Sunday, April 25, 2010

బాబోయి మల్టీ లెవెల్ మార్కెటింగ్



హైదరాబాద్ లో ఒక సాయంత్రం. నేను మా అమ్మా పెద్ద పనేమీ లేదని ఇంట్లో హస్కు మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మా మేనత్త గారి అబ్బాయి వచ్చాడు. పిచ్చా పాటి అయ్యాక "మను రేపు అమెరికా నించి వస్తోంది అత్తమ్మా. బిజినెస్ పని మీద వస్తోందట ఎక్కువ రోజులు ఉండనని చెప్పిందట" అన్నాడు. ఈ మను మాకున్న చాలాఆఆఆఆఆఅ మంది కజిన్ లలో ఒకామె. మా అమ్మ జీవితం లో రెండిటికి చాలా భయపడుతుంది. ఒకటి దేవుడు, రెండోది బిజినెస్. మా ఇంట్లో కొందరు సొంత బిజినెస్ లు పెట్టి నష్టపోవటం తో మా అమ్మ భయం చాల ఎక్కువైంది. మేమేప్పుడైన పొరపాట్న బిజినెస్, investments లాంటి మాటలు మాట్లాడితే "ఎస్తేస్తా" అన్నట్టు చూస్తుంది. సరే ఈ కజిన్ బిజినెస్ విషయం లో నాకు curiosity పెరిగింది. చాలా మైల్డ్ గా ఉండే అమ్మాయి అసలు బిజినెస్ ఎలా చేస్తోందబ్బా? అసలు ఏమిటి బిజినెస్? ఏమా కధ? మా బావ నడిగితే,"ఏదో _____________ బిజినెస్ అట, మనం ఏదో కొని ఇంకొకళ్ళకి అమ్మాలట, అప్పుడు ఆ కొన్న వాళ్ళు కూడా అ బిజినెస్ లో చేరినట్టు అట. అలా నీ కింద లెవెల్ వాళ్ళు ఎంత మందిని చేర్చుకుంటే నీకు అంత ప్రాఫిట్ అట" అంటూ తనకి తెలిసినదేదో చెప్పాడు. సరేలే మనకెందుకులే అని నేను ఊరుకుంటుంటే "మీరు కూడా చేరతారా అత్తమ్మా? మేమందరం కూడా దాని గురిచి తెలుసుకుని చేరదామనుకున్తున్నాం" అన్నాడు. మా అమ్మకి టెన్షన్ వచ్చి "వద్దులే. నాకేందుకోచ్చిన బిజినెస్లు" అంది కాని రెండు రోజులు మా అమ్మ కి నిద్దరపట్టలేదు. తన అత్తగారి వైపు వాళ్ళందరూ తనని బిజినెస్ చెయ్యమని పీడిస్తున్నట్టు మా అమ్మకి ఆ రోజుల్లో కలలు వచ్చాయేమోనని నాకైతే అనుమానమే. సరే మా కజిన్ వచ్చి వెళ్ళిపోయింది. ఏదో ________ మాటలు సాగాయి కాని నేను పెద్ద పట్టించుకోలే. ఇద్దరు ముగ్గురు కజిన్లు చేరారు అందులో. మద్రాస్, బంగళూరు లాంటి చోట్లకి మీటింగ్స్ కి వెళ్తున్నామనేవారు, అక్కడ షాపింగ్ లు చేసేవారు. అంతా నడుస్తోంది. మా అమ్మ అందులో ఒకరిని అడిగితే మొత్తం మీద ఎం చెప్పారో తెలీదు కాని ఏదో డిష్ వాషింగ్ సోప్ మాత్రం నాలుగు వందలు చెప్పారట. ఇది 1997 లో మాట.
కట్ చేస్తే ......
నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సారి మను వాళ్ళింటికి వెళ్లాను. ఒక రూం నిండా ____ సామాన్లె. stationary , కాస్మెటిక్స్ ........ అన్ని. వాళ్ళింట్లో ఆ రోజు చాలా మంది వచ్చారు. పార్టీ కాదు కాని ఏదో బిజినెస్ కి సంబంధించిన gathering . అంతా బాగా డబ్బున్న వాళ్ళలాగే ఉన్నారు. ఎవ్వరు పెద్ద బాధ పడుతున్నట్టు అనిపించలేదు. మను నాతో ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. ఇప్పుడనిపిస్తోంది, "బిజినెస్ లో చేరు, చాలా డబ్బు సంపాదిన్చులోవచ్చు," అంటూ నాకు చెప్తే నేను అక్వర్డ్ గా ఫీల్ అవుతానేమోనని చెప్పలేదేమో బహుసా.
మళ్లీ కట్ చేస్తే ...
మనం graduate అయ్యి ఊళ్లు ఏలటం మొదలు పెట్టాం. వేరే ఊరు షిఫ్ట్ అయిన కొత్తలో, నన్ను ఇక్కడ సెటిల్ చెయ్యటానికి మా అయన (అప్పుడు మా ఆయన కాదు లెండి) వాళ్ళ తమ్ముడు, కజిన్, భార్య వచ్చారు. టీవీ కొనుక్కుందామని వాల్మార్ట్ వెళ్లాం. వెళ్తుంటే, కార్ లో సంభాషణ _________ మీదకి మారింది. Conversation :
ఒకరు: అమ్మో. వాళ్ళ గొడవ పడలేం బాబు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు.
ఇంకొకరు: మా కాలేజీ లో __________ వాల్లోస్తున్నారంటే, కిటికీ లో నించి చూసి తలుపులు తీసేవాళ్ళం కాదు.
మరొకరు:"ఒకసారి ఇలాగే నేను, విజయ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒకతను విజయ్ ని "మిమ్మల్నేప్పుడో చూసినట్టుంది" అంటూ మాట కలిపాడు. విజయ్ వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆతరవాత యాడాది పాటు రోజు ఫోన్లె. ______ చేరతావా? అని.
సరే వాల్మార్ట్ చేరాక, మా ఆయనా వాళ్ళ కజిన్ ఒక వైపుకి వెళ్తే, మిగతా ముగ్గురం ఇంకో వైపు వెళ్లాం. కొంచెం సేపైయ్యాక "హాయ్" అని పలకరింపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒకతను నవ్వుతు చూస్తున్నాడు. మేము నవ్వితే "do you know the way to the nearest target" అన్నాడు. నేను "we are new to this place" అంటే, "I am new here too. can I get your phone number so we can keep in touch" నా చేతిలో సెల్ ఉంది. నాదగ్గర ఫోన్ లేదని చెప్పటానికి లేదు. నీ నెంబర్ ఇవ్వు బాబు ఆ టచ్ లో ఏదో నేనే ఉంటాను అని చెప్పబోఎంతలో నా కాలి మీద ఏదో పాకినట్టని పిస్తే కిందకి చూసా. మా మరిది నా కాలి మీద తడుతున్నాడు. stranger కి నెంబర్ ఇవ్వకు అని చెప్తున్నా డెమో అనుకుని కళ్ళ తోటే భరతనాట్యం చేసి మొత్తానికి ఆ అబ్బాయి నెంబర్ తీసుకుని బయట పడ్డా. ఇంతలో మా ఆయనకీ నాతో ఉన్న మా తోటి కోడలు ఫోన్ చేసేసింది "ఇక్కడ వీడెవడో మమ్మల్ని ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు" అని. అందరు నన్ను తిట్లు. నేనేమో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కూడా. మా మరిదేమో వాడు ______ వాడేమో అని నీకు సైగ చేస్తున్నా అర్ధం చేసుకోవేంటి? అంటాడు. కాలి మీద వ్రాస్తే అర్ధమవుతుందా? మేము వెళ్లి పోతుంటే పక్కనే ఉన్న స్టార్ట్ bucks లో ఆ అబ్బాయి దాదాపు పది మంది తో కాఫీ తాగుతూ కనిపించాడు.
మిగతా అనుభవాలు తరవాతి పోస్ట్ లో.


7 comments:

  1. నేను కూడా కొన్నాళ్ళూ ఇలాంటి తిప్పలు పడ్డ. ఇక భరించలేక ఎవడైనా నను అనుమాస్పదంగా పలకరిస్తే, ఊరికి ముందే నాకు ఫలానా నెట్వర్క్ మార్కెటింగ్ ఐ బీ ఓ ఉంది అని చెప్పడం మొదలుపెట్టా. అప్ లైన్ ఎవరు అని అడిగితే మొట్టమొదటిసారి బుర్రతినేసి కార్డ్ ఇచ్చి వెళ్ళీనవాడి పేరు చెప్పేవాడిని :)) దెబ్బకి జనాలు నా దగ్గరికి రావడం మానేశారు.

    అలాగే వీళ్ళు టార్గెట్ చేసేది కొత్తగా వచ్చిన వాళ్లని. కొత్తగా వచ్చామన్న ఫీలింగ్ చూపించకుండా లోకల్ స్పోర్ట్స్ టీం టీ షర్ట్ వేసుని తిరిగితే చాలామంది మన జోలికి రారు :))

    ReplyDelete
  2. అసలు దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది లెండి.మెంబర్స్ గా చేర్పించటానికి వీళ్ళు ఎవరి ఇంటికి అయినా వెళ్ళిపోతూ వుంటారు.నేను హైదరాబాదు లో వున్నప్పుడు ఒక పేద్ద బిజినెస్ మ్యాన్ మా ఇంటికి వచ్చాడు తెలుసా మా కజిన్ తో కలిసి దీనిలో చేరమని అడగటానికి. నేనయితే షాక్.మా కజిన్ కి డబ్బుకి లోటు లేదు,వద్దంటే డబ్బు అన్నమాట,అంత వుంది అతనికి.ఈ బిజినెస్ మ్యాన్ కి ఏమో చూస్తే అన్ని అన్ని షోరూములు.వీళ్ళకి ఎందుకు ఈ....బిజినెస్ అనుకున్నా.నేను చేరను అని చెప్పేసరికి మళ్ళీ మా ఇంటి వైపు చూడలేదు వాళ్ళు ఇద్దరూ కూడా. ఏదో,మామూలూ విజిట్ కి వెళ్తున్నా అని మా కజిన్ అనుంటే,ఈ వ్యాపార వేత్త మా ఇంటి వైపు చూస్తాడా అసలు అనిపించింది నాకు.

    ReplyDelete
  3. ఓసారి ఇది సదవండి
    http://ramakantharao.blogspot.com/2009/10/blog-post.html

    ReplyDelete
  4. మలక్, మీ అవిడియాలు భలే ఉన్నాయిగా
    రిషి, నిజమే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
    రామరాజు గారు, మీరు భలే వ్రాస్తారు,

    ReplyDelete
  5. అమ్మో, మేము ఇర్వింగ్ లో ఉన్నపుడు కె మార్ట్ లో ఒక పాకిస్తానీ తగిలాడు. రౌడీ చెప్పినట్లు..మేము యూ ఎస్సేకి కొత్త అప్పుడు! నవ్వుతూ కనపడి పలకరిస్తే మనవాళ్ళే అనుకుని "అబ్బ,ఎంత కలివిడి మనిషో"అని అడ్వాన్స్ అయిపోయాం.

    నెమ్మది నెమ్మదిగా ఆయన, ఆయన భార్య ఈ తరహా మార్కెటింగ్ గురించి చెప్పి చంపేసేవారు. ఎంతగా అంటే ఆ మార్కెటింగ్ చేస్తే చివరికి ఒక దీవి కొనుక్కుని(నిజమండీ,ఒట్టు) అందులో హాయిగా పాలస్ కట్టుకుని నివసించేంత డబ్బు వస్తుందని ఊదరగొట్టేవాళ్ళు. ఆ నెట్వర్క్ పేరు పిక్ స్టారో ఏదో ఉండాలి.

    రోజూ సాయంత్రం కాగానే ఇంటికొచ్చేసేవాడు. ఎలా వదిలించుకోవాలో తెలీక నానా కష్టాలూ పడ్డాం!అక్కడించి వేరే చోటికి పోయాక కూడా కాల్స్ వస్తూనే ఉండేవి.

    ఇక్కడ ఎవరన్నా ఇలాంటి నెట్ వర్క్ పేరు చెప్తే ఆ యూనస్ అనే మనిషే(అబ్బ, పేరు కూడా గుర్తొచ్చేసింది దెబ్బకి) గుర్తొచ్చి గుండె జలదరిస్తుంది.

    ఈ టార్గెట్లూ, ఇవీ చచ్చే దడ పుట్టిస్తాయి.

    గోవాలో రిసార్ట్ లు హలీడే క్లబ్బుల వాళ్ళూ ఇలాగే పట్టుకుంటారు. అది మరోరకం హింస!

    ReplyDelete
  6. మీ కజిన్ పేరు మార్చినట్లు ఉన్నారు, (నాలుగు అక్షరాల పేరుతో) క్యాలిఫోరినియాలో ఉండే వాళ్లు అయితే నాకు బాగా తెలుసు. వాళ్లు చాలామంది కంటే ముందు చేరటం ఉపయోగపడింది, అంతకంటే బంధువులను, స్నేహితులను దీనిలో చేరమని ఇబ్బందిపెట్టకపోవటం కూడా ఓ మంచి పని.

    ఇక వీళ్లను తప్పించుకోవటానికి ఫోన్ నుంబెర్ అడిగినప్పుడు తప్పుది ఇవ్వటం, ఎక్కడ పనిచేస్తున్నారు అంటే అబ్బే పనిచేయటం విసుగు వచ్చి సంపాయించింది ఎక్కువయ్యింది అని ఇప్పటికే రిటైర్ అయ్యానని చెప్పటం (ఇది పోయినవారం ఒకరి మీద వాడితే పనిచేసింది), వ్యాపారాలలో ఇంటెరెస్ట్ ఉందా అంటే ఇప్పటికె ఓ పదైదు రాకా ఉన్నాయి, కొత్త వాటిలో చేరే టైం లేదనటం ఇలాంటివి ప్రతి దేశీయుడు వీళ్ల సుత్తికి బుక్ అయిన తర్వాత నేర్చుకోవల్సిందే.

    ReplyDelete
  7. సుజాత గారు,
    ఇప్పుడు సౌత్ ఇండియా లో కూడా బాగా జోరు గా నడుస్తోందట ఈ గోల

    కృష్ణ,
    పేర్లు మార్చిన మాట నిజమే కాని మా వాళ్ళు కాలిఫోర్నియా కాదండి

    ReplyDelete