Wednesday, December 9, 2009

నా గాలి, నా నేలా, నా ఊరు .......


నిన్న కొత్త పాళీ గారి పోస్ట్ చదివాను. మాతృ భూమిని గురించి వ్రాయటం కష్టం అని ఆయన అన్నప్పుడు నిజమేననిపించింది. మాతృ భూమి కంటే ముందు పుట్టి పెరిగిన ఊరు గురించి వ్రాసి ప్రాక్టీసు చేద్దాం అనుకున్నా. అసలు హైదరాబాద్ గురించి వ్రాస్తే ఏమి రాయొచ్చా అని ఆలోచిస్తుంటే అసలు ఎక్కడ మొదలెట్టాలా అనే చాలా సేపు ఆలోచించా. అంత పెద్ద రచయిత కే కష్టమవుతే, గడ్డి పరక లాంటి దాన్ని, నాకు అసాధ్యమేమోననిపించింది. అయినా ప్రయత్నం చేద్దామని మొదలుపెట్టా.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా. అమ్మా, నాన్న ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళల్లో ఉండేవారు నాకు తొమ్మిదేళ్ళ వయసు వచ్చే వరకు. నేను అమ్మమ్మగారింటిలో హైదరాబాద్ లో ఉండేదాన్ని.
రిక్షా లో వెళ్తే రెడ్డి కాలేజీ ఎదురుకుండా సందులోనుంచి వెళ్లి, రాఘవేంద్ర స్వామి గుడి మీదుగా బసంత్ ధియేటర్ దాటి, కాచిగూడ చౌరస్తా, బడి చౌడి తరవాత కోటి. అబ్బ, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది దారంతా. బసంత్ ధియేటర్ కంటే కొంచెం ముందు వచ్చే నృపతుంగా స్కూల్ దాటినతరవాత వచ్చే షాప్ ఎనిమిది గంటలకే తెరిచేసేవారు. స్కూల్ కి వెళ్ళే ముందర ఏదైనా కొనుక్కోవాలంటే అక్కడే. ఖర్మ కాలి అంకుల్ (అందరు పిల్లలు ఆయన్ని అలాగే పిలిచేవారు) షాప్ తెరవకపోతే పెద్ద తలనొప్పే. కాచిగుడా, బడే చౌడి మీద నుంచి వెళ్తుంటే పూల బుట్టలు పెట్టుకుని అమ్ముతున్న వాళ్ళు కనపడితే చాలు, రిక్షా అబ్బాయిని అడిగి, ఆపించి అమ్మయిలమందరం పది పైసలకి గులాబీలు కొనుక్కునే వాళ్ళం టీచర్ కి ఇవ్వడానికి. అబ్బాయిలందరూ ఒకటే గోల. రిక్షా బాలరాజు మాత్రం "పాపా తొందరగా నడవనడంమా" అనేవాడు. బడే చౌడి కూరగాయల మార్కెట్ అప్పుడే కూరల బండ్లతో నిండడం మొదలయ్యేది. ఆకు కూరలైతే, పచ్చగా, ఫ్రెష్ గా ఎంత అందంగా కనపడేవో. ఆంజనేయ స్వామి గుడి పక్కనించి వెళ్తుంటే, పూజారి గారు జాలి సందుల్లోంచి హారతిస్తూ కనిపించేవారు. అందరం దండం పెట్టుకునే వాళ్ళం బాలరాజు తో సహా. వినాయక చవితప్పుడు చూడాలి. దారి పొడుగునా విగ్రహాలు అమ్మకానికి పెట్టేవారు. నిమర్జనం అయ్యేవరకు ప్రతి వేదిక మీద ఉన్న వినాయకుళ్ళని చూడడానికి రోజు ఉత్సాహమే. సుల్తాన్ బజార్ చౌరస్తా దగ్గర రంగు రంగుల పొడులు (బొట్టు పెట్టుకోవటానికి వాడతారు), దేవుడి పుస్తకాలు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు ఉండేవాళ్ళు.

తరవాత నేను అబిడ్స్ లో missionary స్కూల్ లో చేరాను. శాంతి ధియేటర్ దాటి, వితల్ వాడి క్రైస్తవ సిమెట్రీ, saint జోసెఫ్స్ స్కూల్, కింగ్ కోటి హాస్పిటల్ దాటి వెళ్ళేవాళ్ళం. దారిలో ఒక చిన్న ధియేటర్ ఉండేది. దాని పేరు మర్చిపోయ్యాను. అందులో ఎప్పుడు "A Certified" సినిమాలు ఉంటాయని, అమ్మ రిక్షా అబ్బాయితో రెండు మూడు వారాలకోక్కసారి చెప్పేది "ధియేటర్ పక్క సందులోనుంచి వెళ్ళకు" అని. తరవాత అక్కడ "one way" పెట్టడంతో తప్పిది కాదు. కింగ్ కోటి హాస్పిటల్ దగ్గర చిన్న చిన్న షెడ్లు, స్కూటర్ రేపైర్ వాళ్ళ షాప్లు, బలే సందడి గా ఉండేది. పండగలోస్తే, బాలరాజు ని సాయంత్రం రావద్దని చెప్పి, సాయంత్రం అమ్మా, నాన్న వచ్చేవాళ్ళు నన్ను, తమ్ముడిని పిక్ అప్ చేసుకోటానికి. తాజ్ లో టిఫిన్ తిని, బట్టలు కొనుక్కునే వాళ్ళం. చేర్మాస్, దయాల్స్, నీడ్స్, బోల్డు బట్టల షాప్లుండేవి. అంతా అయ్యాక, అమ్మకి చీర కొని, నాన్నకూడా సియరామ్స్ లోనో, లేక
raymonds, లోనో (ఇంకా చాలా షాప్స్ పేర్లు గుర్తురావట్లేదు) షర్టు బట్టలు కొని, జోన్స్ బకేరి కి వెళ్లి pastry (అప్పుడు 1.50 Rs కి పెద్ద పెస్త్రి వచ్చేది) కొనుక్కుని, ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆహా ఆ రోజులు మళ్ళి రావుకదా.

ఇంక కాలేజీ కి వచ్చాక చుట్టు పక్కనున్న ధియేటర్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, అన్ని మనవే. శాంతి, కిషోర్, సంధ్య, దేవి, odeon, sapthagiri, sangam, మహేశ్వరీ-పరమేశ్వరి, తారకరామ అబ్బో. అబిడ్స్ లో మూడో నాలుగో ఉండేవి, వాటి పేర్లు నాకు గుర్తు రావట్లేదు. కాలేజీ లో ఉన్నప్పుడు ఇవి చాలవుటండి. నాన్న ఇంగ్లీష్ సినిమా కి తీసుకెళ్ళాలంటే, secundrabad లో ఉన్న సంగీత్. ఇంక తినతానికైతే హిమాయత్ నగర్ ఏరియా లో కింగ్ అండ్ కార్డినల్, పిక్ అండ్ move, minerva, gayathri భవన్. పోయిన సారి హైదరాబాద్ వెళ్లి నప్పుడు చూసాను అక్కడే మాక్ దోనల్డ్స్, పిజ్జా హట్ ఇంక చాలా చాల కనిపించాయి. అలానే ముందు కెళ్తే, liberty ఏరియా దగ్గరనుకుంటా Baskin robins ఉండేది. దాంట్లోకి వెళ్ళాలంటే ధైర్యం కావాలి ఎందుకంటే బాగ్ లో డబ్బులున్డాలి మరి. విగ్రహాలని పెట్టినతరవాత, హైదరాబాద్ వచ్చిన చుట్టాలని ట్యాంక్ bund తప్పకుండా తీసుకెళ్ళే వాళ్ళం. అప్పుడే కాల్చిన మొక్క జొన్న పొత్తులు తింటూ, బుద్దుడిని చూస్తూ నడుస్తుంటే టైం తెలిసేది కాదు. కొన్ని రోజులతరువాత లుంబిని పార్క్ కూడా వెళ్ళేవాళ్ళం వచ్చిన చుట్టాలని తీసుకుని. Secretariat దగ్గర Lees బ్యుటి పార్లర్ ఉండేది. మన మొహం ,మన జడ మన చేతిలోకోచ్చాక అక్కడికేల్లెవాళ్ళం, facials , eye brows , hair cut కోసమని. నాకైతే వెళ్ళేటప్పుడు, వచ్చిన తరవాత రెండు సార్లు తిట్లే. అయితే ఎందుకు వెళ్ళడం అంటారా? అదంతే. అప్పుడింక దోస్తులతోటి బడి చౌడి, కోటి, జనరల్ బజార్ వెళ్లి మన సల్వార్ కమీజులు మనమే సెలెక్ట్ చేసి తెచ్చుకోవడమే.
ఇంక సంజీవరెడ్డి నగర్ లో ఉద్యోగం వెలగపెట్టేటప్పటికి మేము ఇల్లు మారిపోయ్యం. బస్సు లో వెళ్ళేదాన్ని ఉద్యోగానికి. ఖైరతాబాద్, పంజాగుట్ట ఏరియా లో అప్పటికే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. రిక్షాలు తగ్గిపోయ్యాయి. చాలామంది పిల్లలు అటో లో స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారు, తల్లి తండ్రులు హై టెక్ సిటీ లో పని చేస్తుంటే పిల్లలు కార్లల్లోనే స్కూల్ కి వెళ్తున్నారు. కంపెనీ బుస్సులన్ని సిటీ లోకి రావటం మొదలు పెట్టాయి. అటో minimum ఛార్జ్ పెరిగి, పెరిగి నేను పోయిన సారి వెళ్ళినప్పుడు నమ్మలేనంతగా తయారయ్యింది. మా స్కూల్ దగ్గరున్న గోడ కూలిపోయ్యి బోల్డు అపార్ట్మెంట్లు లేచాయి. చాల classy గా ఉండే botique లు పెరిగి పొయ్యాయి. కాలుష్యం చాలా ఎక్కువయ్యింది. ఇంత కాలుష్యం లో పిల్లలు బయట ఆడుకోకపోవటమే నయమనిపిస్తోంది.
ఈసారి వెళ్ళినప్పుడు ఎ మార్పులు చూస్తానో?


7 comments:

  1. మీరు ఇంకొంచం ముందుకు, లీస్ నుంచి ఖైరతాబాద్ వస్తుంటే సత్సంగ్భవన్ టర్న్ తీసుకున్నాక ఉండే సందులో అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి నేను కనిపించి ఉండేదాన్ని 1997-8 కి ముందైతే:-)

    ReplyDelete
  2. అందరూ ఏ కోనసీమ గురించో, వాళ్ళ పల్లెటూళ్ళగురించో రాసేవాళ్ళే, మొదటి సారి హైదరాబాద్ జిందాబాద్ అంటూ చదివాను. చాలా బావుందండి.
    :))రెడ్డీ కాలేజ్ ముందో, రాఘవేంద్రస్వామి గుడిలోనో నేనూ కనిపించే వుంటాను :)

    ReplyDelete
  3. సునీత,
    1998 లో నేను జాబ్ మొదలుపెట్టాను. రోజు బస్సు లో అటు వైపు వెళ్ళేదాన్ని.
    రమ్య,
    నిజంగా? మీరు అక్కడే ఉండేవారా? నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్అండి

    ReplyDelete
  4. కిరణ్మయిగారు,
    నేనుండేది లిబర్టీ దగ్గర.బాస్కిన్ రాబిన్స్ ఎప్పుడో ఎత్తేసాడు. వాడి ధరలకు అద్దెకూడా గిట్టుబాటుకాదేమో. మిగతావన్నీఅలాగే ఉన్నాయి.ఖైరతాబాద్ మీరా టాకీస్ వైపు వచ్చారంటే నేను కనపడేదాన్ని 83 కి ముందైతే..

    ReplyDelete
  5. నిజమండీ :)
    నా కాలేజ్ రెడ్డీ కాలేజ్.

    ReplyDelete
  6. OMG OMG OMG!!!
    Too much sweet nostalgia .. but mine is of much later vintage :)

    ReplyDelete
  7. రమ్య
    నేను రెడ్డి కాలేజీ స్టూడెంట్ నే.

    కొత్త పాళీ గారు
    వచ్చేసారా? ట్రిప్ ఎలా జరిగింది? పుస్తకావిష్కరణ విసేషాలేంటి? మాతృభూమి కబుర్లేంటి?

    ReplyDelete