Tuesday, November 10, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 4): రీసెర్చ్ ల్యాబ్ లో నా అనుభవాలు

మా advisor మొదటి రోజు ల్యాబ్ కి వెళ్ళినప్పుడు బోలెడు రీసెర్చ్ పేపర్లు, ఒక ల్యాబ్ నోట్ బుక్ ఇచ్చి "ల్యాబ్ తలుపు కి ఎడమ పక్కనున్న డెస్క్ నీది. ఇదిగో ల్యాబ్ తాళం" అని ఒక లాంటి shape లో ఉన్న, స్టీల్ మరియు ప్లాస్టిక్ తో చేసిన gadget ని చేతిలో పెట్టారు. చాలా రోజుల క్రితం "జడ పదార్ధం" అనే ఒక మాట విన్నాను. దాని అర్ధం నాకు తెలీదు కాని నా ల్యాబ్ తాళం చెవి చూడగానే ఆ మాట గుర్తొచ్చింది (ఎందుకో తెలీదు). తాళం ఇలా ఉందేంటి అనుకుంటూ ల్యాబ్ కి వెళ్తే, గ్రాడ్ స్టూడెంట్ ఒకడు "ఇది ప్రోగ్రామబుల్ కీ. దీనిని activate చేసి నీకిచ్చారు. నువ్వు graduate అయ్యాక దీన్ని deactivate చేస్తారు" అన్నాడు. సుబ్భరంగా ఒక తాళం చెవి ఇవ్వచ్చుగా? సరే లోపలికెళ్ళి డెస్క్ దగ్గర కూర్చున్నా. నా జీవితం లో రాబొయ్యే ఐదున్నర సంవత్సరాలు ఆ డెస్క్ దగ్గరే కాలం గడిపెస్తానని నాకప్పుడు తెలీదు.

నిజం చెప్పాలంటే, నాకసలు కంప్యూటర్ వాడటం అంత పెద్దగా తెలీదు (పెద్దగా ఏంటి? అస్సలు తెలీదు). డిపార్టుమెంటు సర్వర్, దాని పాస్ వర్డ్స్ లాంటి చిన్న చిన్న basics అన్నిటికి ఒక రోజు పట్టింది. దానికి తోడు మధ్యలో నా TA పని ఎలాగో ఉండేది. నేను ల్యాబ్ లో సమ్మర్ సెమెస్టర్ లో జాయిన్ అయ్యాను. అందుకని నేను తీసుకునే కోర్సు లేమి లేవు. దాంతో మా advisor చెలరేగి పొయ్యేవాడు. తరవాత నాకు అర్ధమయ్యిందేంటంటే, రీసెర్చ్ faculty ఎవ్వరు సమ్మర్ లో టీచింగ్ చెయ్యరు కాబట్టి, పొద్దస్తమానం ల్యాబ్ లోనే ఉండి, మన ప్రాణాలు తీస్తారు అని.

ఇక్కడ మీకందరికీ కొంచెం జ్ఞానోదయం చేస్తా వినుకోండి. హ్మహ్మ్ .... (గొంతు సవరించుకుంటున్న నేను)
advisorలు పలు రకములు.
ప్రతి రోజు మన ప్రాణాలు తింటూ, ప్రతి క్షణం మన జీవితాని stress భరితం చేసి మనల్ని నాలుగు లేక నాలుగున్నర సంవత్సరాలలో Ph.D తో బయటకి నెట్టే వాళ్ళు మొదటి రకం. వీళ్ళని భరించలేక చాలా మంది MS తో బయట పడటమో లేక advisor మార్చుకోవటమో, లేక వేరే కాలేజీ కి వెళ్లి పోవటమో చేస్తారు.
అప్పుడప్పుడు (అంటే రెండు నెలలకోసారి) మన జీవితం మీద మనకి విరక్తి కలిగేతట్టుగా, పోయిన సంవత్సరం data కి సంబంధించిన power point ని లేదా మనం బ్యాక్ అప్ తీసుకోవటం మర్చిపోయిన data ని అడిగి, సమ్మర్ funding కూడా ఇచ్చి, మనల్ని personal లెవెల్ లో చాల బ్రహ్మాండంగా ఆదరించి, సమ్మర్ లో ఒకరోజు మొత్తం వాళ్ళ ఇంట్లో ల్యాబ్ పార్టీ ఇచ్చి అయిదు లేదా అయిదున్నర సంవత్సరాల్లో మనల్ని పంపించే రకం రెండోది. మా advisor రెండో రకం. వీళ్ళకి ప్రతి రోజు ప్రొడక్టివిటీ కావాలి.
మా ల్యాబ్ లో ప్రతి వారం advisor తో individual meeting ఉండేది. దానికి తోడు నెలకోసారో, రెండు నేలలకోసారో గ్రూప్ మీటింగ్స్ ఉండేవి. ఆయన చాల intelligent. ల్యాబ్ లో ప్రతి instrument ఆయనకి కొట్టిన పిండి. ప్రతి రోజు మమ్మల్ని guide చేస్తూ హెల్ప్ చేసేవాడు.
మనం ల్యాబ్ కి ఎప్పుడు వస్తున్నాము అన్న విషయానికి కాకుండా, అసలు పని ఎంత జరుగుతోంది, ఎంత ప్రొడక్టివిటీ ఉంది అన్నది గమనిస్తూ మనల్ని guide చేసే రకం మూడోది. వీళ్ళు ideal advisors.
ఇంక నాలుగో రకం ఏంటంటే, మనల్ని అస్సలు పట్టించుకోకుండా, ఆరేళ్ల తరవాత "I am not happy with the progress of your project. Please leave with MS" అని ఖంగు తినిపించేవారు, లేదా thesis defending seminar లో స్టూడెంట్ ని ఫెయిల్ చేసేవారు నాలుగో రకం. వీళ్ళు మహా dangerous.


నేను నా మొదటి రీసెర్చ్ publication వ్రాసినప్పుడు చూడాలి నా పాట్లు. వ్రాసింది కొట్టేసి, దానినే వేరేలాగా వ్రాస్తే బాగులేదని చెప్పి మళ్లి పాత దానిలాగే వ్రాయించి అబ్బబ్బబ్బా .... మొతానికి పద్దెనిమిది వెర్షన్ లు అయ్యినతరవాత దానిని జర్నల్ కి పంపితే reviewer లు దానిని చీల్చి, చెండాడి మళ్లి మనకి తిప్పి పంపితే, వాళ్లకి కావాల్సిన experiments మనం మళ్లి చేసి, వాటికి explanation జత చేసి మనం పంపితే, అది వాళ్లకి నచ్చితే అప్పుడు మన పేరు మనం scientific journal లో చూసుకోవచ్చు.

Experiment లు అన్ని అంత సులభంగా , సునాయాసంగా జరిగిపోతాయా అంటే అదీ లేదు. మన ల్యాబ్ లో జనాలు ఎక్కువగా లేక పోతే పరవాలేదు. చాలా మంది ఉన్నారనుకోండి, ఇక ముందు రోజు నుంచి మొదలవుతాయి పాట్లు. Instrument రిజర్వు చేసుకోవాలి ముందు. "అమ్మాయివి కదా నీకే first preference ఇవ్వాలి" అని ఒక కుళ్ళు మోతు దేశి స్టూడెంట్ అంటే, "If you cannot get here by 10.00 tomorrow, can I get started on it?" అని మరో punctual గ్రాడ్ స్టూడెంట్ అంటాడు. ఎలాగో చచ్చి చెడి instrument మనదయ్యింది అనుకున్నాక, అందులో ఎ filter ప్రోబ్లేమో ఏదో తగలడుతుంది. ఇంక కంపెనీ వాడికి ఫోన్లు. వాడు చెప్పిన trouble shooting తో పనయ్యిందా సరి. లేదు, వాడిని పిలవటమో, లేదా instrument ని వాడి దగ్గరకి పంపించతమో చెయ్యాలి. అది ఫ్రీ గా అవ్వదు కదా. అందుకని మనం advisor దగ్గర lecture తినాలి "you need to remember to maintain the instrument properly" అని. అదంతా అయ్యాక అప్పుడు మన సోల్యుషనో, మరోటో అందులో పోస్తే అప్పుడోస్తుంది మనకి result. ఆ result మనకి, మన advisor కి నచ్చితే, మనం టట్ట టాడా, టట్ట టాడా అని డాన్స్ చేసుకుంటూ ఇంటికెళ్ళి వంట చేసుకుని, వేడి వేడి గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తినొచ్చు. మనకి కాని, advisor కి కాని, లేదా ఇద్దరికి కాని నచ్చలేదనుకోండి మనం subway కి వెళ్లి, బాధగా ఓ సాండ్ విచ్ మెక్కి, లైబ్రరీ కి పొయ్యి అసలు మనం చేసిన తప్పేంటి, ఇల్లాంటి తప్పు ఇంతక ముందు ఎవరైనా చేసారా? దాన్ని ఎలా solve చెయ్యాలి అని లిటరేచర్ సెర్చ్ చెయ్యాలి.

ఇలా మూడు experimentలు , ఆరు resultలు అన్నట్టు మన జీవితం కొన్ని రోజులు గడిచాక, మన పేరు మీద ఒకటో రెండో publications వచ్చాక మన మీద Ph.D qualifiers అని ఒక అస్త్రం విసరబడుతుంది. దానిని ఎదుర్కోవటానికి సన్నాహంలో భాగంగా మనం ఒక యాభై పుస్తకాలు ముందేసుకుని చదువుకుని, డిసెంబర్ బ్రేక్ లో ఇండియా వెళ్లినప్పుడు , అమ్మతో "నాకు పరిక్షలమ్మా, నాకోసం దేవుడి కి దండం పెట్టు" అని చెప్పి, ఇండియా లో ఉన్నప్పుడు రోజు గుడికెళ్ళి, ఇక్కడికి రాగానే రోజు పూజ్చేసుకుని మొతానికి మనం qualifiers అయ్యాయనిపిస్తాం. ఈ లోపలే మన advisor కి ఒక గొప్ప రీసెర్చ్ ఇవిడియా వచ్చేస్తుంది. దాన్ని ఆయన గ్రాంట్ గా వ్రాయటం మొదలెట్టి మన ప్రాణం తోడేయ్యొచ్చు. అలా ఆయన తోడుతున్న సమయం లో దీపావళి పండగొస్తుంది. "ఇతని శక్తి హమే దేనా దాతా" ప్రాక్టీసు కోసమని సంజన, సుభద్ర, కీ బోర్డు ప్లేయర్ కార్తిక్ మనల్ని ఫోన్ చేసి ముప్ఫై సార్లు రమ్మంటారు. స్టేజి మీద పాట పాడేటప్పుడు పాట మీద కాకుండా, audience లో వాళ్ళు మన సల్వార్ కమీజ్ ని చూసి ఏమనుకుంటున్నారు అన్న దాని మీదే మనకి ధ్యాస ఉంటుంది.

లేదా, ఒక కొత్త instrument ని కొని మన మొహం మీద పారేసి "why don't you optimize it and write some protocols so every one in the lab can use them" అనొచ్చు. అప్పుడు కొన్ని రోజులు మన జీవితం ఆ instrument కి అంకితం.

లేదా, ఎ పెళ్ళిళ్ళ పెరమ్మో మరెవరో అమ్మకి మన కోసం పెళ్లి సంబంధం తెస్తారు. మనకి వాకే అనుకోండి మనం ఆ పోరగాడికి ఎమైల్స్ వ్రాయటం మొదలెడతాం. అక్కడ కొంచెం (కొంచెం ఎం ఖర్మ, ఎక్కువే) టైం వేస్ట్ అవుతుంది. మన కళ్ళు already ఇక్కడ ఒక అబ్బాయి మీదా (ఆ అబ్బాయి కళ్ళు మన మీద) ఉన్నాయనుకోండి, "ఇప్పుడే వద్దులే అమ్మా, Ph.D అయ్యాక చూద్దాం లే" అంటాం.

మధ్య మధ్య లో కాంఫెరెంసులకని DC, NY, Boston, LA, San Diego చేక్కేయ్యటాలు, దోస్తులతో లాస్ వేగాస్, అట్లాంటిక్ సిటీ, నయగారా, ఎల్లో స్టోన్ తిరగటాలు ఎలాగో ఉన్నాయి.

ఈ లోపల మన ల్యాబ్ కి ఒక కొత్త స్టూడెంట్ వస్తాడు లేదా వస్తుంది. మన advisor మనల్ని పిలిచి "please train the new student" అంటాడు. మనం ఏడుపు మొహాలమైతే "వీడిని నాకు అంట గట్టాడు కదరా దేవుడా" అని తిట్టుకుంటాం. అదే మనకి challenges ఇష్టమైతే వాళ్ళని ట్రైన్ చేసి "mentored graduate and undergraduate students in the research lab" అని resume లో వ్రాసుకుంటాం. teaching లో ఇంట్రెస్ట్ ఉంటె హై స్కూల్ పిల్లలు ల్యాబ్ కి వచ్చినప్పుడు వాళ్ళని mentor చేస్తాం, lab work లో ఇంట్రెస్ట్ ఉంటె సమ్మర్ internships కి వెళతాం.
తరవాత thesis వ్రాయటం, అందులో భాగం గా ఇంకో రెండు పేపర్లు అవగోట్టటం జరుగుతుంది. ఆ చివరి ఒకటి రెండు సెమెస్టర్ లలో ఫ్లోరిడా వాళ్ళకైతే hurricane లు, మాబోటి north-east గాళ్ళకి snow storm లు. ఇంట్లో కూర్చుని thesis వ్రాసుకోవటాలు. అద్రుష్టం ఉన్నవాళ్ళకి assistantshipలు, లేని వాళ్లకి చిన్న చిన్న అప్పులు. మధ్య మధ్య interviewలు. Thesis సెమినార్ కి ముందు ఉద్యోగం వచ్చేస్తే international students office కి వెళ్లి OPT అప్లికేషను గురించి అడగటం, వాళ్ళు మనల్ని పలురకాల ప్రశ్నలు వేసి, మనం మన సినియర్లకి ఫోన్లు చేసి, వివిధ వెబ్ సైట్లు, ఫోరం లు తెగ చదివేసి, నానా పాట్లు పడి మొతానికి అప్లై చేస్తాం. తరవాత thesis సెమినార్. అందులో పాసయ్యాక మన advisor ఇంట్లో డిన్నర్. తరవాత thesis లో corrections. అప్పుడింక అవసరం లేని టీవీలు, పరుపులు, టేబుళ్లు అందరికి పంచిపెట్టి, మన సామాను పెట్టేల్లోను, డబ్బాల్లోను సద్దుకుని మన తరవాతి destination కి చేరుకుంటాం. అక్కడ మొదటి రోజు మన ఆఫీసు బయట
"Dr. Kiranmayi" అని మన పేరున్న బోర్డు చూసాకా, మనం మళ్లి మే నెలలో graduation walk కోసం university కి వచ్చినప్పుడు మన స్నేహితుల్ని, advisor ని డిన్నర్ కి తీసుకి వెళ్ళినప్పుడు, graduation gown లో మన ఫోటో ని అమ్మ, నాన్న, తమ్ముడు చూసి సంతోషపడినప్పుడు, మన పిన్నులు అత్తయ్యలు మనల్ని చూపించి "అక్క చూడు, ఎంత మంచిగా చడువుకుందో" అని మన కజిన్స్ కి చెప్పినప్పుడు మనకి కలుగుతుంది ఆనందం. ఈ ఆనందం కోసం ఎన్ని గంటలయినా ల్యాబ్ లో ఉంటాం, ఎన్ని snow storms అయినా ఎదురుకుంటాం, ఎన్ని సెమినార్ లయినా ఇస్తాం.

ఇంతకముందు ఒక పోస్ట్ వ్రాసినప్పుడు భావన గారు కామెంటారు "రెండు సూటు కేసులు, బోలెడన్ని జ్ఞాపకాలతో వస్తాం.." అని. నిజమే. చాలా ఉత్సాహంగా వస్తాం. కొన్ని ఎదురు దెబ్బలు తింటాం, కొన్ని సంతోషాలని అనుభవిస్తాం.
నేను చాల conservative, మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. ఇక్కడికి రావటంతో నాకు చాలా విషయాలు తెలిసాయి. చాలా విషయాల గురించి నా దృక్పధం మారింది. ముఖ్యం గా grad program లో ఉన్నప్పుడు రకరకాల మనుషులని కలిసాను, చాలా cultures గురించి తెలుసుకున్నాను. ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంక నా సొంత డబ్బా ఆపేసి, వేరే విషయాల గురిచి వ్రాస్తా నెక్స్ట్ పోస్ట్ లో.
ఈసారి చాలా పెద్ద టపానే వ్రాసాను. చదవటానికి బోరు కొడితే ఒక కామెంట్ పెట్టండి. ఈ మాటు పెద్ద పోస్ట్ కాకుండా జాగర్త పడతాను. ధన్యవాదాలు.

12 comments:

  1. చాలా informative. మంచి పోస్ట్.

    ReplyDelete
  2. బాగున్నాయి మీ థీసిస్ అనుభవాలు.

    ReplyDelete
  3. బాగున్నాయండి మీ రీసెర్చ్ అనుభవాలు ! పోస్టు పెద్దగా ఉన్నా బోరు ఏమి అనిపించలేదు.

    ReplyDelete
  4. నా గ్రాడ్యువేట్ జీవితాన్ని, అప్పట్లో అనుభవించిన పీడకలల్తోసహా, మళ్ళీ కళ్ళముందు ప్రత్య్క్షం చేశారు. మాది డౌన్ టౌన్ వివి. అంచేత బడి బయట వీధిలో రకరకాల పూటకూళ్ళ ట్రక్కులుండేవి. ఆ రోజుల్లో మూడు డాలర్లకి కడుపునిండే భోజనం పెట్టేవాళ్ళు. మాలోమేము జోకులేసుకునే వాళ్ళం .. ఈ పీహెచ్‌డీ తరవాత యెట్టాగా మనకి ఉద్యోగం రాదు, తలా పది డాలర్లు వేసి ఒక ఇడ్లీల ట్రక్కు పెట్టుకుందాం అని. :)

    ReplyDelete
  5. If you want Telugu books, you can contact Navodaya. They will send air parcel.
    vjw_booklink AT yahoo DOT co DOT in

    ReplyDelete
  6. అమ్మో చాలా వుంది గా కథ, హాయి గా వుద్యోగం చేసుకుంటు సాయింత్రం వెళ్ళి M.S చదువుకుంటే నొప్పి తెలియలేదు నాకు. అయ్యో పాపం ఇంత కష్ట పడ్డారా.. నా ఫ్రెండ్ అనే వాడూ మమ్ములను చూసి మీకేమి తెలుసు తల్లి కష్టాలు అమెరికా లో కష్టాలు తెలియాలి అంటే స్తూడెంట్ గా రావాలి అని.

    ReplyDelete
  7. సునీత, సిరి సిరి మువ్వ, శ్రావ్య ,
    థాంక్స్

    కొత్త పాళీ గారు
    నేను చదివింది university టౌన్. కాలేజీ బిల్డింగ్స్ తప్ప ఇంకేవి కనిపించేవి కావు. పుట కూళ్ళ ట్రక్ లు (ఈ పదమేదో బాగుందే!) మాత్రం బోలెడన్ని. సరే అయితే అందరి అనుభవాలు ఒకటే నన్న మాట.

    భావన
    ఆలో ఆలో ఆలో. ఏంటి చాల రోజులయ్యింది మీరు నా బ్లాగ్ కి వచ్చి. అలిగితిరా? ఎంత చక్కగా అన్ని పోస్ట్ల మీద కామెంట్ చేసారు. అందుకే మీరంటే నాకిష్టం. అది సరే కాని మీరు అన్నట్టు "అమెరికా లో నా మొదటి అనుభవాలు" అని ఒక సిరీస్ కోసం టపాలని invite చేద్దామా? కావాలంటే టైటిల్ మార్చి ఇంకేదైనా పెడదాం. తెలుగు బ్లాగర్లు అన్ని చోట్లా ఉన్నారు కదా? అందరం contribute చేద్దాం. కొత్త పాళీ గారు ఒక పోస్ట్ ఇలా వేసారనుకోండి, అలా readers మన blog మీద పడిపోతారు. మీ బ్లాగ్ లో పెడదామా? మీరైతే పాత బ్లాగర్ కాబట్టి ఎక్కువ పోస్ట్లు వస్తాయి. నా టాలెంట్ గురించి జనాలకి ఇంకా తెలీదు కదా అందుకని. హి హి హి.

    ReplyDelete
  8. వొద్దులేమ్మా .. నేనాల్రెడీ కొన్నిసార్లు జనాల్ని ఇన్వాల్వు చెయ్యాలని ఏవేవో మొదలు పెట్టి కొన్ని చేసి, మొట్టికాయల్తిని, బుర్ర వాచి, ఎందుకొచ్చిన గొడవలే, నా రాతేదో నేను రాసుకుంటే సరి అనే మూడ్లో ఉన్నాను ప్రస్తుతం. ఉత్సాహముంటే మీరే మొదలెట్టొచ్చు.
    అమెరికాలో నా తొలిరోజుల అనుభవాల గురించి టూకీగా ఇక్కడ తలపోసుకున్నాను.

    ReplyDelete
  9. అవును. బావుంటుంది కదా అందరం ఒక సారి మన తలపులను కలబోసుకుంటే... చదువు కోసమో వివాహానంతరమో, వుద్యోగ నిమిత్తమో, భర్త వుద్యోగం తో పాటూ నో ఏదో ఒక రకం గా వలస వచ్చిన పక్షులం. కొన్ని పక్షులు కలత పడి తిరిగి పోతే మరి కొన్ని వున్న చోటు నే సొంత గూడు చేసుకున్న వైనం, ముందు నెత్తి మీద నీడ కోసం, మనదైన వునికి కోసం తపన, ఆ పైన సొంత గూటి కోసమో , తనదన్న అనుభంధం కోసమో పరుగులాటలు.. ఆ ఆట లలో కరిగిపోయిన కాలం... సాధిన్చిన విజయాలు, మెరిసిన చిరునవ్వులు వొరిగిన రెక్కలు.. కరిగిన కలలు వాస్తవం తీపి పూత వేసిన చేదు మాత్ర లా మింగి కల కల నవ్విన తరుణాలు.. మనవైన విజయాలు మనవైన అనుభందాలు అల్లిన గూడు విస్తారమవుతుంటే వెలిగించిన విజయపు దివ్వెలు మోగించిన ఢంకాలు.. అబ్బో ఎన్నెన్నో కల బొయ్యొచ్చు. ఎవరి బ్లాగ్ లో వాళ్ళం రాసి చివరాకరికి అన్ని కలపొచ్చంటారా?

    ReplyDelete
  10. మరి ఆలస్యమెందుకు . మొదలెట్టండి.. నేను విత్తనం వేయనా??

    ReplyDelete
  11. Hi everyone
    I am out of town right now (Husband's family reunion) I am itching to write a post on it pretty soon. I am trying to work on some one else's laptop which is giving me too much of trouble with "google indic".
    Kothapaali gaaru
    can you tell me how to invite posts on my blog. I will try to do it as soon as possible.

    ReplyDelete
  12. భలే రాశారు. ౪ పార్ట్లు అలవోకగా చదివించారు. అమెరికాలో నా తొలి రోజులు గుర్తొచ్చాయి. నావి విద్యార్థి కష్టాలు కాదు లెండి , కొంచం తేడాగా ఉంటాయి :).

    ReplyDelete