సరే. ఒక రోజు International Farmer మార్కెట్ కి వెళ్ళా. మిరప కాయలు ఎరుతుంటే నా పక్కనే ఒక తెలుగు దంపతులు నిలబడ్డారు. ఒక నల్ల షర్టు అబ్బాయి వచ్చి "excuse me where is the nearest walmart" అన్నాడు. వేల్లేదో చెప్తుంటే నాకెందుకో అనుమానం వచ్చి తప్పుకున్నా. రెండు వారాల తరవాత మల్లి వెళ్ళినప్పుడు అదే అబ్బాయి ఇంకొక తెలుగు జంట కి సుత్తి వేస్తున్నాడు. సరేలే మనదగ్గరకొస్తే చూద్దాం అని నా పని నే చేసుకు పోతున్నా. ఇంతలో ఇంకొక అతను వచ్చి ఆవిడ తో "బయలు దేరుదామా అండి, చాలా లేట్ అయ్యింది" అంటే వాళ్ళు అతని దగ్గర నుంచి తప్పుకున్నారు. తరువాత వాళ్ళు అతనితో "కరెక్ట్ టైం కి వచ్చారండి. గంట నించి భరించ లేక చస్తున్నాం. జిడ్డు లాగ వదిలి పెట్టడు" అన్నారు. నేను ఎప్పుడు శనివారం నాలుగు గంటల టైం లో వెళ్ళేదాన్ని. దాదాపు ప్రతి సారి కనిపించేవాడు. కాని నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి నేను మా ఆయనా వెళ్ళాం. మిరపకాయల దగ్గరే "excuse me " అని వినిపించింది. చూస్తే మన ఫ్రెండు. మా ఆయన దగ్గర కొచ్చి"వేర్ ఇస్ ది నేఅరేస్ట్ వాల్మార్ట్" అన్నాడు. ఓరిని యాడాది నించి వాల్మార్ట్ వెతుకుతున్నావా నాయనా అనుకుని, మా ఆయనకీ భరతనాట్యం లో సైగలు చేసాను. ఇప్పటికే ఈ శాల్తి గురించి చెప్పానేమో, మా ఆయన "ఐ డోన్ట్ నో" అన్నారు.
పట్టువదలని విక్రమార్కుడు: "are you new to this place"
మా ఆయన:"kind of "
ప వి: "where do you work "
ప వి: "where do you work "
మా ఆ:"I don 't work "
ప వి:"సో యు are a student "
మా ఆ:"yeah "
ప వి:"what are you studying ?"
మా అ:"పి హెచ్ డి "
ప వి:"ఇస్ ఇట్ ట్రు దట్ యు పీపుల్ గెట్ paid a lot "
మా ఆ: "హి హి హి"
ప వి:"సో యు are a student "
మా ఆ:"yeah "
ప వి:"what are you studying ?"
మా అ:"పి హెచ్ డి "
ప వి:"ఇస్ ఇట్ ట్రు దట్ యు పీపుల్ గెట్ paid a lot "
మా ఆ: "హి హి హి"
ప వి:"she is your missusఆ?" (నన్ను చూపించి)
యింక నాకు ఒళ్ళు మండి మా ఆయన కేసి చూసి "షాల్ వి గో?" అన్నాను. తెలుగు మాట్లాడితే తెలుగు లో కొడతాడని నా భయం.
మొత్తానికి ఫోన్ నెంబర్ ఇవ్వ కుండా బయట పడ్డాం. ఆ తరవాత ఆ మార్కెట్ తీసెయ్యడం తో వేరే చోటికి వెళ్తున్నాను. అక్కడెందుకో కనిపించటం లేదు.
యింక నాకు ఒళ్ళు మండి మా ఆయన కేసి చూసి "షాల్ వి గో?" అన్నాను. తెలుగు మాట్లాడితే తెలుగు లో కొడతాడని నా భయం.
మొత్తానికి ఫోన్ నెంబర్ ఇవ్వ కుండా బయట పడ్డాం. ఆ తరవాత ఆ మార్కెట్ తీసెయ్యడం తో వేరే చోటికి వెళ్తున్నాను. అక్కడెందుకో కనిపించటం లేదు.
ఒక రోజు ట్రైన్ లో వెళ్తుంటే ఒక దేశి అబ్బాయి ఎక్కడో చూసినట్టు కనిపిస్తే రెండు మూడు సార్లు అతని వైపే చూసాను. అతను నన్ను చూడగానే చాలా ఇబ్బంది గా అనిపించి "I am sorry I did not mean to stare at you. You look very familiar" అంటే అతను నావైపు ఒక లుక్కిచ్చి "yeah you are from so and so marketing right" అన్నాడు. "No I am not" అని అతనితో గట్టిగా అన్నానే కాని చాలా సిగ్గనిపించింది. ఈ మార్కెటింగ్ ల పుణ్యమా అని మన దేశీయులు కనిపిస్తే కనీసం నవ్వటానికి కూడా లేదు.
ఇలాంటి అనుభవాలు ఫ్రండ్స్ చెప్పినవి ఎన్నెన్నో. మాల్స్ లో, వాల్మార్ట్ లో ఇంకా చాల చోట్ల. ఈ గొడవేమిటో, ఎప్పుడాగుతుందో? దార్లో నిలబెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టటం ఎప్పుదాపుతారో ఏమో? మీకు ఉన్నాయా అనుభవాలు. అయితే చెప్పండి మరి.అసలు నాకేమనిపిస్తోందంటే వీసా stamping అవ్వంగానే ఇక్కడికొచ్చే జనాలకి ఈ విషయం మీద క్లాసు తీసుకుని పంపిస్తే బెటర్ అని. ఏమంటారు?