటాయన) conversation.
చంటబ్బాయి: సుత్తి వీరభద్ర రావు భీమవరం ని "Kunti's second son's boon" అనటం. (ఇది మా ఆయనకీ కూడా అర్ధం అయ్యింది)
చంటబ్బాయి: శ్రీలక్ష్మి, పొట్టి ప్రసాద్ conversation. "నన్ను కవిని కానన్న వాడ్ని కతి తో పొడుస్తా, నన్ను రచయిత్రి ని కానన్న వాడ్ని రాయెత్తి కొడతా"
శ్రీవారికి ప్రేమలేఖ: మిశ్రో "మీ అబ్బాయి పెళ్ళికి, నా గుండు కి, సంబంధం ఏంటి మహాప్రభో?"

ఇలా చెప్పుకు పోవాలంటే చాలానే ఉన్నాయి. కాని నాకు అతి ఇష్టమయిన సన్నివేసం ఏంటంటే... సినిమా పేరు గుర్తులేదు కాని, బ్రహ్మానందం- గుండు హనుమంత రావు, రాముడు-హనుమంతుడు వేషంలో వచ్చి శ్రీలక్ష్మి ని మోసం చెయ్యటం.

కొన్ని రోజులు తెలుగు సినిమా కామెడీ తో కాలక్షేపం చేద్దాం. మీకిష్టమయిన డైలాగ్ లు లేదా సీన్లు ఉంటె నా బ్లాగ్ లో కామెంట్ల ద్వారా పంచుకోండి మరి.