Thursday, January 21, 2010

Frustration ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ


మొన్న, మొన్ననే హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ అయినప్పుడు నేను కష్టపడి వ్రాసుకున్న పుస్తకాల లిస్టు అమ్మకిచ్చి తెమ్మన్నానా? అప్పుడు అమ్మ, నాన్న నా కోసం తిరిగి నేను అడిగిన పుస్తకాలు (అవి దొరకక పోతే పుబ్లిషెర్ కి ఫోన్ చేసి మరీ కనుక్కుని) కొని తెచ్చారా? మా అమ్మేమో, "అన్ని పుస్తకాలు పోస్ట్ లో నేను పంపించను, వచ్చే నెల మీ తోటికోడలు వాళ్ళ అమ్మ వస్తోందిగా, ఆవిడతో పంపిస్తాను. మీ అత్తగారికిస్తాను, ఆవిడ చెప్తే తీసుకెళ్తుంది లే పరవాలేదు. మేమోచ్చినప్పుడు పట్రామేంటి? దానితో బాటు అరకిలో ఆవకాయి, అరకిలో మాగాయి పంపిస్తాను" అని నన్ను irritate చేస్తోందా?
ఇప్పుడేమో కల్పన గారేమో, అసలు కధంటే ఏంటి? దాన్ని ఎలా చదవాలి, పరిగెడ్తు చదవకూడదు మెల్లగా ఆస్వాదించాలి అంటూ lecture లు. పైగా సుజాత గారు, నెమలికన్ను మురళి, లలిత వీళ్ళందరూనేమో మేము ఈ బుక్ చదివాం, ఆ బుక్ చదివాం, ఆహా, ఓహో అంటూ బ్లాగ్ పోస్ట్లు. ఈ కొత్త పాళీ గారేమో మెల్లగా ఒక బుక్ వ్రాసేసి, గమ్మున ఇండియా వెళ్లి, ఆవిష్కరించేసుకుని వచ్చేసి అసలు ఆ బుక్ ఏంటి, అమెరికా లో ఉన్న వాళ్లకి ఎలా దొరుకుతుంది అని చెప్పనైనా చెప్పకుండా, పైగా "కీ బోర్డ్ దుమ్ము దులపండి, చెలరేగి పొండి" అంటూ రెచ్చగొట్టటం. అసలేమైనా బాగుందా? అహ, బాగుందా అంట?
నాక్కోపమోచ్చేస్తోన్దంతే. frustration రాకపోతే ఏమవుతుంది? మీరైనా చెప్పండి.

6 comments:

  1. హి హి హి... కీ బోర్డు తో పాటు అందరి దుమ్మూ దులిపేశారుగా..

    ReplyDelete
  2. అవును కిరణ్మయి గారు సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా, నాకు చిర్రెత్తుకొచ్చేస్తోంది. మీరు చెప్పిన కారణాల వలనే పుస్తకాలు పంపండే అంటే మా అక్క కూడా ఇదే సోది, అన్ని పుస్తకాలెందుకే అమ్మో ఒక సూట్కేస్ పుస్తకాలా ఆ వో అంటూ వెధవ ఎక్స్ ప్రెషన్స్. వీళ్ళేమో పుస్తకాల మీద పుస్తకాలు, పైగా ఈ కొత్తపాళి గారి దుమ్ము దులుపుడు కార్యక్రమమొకటీ,గ్ ర్ ర్ ర్ర్ర్..

    ReplyDelete
  3. అందుకే సుబ్బరంగా జై నవోదయ, జై తపాలా సర్వీసు అనుకోండి!! ఈ చుట్టాల మీదా, ఇతర మానుష కొరియర్ల మిదా ఆధారపడే బాధ తప్పుతుంది. ఐనా ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు మధ్య నా మీద యెందుకూ విరిచుకు పడ్డం? బాగా రాస్తారర్రా మీరంతా, ఇంకొంచెం పదునుగా రాయండీ అనడగడం కూడా తప్పే? :)

    ReplyDelete
  4. ఏంటోనండీ కొత్తపాళీ గారూ.. పుస్తకం చదివాక బాగుందనో, బాలేదనో ఓ టపా రాసుకోడం కూడా తప్పే..?? అస్సలు అర్ధం చేసుకోరు ఈ ప్రవాసాంధ్రులు..
    అయినా మీకు పుస్తకాలు దొరక్కపోతే మాదా బాధ్యత? ఆ .. :-) :-)

    ReplyDelete
  5. మీరెందుకని ఇన్నాళ్ళుగా ఏం రాయట్లేదు??

    ReplyDelete
  6. కొత్త పాళీ గారు
    అడిగినందుకు చాలా థాంక్స్ అండి. జనవరి లో కొంచెం ఒంట్లో బాగుండక, పని తో బిజీ గా ఉండి రాయటం తగ్గించాను. తరవాత ఒక్క సారిగా motivation లేకుండా పొయ్యింది. చాలా సార్లు బ్లాగ్ పోస్ట్ వ్రాయటానికి ఐడియా కోసం కష్టపడ్డాను. వ్రాసి తీసేసాను కూడా. ఫెబ్రవరి లో వారానికి ఒకసారి మాత్రమే నాకు ఇష్టమయిన బ్లాగ్స్ చదివాను. ఎందుకో చదవాలని పించలేదు, వ్రాయాలనిపించలేదు. ఈ వారం నుంచి బ్లాగ్స్ చదవటం మళ్ళి మొదలెట్టి కామెంట్స్ చేస్తున్నాను. త్వరలోనే మళ్ళి పోస్ట్ చెయ్యటం మొదలుపెడతాను. మీరు రచయిత కదా? ఇది నాకు వచ్చిన "writer 's block " అంటారా? !!!!!! ఊరికే అన్నా లెండి. బ్లాక్ వచ్చేటంత పెద్ద రచయితని కాను. I think I am going through a funny phase. నిన్న మా ఆయన తో చాలా గొప్ప చెప్పుకున్నా, "నేను వ్రాయట్లేదని కొత్త పాళీ గారు enquire చేసారు తెలుసా అని". ఉంటానండి.

    ReplyDelete