Monday, October 26, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 1)


"ఆరోగ్యం జాగర్త అమ్మా, వేళకి సరిగ్గా తిను", "బ్యాంకు డ్రాఫ్టు జాగర్త గా పెట్టుకో తల్లి. మూర్తి అంకుల్ ఫోన్ నెంబర్ ఉంది కదా? ఎం అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి. బెంగ పెట్టుకోకు". "అక్కా, ఇదిగో FiveStar మళ్ళి ఎప్పుడు తింటావో ఏమో"

ఇలాగే ఉండేవి ఆ రోజుల్లో airport లో send-off లు. ఇప్పుడు ఇలాగే ఉంటాయి, కాకపోతే పరిస్థితులు మారాయి. అప్పట్లో (నేను చెప్పేది దాదాపు పదేళ్ళ క్రిందటి సంగతి) మనల్ని airport కి దిగపెట్టే వాళ్ళు మనం ఫ్లైట్ ఎక్కటం కన్నాల్లోంచి చూసేవారు హైదరాబాద్ airport లో. ఇప్పుడా సదుపాయం లేదు. నేను ఇక్కడికి మొదటి సారి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కటం రెండో సారి. వీసా వచ్చిన తరవాత మా నాన్న నన్ను తిరుపతి తీసుకెళ్ళి అక్కడనించి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకొచ్చారు. నాకు ఫ్లైట్ ఎక్కటం (మరియు దిగటం), బెల్ట్ మీదనించి సామాను తీయటం లాంటివి ప్రాక్టీసు చేయించటానికి. ఆయన చాదస్తం కాని, ఒక సారి సామాను కనిపిచించిన తరవాత దాన్ని తీయక చస్తానా? అసలే అందులో అమ్మ పెట్టిన పచ్చళ్లు, బాలాజీ mithai భండార్ లో కొన్న కలాకండ్, Concise Inorganic Chemistry - JD Lee లాంటి ముఖ్యమైనవి ఉంటేను.

ఎందుకో ఫ్లైట్ take off అప్పుడు బలే బెంగ వేసింది. కాని అమెరికా వెళ్తున్నాను అన్న ఆనందం ఆ బెంగని గుండెలో ఒక మూలకి నెట్టేసింది. మొత్తానికి Ahmedabad, Amsterdam తిరిగి, కొత్త పరిచయాలు చేసుకుంటూ, సర్టిఫికేట్ లు, passport, I-20, మరియు ముఖ్యంగా "assistantship letter" ఉన్నాయా లేదా అని మాటి మాటికి check చేసుకుంటూ చేరాల్సిన చోటికే చేరా. మధ్య మధ్య నాకొక వింతైన భయం కూడా వేసింది, కరెక్ట్ ఫ్లైట్ ఎక్కానా, లేదా అని. అవును మరి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కకుండా, ఒకే సారి ఇంత దూరం వస్తున్నప్పుడు భయం వేస్తుంది కదా? ఫ్లైట్ దిగంగానే మా university కి చెందిన ఇద్దరు సుందర వదనులు నన్ను రిసివ్ చేసుకున్నారు. వాళ్ళని "సుందర వదనులు" అని అనటానికి వెనకాల చాల ఫ్లాష్ బ్యాక్ ఉంది. దీని గురించి వేరే పోస్ట్ రెడీ చేస్తున్నా. ఇక నా కధలోకి వస్తే, ముందే రూమ్మేట్ ని మాట్లాడేసుకున్నా కాబట్టి నన్ను వాళ్ళు ఇంటి దగ్గరకి తీసుకొచ్చారు. నా రూమ్మేట్ ఆరోజు చుట్టుపక్కల ఉండే అందరిని డిన్నర్ కి పిలిచింది. అప్పుడు గమనించ లేదు కాని తరవాత అనిపించింది అందరు అబ్బాయిలే, ఒక్క అమ్మాయి కూడా లేదు. సరే, డిన్నర్ అయ్యింది అందరు వెళ్ళిపొయ్యారు. ఇక తరవాతి రోజు university కి వెళ్లి చించేయ్యడమే (అని అప్పుడు అనుకున్నా, తరవాత తెలిసింది, in front crocodile festival అని). "అమెరికాలో Week 1" వచ్చే వారం.

గమనిక: అసలైతే "అమెరికా లో Day 1" అని టైటిల్ పెడదామనుకున్నా, కాని మొదటి రోజు మైగ్రేన్ వచ్చి పడుకున్నా కాబట్టి మొదటి రోజు was not very eventful.
వేమూరి వెంకటేశ్వర రావు గారు (నా అమెరికా ప్రయాణం) వ్రాసినంత ఇంటరెస్టింగ్ గా వ్రాయలేనేమో కాని, నా అనుభవాల్ని మీ అందరితో పంచుకోవాలని కోరిక. రేపు కలుస్తా.

2 comments:

  1. I can really post any thing in telugu here some how. SO I am typing in english. good one. we can write couple of episodes about our first time flight experience. Isn't it?

    ReplyDelete