Tuesday, November 3, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 3) - మొదటి సెమెస్టర్


నేను వచ్చిన మొదటి వారమే పెద్ద snow storm వచ్చింది. లోపల్నించి చూడటానికి బాగానే ఉంది కాని బయటకి వెళ్తే చలి చంపేసిది. పైగా సావిత్రేమో "insurance కి ఇంకా sign up చెయ్యలేదు కాబట్టి బయటకి నడిచి వెళ్లడానికి వీల్లేదు. ఐస్ మీద జారి పడ్డావంటే నడుము విరుగుతుంది + టాప్ లేచి పోతుంది (మెడికల్ బిల్)" అని బయటకి వెళ్ళనివ్వలేదు.
మా డిపార్టుమెంటు లో ప్రతి సోమవారం TA మీటింగ్ జరిగేది. TA supervisor (తాటకి) ఒకామె ఉండేది. ఆమె మా అందరికి బాస్. ఆమె వేరే దేశం నించి వచ్చి పాతికేళ్ళ క్రితం ఇక్కడ సెటిల్ అయ్యింది. ఎన్నేళ్ళైనా మాతృదేశం మీద అభిమానం పోదు కదా? అంచేత వాళ్ళ దేశం వాళ్ళు డిపార్టుమెంటు ని ఎలేద్దామని చూసేవారు. కొంతమంది ఆ పప్పులు ఉదకనివ్వకుండా ట్రై చేసేవారు. దానితో నిరంతరం సైలెంట్ వార్ జరిగేది.

సరే నా విషయానికొస్తే, మొదటి వారం మమ్మల్ని TSE exam వ్రాయాలన్నారు." అదేంటి? అప్లికేషనులో అవసరం లేదన్నారు కదా?" అనడిగితే, నన్ను ఒక వెర్రి దానిని చూసినట్టు చూసారు. తరవాత తెలిసింది మనం అమెరికన్ విద్యార్ధులకు అర్ధం అయ్యేటట్టు మాట్లాడగలగాలి, లేకపోతే వాళ్ళు మనల్ని హింస పెడతారు. అందుకనే ఈ పరీక్ష. సరే అది కూడా అయ్యాక నన్ను పిలిచి, నీకు రావలసిన దానికంటే 5 మార్కులు తక్కువోచ్చాయి, సో వెళ్లి accent modification క్లాసు అటెండ్ అవ్వు అని చెప్పింది మా తాటకి. నాకు ఒళ్ళు మంది పొయ్యింది. "చల్. నన్నే ఇంగ్లీష్ క్లాసు కి పంపిస్తుందా?" అని మా advisor దగ్గరికెళ్ళి "నేను Ph. D చెయ్యటానికి వచ్చాను. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కాదు. నేను ఆ క్లాసు కి వెళ్ళను" అని కొంచెం ఏడుపు మొహంతో, కొంచెం అమాయకపు మొహంతో చెప్పాను. రాళ్ళు కరగటం నాకు తెలీదు కాని ఆయన మాత్రం కరగలేదు. పైగా, "this will be a good experience for you" అన్నాడు. అప్పటికే నేను వచ్చిన మొదటి వారం లోనే అక్కడ దేశి కమ్యూనిటీ లో gossip అంతా నాకు తెలిసిపోయ్యిది. "మొన్నెవరో ప్రొఫెసర్ question అడిగితే ఒక దేశి అమ్మాయి లేచి నిలబడి ఆన్సర్ చెప్పిందంట", "ఒక దేశి అబ్బాయి car trunk ని డిక్కీ అన్నడంటా", ఇలా ఉండేవి ఆ గోస్సిప్స్ అన్ని. చెప్పుకుని, చెప్పుకుని అందరు తెగ నవ్వేవారు. ఇప్పుడు నా గురించి కూడా అందరు "ఆ అమ్మాయిని ఇంగ్లీష్ క్లాసు కి పంపించారట" అనుకుంటారేమో అని నా అసలు భయం.


సరే తరవాత రోజు నేను ఇంకో దేశి అబ్బాయి వెళ్ళాం కమ్యూనికేషన్ డిపార్టుమెంటు కి. దారిలో ఎంత తిట్టుకున్నానో, "మరీ ఇంగ్లీష్ రాని వాడితో నన్ను క్లాసు కి పంపిస్తున్నారు " అని. అక్కడ ఆ డిపార్టుమెంటు హెడ్ ఇంకొక టెస్ట్ పెట్టింది. చక్కగా పాస్ అయ్యాం. "మీరు క్లాసు కి రానఖర లేదు, రెండు syllables లో ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చేవారం క్లాసు అటెండ్ అయితే చాలు" అంది ఆవిడ. నేనయితే ఇంటి కొచ్చి టట్ట టాటా, టట్ట టాటా అని డాన్స్ చేశా.


అదే మొదటి సెమెస్టర్ కాబట్టి ల్యాబ్ పని ఉండదు. సోమవారం TA పని. ఆదివారం రాత్రి చాలా సేపు నిద్దర పట్టలే. అసలే reader's digest, అదీ చాల చదివానేమో, నేను ఈ అర్భకపు అమెరికన్ పిల్లలినందరిని ఉద్ధరించేస్తున్నట్టు నిద్ర పట్టగానే ఒకటే కలలు. పొద్దున్నే 7.30 కల్లా బయలుదేరా, 8.00 గంటల క్లాసు కోసం. అప్పుడు చూడండి అసలు మజా. కాలికింద ఐస్, ప్రతి రెండు నిమిషాలకి గాలిలో నేను. నా వీపుకి ఒక పెద్ద బాగ్ ప్యాక్. మూడు layers బట్టలు. ఎముకలు కోరికే చలి. ఇందుకేనా బాబు నేనిన్ని కలలు కన్నాను అని రోదించా. ఎట్లాగో అట్లా క్లాసు అయ్యిన్దనిపించా.


ఇక పోతే నేను తీసుకున్న క్లాస్స్లు. ఒకటేమో organic chem క్లాసు, ఇంకోతేమో electrochem. Organic నాకు తెలుసు కాబట్టి హేండిల్ చేసేసా. ఎలెక్ట్రో లో చూడాలి నా కష్టాలు. కాకపోతే అందులో రెండు take home లు, ఒక term-paper ఉండటం తో బ్రతికి పొయ్యా.

మా డిపార్టుమెంటు లో ఒక బెంగాలీ post doc ఉండేవాడు. ఒకరోజు కనిపించి పిచ్చాపాటి మాట్లాడిన తరవాత నాతో పాటే నడుస్తూ, "do you have assistantship?" అన్నాడు. నేను "yes" అన్నాను. అతను వెంటనే "fool" అన్నాడు. ఇక్కడ కష్టాలు తెలీక అసిస్టెంట్ షిప్ దొరకగానే ఎగురుకుంటూ వచ్చేసినందుకు అలా అన్నాడేమో అని ఓ రెండడుగులు వేసాను. "fool or half" అని అతను రెట్టించాడు. అప్పుడర్థమయ్యింది నాకు "నీకు full-assistantship ఉందా, లేక half-assistantship ఉందా" అని అడుగుతున్నాడని. తరవాత తెలిసింది ఆయన చాలా అమాయకుడు, ఎవ్వరేమి అడిగినా కాదనకుండా హెల్ప్ చేస్తాడని. ఇలాంటి మంచి వాళ్ళే కాదు, పరమ నీచులు కూడా కొంత మంది తారస పడ్డారు. వాళ్ళ గురించి ఇప్పుడు వద్దులెండి. Ph.D స్టూడెంట్ గా నా research lab అనుభవాలు వ్రాసి ఈ సిరీస్ ఇంతటితో ముగిస్తా.

6 comments:

  1. కొత్తగా వచ్చినవాళ్ళు మంచులో నడవాలంటే డేంజరపాయం. చాలా జాగ్రత్తగా నడవాలీ. అదీకాక, ఎలాంటి బూట్లుకొనుక్కోవాలో తెలియదు కదా వచ్చేదాకా. తూతూ మంత్రంగా ఏవోటి కొనుక్కొని వస్తే జర్రున జారటమే.
    ఇంకో విషయం పడితే ఘట్టి దెబ్బలే తగుల్తాయి మంచులో, కనిపించని పోలీసు దెబ్బల్లా ఉంటాయి.

    ReplyDelete
  2. అబ్బ, పరమనీచుల గురించి చెబుదురూ మజా వస్తుంది! :-)

    ReplyDelete
  3. bagaa rasaaru....

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  4. సుమారు ఇరవయ్యేళ్ళనాటి అమెరికాలో నా తొలివారపు అనుభవాల్ని గుర్తు చేశారు

    ReplyDelete
  5. రామరాజు గారు,
    నిజమేనండి. మా university కి నడిచి చెట్ల మధ్యలో ఉండే దారి గుండా వెళ్ళేవాళ్ళం. అది కొంచెం ఎత్తులో ఉండేది. ఒకమ్మాయి ఆ ఎత్తు మీదనుంచి జారి పడిపోయినప్పుడు ఐస్ కంటి దగ్గర గుచ్చుకుని ఐదారు కుట్లు పడ్డాయి. చాల కష్టం గా ఉండేది నడవటం.
    శ్రీనివాస్, :-)
    కార్తీక్, థాంక్స్
    కొత్త పాళీ గారు,
    ఎంటండి ఈ మధ్యన నా బ్లాగ్ కి రావట్లేదు? ఇంకో పోస్ట్ కూడా పెట్టాను. దాని మీద కమెంటండి మరి.

    ReplyDelete
  6. ఏమిటో పాపం ఈ చదువుల తిప్పలు మంచు ముక్కల బాధ లు..

    ReplyDelete