Saturday, March 27, 2010

నాక్కొన్ని డౌట్లు


చిన్నప్పుడు నేను, మా తమ్ముడు రాఘవేంద్ర స్వామి గుడి కి తరచు వెళుతూ ఉండేవాళ్ళం. అమ్మ మా తమ్ముడికి ఎప్పుడు చెప్పేది "తీర్ధం తీసుకున్నాక, కాళ్ళు మొత్తం జాపి సాష్టాంగం చెయ్యి. చేసేటప్పుడు కళ్ళజోడు తీసెయ్యి " అని. నేనైతే బుద్ధిగా సరే అనేదాన్ని. మరి నేను కదా, అందుకని. మా వాడు మాత్రం, "ఎందుకు? ఎవరు చెప్పారు తియ్యమని" అనేవాడు. మా అమ్మకి మండిపోయ్యి "చెప్పిన పని చెయ్యి. పిచ్చి ప్రశ్నలు నువ్వును. మొన్న ఎవరో టీవీ లో శంకరాచార్యుల వారు అలా చెప్పారని చెప్పారు" అంటే, "అసలు శంకరాచార్యులవారు BC టైం లో ఉండేవారు కదా? ఆ రోజుల్లో జనాలకి కళ్ళజోడు ఉండేదా?" అని వీడు మళ్ళి ఆర్గుమెంటు. మా అమ్మకి విసుగొచ్చి లోపలి వెళ్లి పొయ్యేది.
నిజానికి ఇలాంటివి పిచ్చి డౌట్లు కాదు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తక్కువవటం వాళ్ళ ఇలా జరుగుతుండచ్చు. ఇలాంటి డౌట్లు నాకు వస్తాయి కొన్ని సార్లు. ఇప్పుడు మాత్రం రెండింటిని గురించి వ్రాస్తాను. నాకు sincere గా వచ్చిన సందేహాలివి. మన పురాణాలని, culture ని కించపరచటానికి మాత్రం నేను ఇవి వ్రాయట్లేదు సుమా. అపార్ధం మాత్రం చేసుకోకండి.
వినాయక చవితి రోజు కధలో కృష్ణుడి నీలాప నిందల కధ ఉంటుంది. అందులో జాంబవంతుడు సమంతక మణి తన కూతురి ఉయ్యాల మీద కట్టటానికి తీసుకెల్తాడని ఉంటుంది. కృష్ణుడితో యుద్ధం అయ్యాక ఆ కూతురినే ఆయనకిచ్చి పెళ్లి చేసేసాడని ఉంటుంది. ఉయ్యాల లో పడుకునే పాపకి అప్పుడే పెళ్ళేంటి? లేకపోతే ఇది చెట్టుకు కట్టుకుని teenage అమ్మాయిలు ఊగే ఉయ్యాలా? అలా అయితే మణి ఎందుకు?
చందమామ లో చదివే కధల్లో చాల మటుకు చదివేవాళ్ళం ఎవరో ఒక ముని లేకపోతే రాజు వీర లెవెల్ లో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి disturb చేసేస్తాడు అని. వేరే వాళ్ళు తపస్సు చేస్తుంటే ఆయనికి ఎందుకంత ప్రాబ్లం? ఇదే మాట నేను మా ఫ్రెండ్ తో అంటే తనన్నాడు, "according to some schools of thought, ఇంద్రుడు అనేది ఒక పదవి లాంటిది, సో ఆ పదవి పోతుందేమో అని current ఇంద్రుడికి ప్రాబ్లం అయ్యుండచ్చు" అని.
పైన నేను చెప్పినట్లు, నాకు తెలియని పురాణాలు ఇక్కడ ఉండొచ్చు. సో మీకు తెలిస్తే నా సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాను.
మనవి: దయచేసి మూఢ నమ్మకాలపై మీ అభిప్రాయాలని ఇక్కడ కామెంట్స్ లో వ్రాయవద్దని మనవి. అలాగే, ఇది నేను సరదాకి వ్రాసిన పోస్ట్. ఎవ్వరిని కించ పరచటానికి మాత్రం కాదు. మీకు నచ్చక పోతే, మన్నించమని మనవి అంతే కాని offensive కామెంట్స్ మాత్రం పెట్టకండి.

5 comments:

  1. ఇది మీ తార్కిక ఆలోచనలకు ప్రారంభం. ఇకపై వచ్చే దాడులకు వెరవకుండా ఉండ గలిగితే, త్వరలోనే సత్యాన్ని గ్రహించ గలరు.

    నేను కోరేది ఒక్కటే. ఎవరో ఏదో అనుకుంటారని మీ తార్కిక శక్తికి బంధాలు వేయకండి.

    ReplyDelete
  2. మీకు సందేహాలొచ్చి ప్రశ్నించడం మొదలెట్టారంటే సరైన మార్గంలో ఉన్నట్లే!
    కానీ ప్రశ్నించడం చాలా ప్రమాదమండోయ్. జాగ్రత్త.

    ReplyDelete
  3. అమ్మాయీ, మీ తమ్ముడు అడిగిన ప్రశ్నకు విసుగొచ్చి మీ అమ్మగారు లోపలికి పోలేదు.జవాబు చెప్పలేక.... పెద్దలు సాధ్యమైనంతవరకూ వాళ్ళు అనుకున్నట్లుగా మన ప్రవర్తన ఉండేలా ప్రయత్నిస్తారు. పెద్దలు చెప్పారట అంటే మారుమాట్లాడకుండా చెప్పినట్లు వినేవాళ్ళే ఎక్కువ. మీ తమ్ముడిలా ప్రశ్నలు వేయరు. మరి బుద్ధిమంతులైన మీరు కూడా ప్రశ్నిస్తున్నారే. ఇది మీ అమ్మగారికి తెలియదనా.
    మత విషయాలపై ప్రశ్నలకు జవాబులు దొరకవు . మీకు సందేహానికీ ,ప్రశ్నకు తేడా తెలియలేదు. సందేహమంటే ... ఇలా చేయవచ్చునా,లేక ఆలాచేయాలా...అని.
    ప్రశ్న అంటే ఎందుకు చెయ్యాలి... వంటివి.
    మీరు ప్రశ్నిస్తున్నారంటే మీకు తెలిసిన జవాబులు మీకు సంతృప్తిని ఇవ్వడం లేదని. యువకులు ఇటువంటి ప్రశ్నలు అడగడం సహజం.మరో పదేళ్ళు గడిస్తే ఇటువంటి ప్రశ్న వేసుకోవడానికి జంకుతారు. హరి దోర్నాల గారు, కత్తి మహేష్ గార్లు అన్నట్లుగా ఇది హేతువాద ధోరణి కాదు. హేతువాద పద్దతులగురించి మీరు వెదికి చదివి అర్ధం చేసుకోవాలి. మీకు ఆసక్తి ఉంటే ప్రయత్నించండి.
    ఇక మీ మొదటి సందేహం చిన్న పాపకు పెళ్ళి గురించి. పూర్వ కాలం పెండిండ్లు ఇలాగే జరిగేవి. సీతమ్మవారి రజస్వలా వేడుకలు కైకేయి వారి ఇంట జరిగినట్లు మనం విన్నాముగదా. అన్నట్లు మీరీ విషయం ఎప్పుడైనా విన్నారా.కనుక శ్రీరామచంద్రులవారి వివాహం కూడా చిన్నవయసులోనే జరిగింది.
    మీ రెండవ సందేహం తపస్సు చేసేవారి తపస్సును ఇంద్రుడు చెడగొట్టాలని చూస్తాడెందుకంటే అప్పుడు వైష్ణవ , శైవ ఆచారాలున్నాయి , వారి మధ్య తగాదాలున్నాయి. శైవుల మతారాధనను వైష్ణవులు చెడగొట్టే ప్రక్రియలలో అదొకటి.నేడు వైష్ణవులు ఆనాటి తమ పద్ధతులు మార్చుకొని శైవమత విధానాలను అనుసరిస్తున్నారు గనుక నేడందరూ ఐక్యంగా ఉన్నారు.

    ReplyDelete
  4. హరి గారు, మహేష్ గారు
    థాంక్స్ అండి

    అజిత్ కుమార్ గారు
    మీరు చెప్పిన విషయాలు నిజంగా నేను వినలేదండి. సీతమ్మవారి గురించిన విషయం నాకు అస్సలు తెలీదు. శైవ - వైష్ణవ తగాదాల గురించి ఇంతకు ముందు కధలలో చదివాను కాని, నా ప్రశ్నకి సమాధానం అక్కడ దొరుకుతుందని అనుకోలేదు. అసలు ఆ విషయం నా మనసుకి రాలేదు. ధన్యవాదాలండి.

    ReplyDelete
  5. క్రిష్ణుడికి జాంబవంతునికి యుద్దం ఏళ్ళ తరబడి జరిగిందంట .. ఈ లోపల పెద్దది అయిపోయి ఉంటుంది :) ..వయస్సు తేడాగురించి అడక్కేం :P

    ReplyDelete