Monday, November 2, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 2)- అమెరికా లో నా మొదటి వారం

మొదటి రోజు లేవగానే మా రూం మేట్ (పేరు కొంచెం సేపు సావిత్రి అనుకోండి) అంది "నేను lab కి వెళ్తాను, ఏది కావాలంటే అది తిను. ఇవాల్టికి కొంచెం సేపు రెస్ట్ తీసుకో. రేపు స్కూల్ కి తీసుకెల్తా" అని. స్కూలా? ఇదేంటి రా దేవుడా. తరవాత తెలిసింది ఇక్కడ university కి మరో పదం స్కూల్. ఆ రోజు పెద్ద చెప్పాల్సిన విషయాలేవీ జరగలేదు. రోజంతా పడుకుని, మధ్య, మధ్యన లేస్తూ, ఫ్రిజ్ లో కనపడే ప్రతి వస్తువు రుచి చూస్తూ గడిపేసా. సరే తరవాతి రోజు కృష్ణ అని మా డిపార్టుమెంటు అబ్బాయి, నేను, సావిత్రి బయలుదేరాం. అసలే జనవరి నెల. నార్త్ ఈస్ట్ లో చలి పిచ్చ, పిచ్చగా ఉంది. సావిత్రి ఇచ్చిన jacket వేసుకున్నా వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది. చిన్నప్పుడు నేర్చుకున్న "wood is a bad conductor of heat........." పాఠం గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు బిల్డింగ్ లోపలి చేరతాం రా బాబు అనుకుంటూ డిపార్టుమెంటు కి చేరా. కృష్ణ నన్ను అందరికి పరిచయం చేస్తూ మధ్యలో ఎటో తప్పిపోయ్యాడు. సరే advisor రూం కి వెళ్దాం అని ఆయన రూపం గుర్తు తెచ్చికోవటానికి ట్రై చేశా. మన పదహారణాల తెలుగాయన నన్ను ఆదరించక పోతాడా అనుకున్నా. నా పప్పులేవి ఆయన దగ్గర ఉడకలా. వెళ్ళిన రెండు నిమిషాల్లోనే ప్రాజెక్ట్ ఎక్ష్ప్లైన్ చెయ్యడం మొదలెట్టాడు. నాకు కొంచెం అర్ధమవుతోంది (మరి కొంచెం అర్ధమవ్వట్లేదని మీకర్ధమయిపోయ్యుంటుంది కదా). సరే అదయ్యాక రోజు ఎన్ని గంటలకి రావాలి, వారానికి ఎంతసేపు పనిచెయ్యాలి, ఏడాదికి ఎన్ని పేపర్స్ publish చెయ్యాలి ....... పేపర్స్ publishing ఎంటబ్బా? అనుకున్నా. తరవాత తెలిసింది దాని సంగతి. మొత్తం గంట సేపు ఒక్క తెలుగు ముక్క మాట్లాదలేదాయన. అప్పుడు "అబ్బో, పొగరు" అనుకున్నా కాని తరవాత తెలిసింది (తెలుగు) faculty అందరు అలాగే ఉంటారని. మిగతా భాషల వాళ్ళ గురించి నాకు తేలేదు సుమా.


ఇక ఆ తరవాతి రోజు నేను, సావిత్రి A&P కి వెళ్ళాం. అదో కొత్త అనుభవం. కాని సావిత్రి కి వాళ్ళ fiance (ఇప్పుడు హస్బెండ్) కి నేను చాల థాంక్స్ చెప్పాలి. నేను అస్సలు బెంగ పడకుండా నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. నాకు పరిచయమయిన ఇంకొక couple V and B. నన్ను పరిచయం చేసుకుని, నాకు కావాల్సిన వన్ని లిస్టు వ్రాయించి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమోస్తుందో చెప్పి, షాపింగ్ కి తీసుకు వెళ్లి, మొదటి వారం ప్రతి రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడి, నాకు చాల హెల్ప్ చేసారు.


తరవాత రోజు TA orientation. ఓరి వీళ్ళ TA దొంగలెత్తుకెళ్ళ!!!! ఎంత సుత్తి కొట్టి చంపేసారనుకున్నారు. నేను కూడా teaching చేసాను కాని నన్ను ఇంత ఎవ్వరు భయపెట్టలేదు. "ప్రతీది document చెయ్యండి. స్టూడెంట్స్ తో అనవసరం గా మాట్లాడకండి, మీరు, స్టూడెంట్ ఒక రూం లో ఉన్నప్పుడు తలుపు దెగ్గర వెయ్యకండి....." ఇదే గోల. ప్రతీ దానికి పర్యవసానం "This might result in the cancellation of your assistantship" అని మాత్రం మర్చి పోకుండా చెప్పేవారు. తరవాతి రోజేమో placement tests. వీటి గురించి ముందే చెప్పారేమో నేను తెగ prepare అయ్యా. అక్కడికెళ్ళి చూస్తే ఏవిటో వింత వింతగా ఉన్నాయి ప్రశ్నలన్ని. మొతానికి అయ్యిందని పించా. సాయంత్రం వెళ్లి చూస్తే ఏముంది కొన్నింటిలో పాసయ్యాం, కొన్నింటిలో లేదు. మా దేశం లో మేం చదివామమ్మా అయినా ఎవ్వరు మమ్మల్ని ఇలా హింస పెట్టలేదు. సరే పాస్ అయ్యిన పేపర్స్ లో కోర్సు తీసుకోఖరలేదు. మిగతావాతిల్లో తీసుకోవాలి అన్నారు. సరే అని చెప్పి క్లాస్ కి రిజిస్టర్ చేసుకుని, ఆ వారానికి బయట పడ్డా. ఆ రోజు నేను సావిత్రి తో కలిసి మాల్ కి వెళ్ళా. నా ఫస్ట్ మాల్ ట్రిప్ బలే సరదాగా ఉండింది. మొదటివారం లో అమెరికాలో నేను తిన్న కొత్త పదార్ధాలు "swiss roll", "fresh pretzel", taco bell వారి bean burrito. నా మొదటి సెమెస్టర్ అనుభవాలు వచ్చే భాగం లో.

2 comments:

  1. మీ జ్ఞాపకాలు - కలలు ఆసక్తికరంగా ఉన్నై. కొన్ని ఛాయా చిత్రాలు జోడించండి.

    ReplyDelete
  2. మిమ్ములను పరిచయం చేస్తూ ఆయన తప్పి పోయాడా మీరు తప్పి పోయార.. బాగున్నాయి మీ అమెరికా విసేషాలు, వచ్చిన కొత్తలో బిక్క మొహం వేసి చుసే అమ్మాయి కనపడింది కళ్ళ ముందు. తెలుగోళ్ళు తెలుగు లో మాట్లాడితే స్టూడెంట్స్ ఎద్వాంటేజ్ తీసుకుంటారని ప్రొఫెసర్ ల నమ్మకం ఇక్కడ. తరువాత మీకు అర్ధం అయ్యే వుంటుంది కదా

    ReplyDelete