Sunday, April 25, 2010

బాబోయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ 2


సరే. ఒక రోజు International Farmer మార్కెట్ కి వెళ్ళా. మిరప కాయలు ఎరుతుంటే నా పక్కనే ఒక తెలుగు దంపతులు నిలబడ్డారు. ఒక నల్ల షర్టు అబ్బాయి వచ్చి "excuse me where is the nearest walmart" అన్నాడు. వేల్లేదో చెప్తుంటే నాకెందుకో అనుమానం వచ్చి తప్పుకున్నా. రెండు వారాల తరవాత మల్లి వెళ్ళినప్పుడు అదే అబ్బాయి ఇంకొక తెలుగు జంట కి సుత్తి వేస్తున్నాడు. సరేలే మనదగ్గరకొస్తే చూద్దాం అని నా పని నే చేసుకు పోతున్నా. ఇంతలో ఇంకొక అతను వచ్చి ఆవిడ తో "బయలు దేరుదామా అండి, చాలా లేట్ అయ్యింది" అంటే వాళ్ళు అతని దగ్గర నుంచి తప్పుకున్నారు. తరువాత వాళ్ళు అతనితో "కరెక్ట్ టైం కి వచ్చారండి. గంట నించి భరించ లేక చస్తున్నాం. జిడ్డు లాగ వదిలి పెట్టడు" అన్నారు. నేను ఎప్పుడు శనివారం నాలుగు గంటల టైం లో వెళ్ళేదాన్ని. దాదాపు ప్రతి సారి కనిపించేవాడు. కాని నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి నేను మా ఆయనా వెళ్ళాం. మిరపకాయల దగ్గరే "excuse me " అని వినిపించింది. చూస్తే మన ఫ్రెండు. మా ఆయన దగ్గర కొచ్చి"వేర్ ఇస్ ది నేఅరేస్ట్ వాల్మార్ట్" అన్నాడు. ఓరిని యాడాది నించి వాల్మార్ట్ వెతుకుతున్నావా నాయనా అనుకుని, మా ఆయనకీ భరతనాట్యం లో సైగలు చేసాను. ఇప్పటికే ఈ శాల్తి గురించి చెప్పానేమో, మా ఆయన "ఐ డోన్ట్ నో" అన్నారు.
పట్టువదలని విక్రమార్కుడు: "are you new to this place"
మా ఆయన:"kind of "
ప వి: "where do you work "
మా ఆ:"I don 't work "
ప వి:"సో యు are a student "
మా ఆ:"yeah "
ప వి:"what are you studying ?"
మా అ:"పి హెచ్ డి "
ప వి:"ఇస్ ఇట్ ట్రు దట్ యు పీపుల్ గెట్ paid a lot "
మా ఆ: "హి హి హి"
ప వి:"she is your missusఆ?" (నన్ను చూపించి)
యింక నాకు ఒళ్ళు మండి మా ఆయన కేసి చూసి "షాల్ వి గో?" అన్నాను. తెలుగు మాట్లాడితే తెలుగు లో కొడతాడని నా భయం.
మొత్తానికి ఫోన్ నెంబర్ ఇవ్వ కుండా బయట పడ్డాం. ఆ తరవాత ఆ మార్కెట్ తీసెయ్యడం తో వేరే చోటికి వెళ్తున్నాను. అక్కడెందుకో కనిపించటం లేదు.

ఒక రోజు ట్రైన్ లో వెళ్తుంటే ఒక దేశి అబ్బాయి ఎక్కడో చూసినట్టు కనిపిస్తే రెండు మూడు సార్లు అతని వైపే చూసాను. అతను నన్ను చూడగానే చాలా ఇబ్బంది గా అనిపించి "I am sorry I did not mean to stare at you. You look very familiar" అంటే అతను నావైపు ఒక లుక్కిచ్చి "yeah you are from so and so marketing right" అన్నాడు. "No I am not" అని అతనితో గట్టిగా అన్నానే కాని చాలా సిగ్గనిపించింది. ఈ మార్కెటింగ్ ల పుణ్యమా అని మన దేశీయులు కనిపిస్తే కనీసం నవ్వటానికి కూడా లేదు.
ఇలాంటి అనుభవాలు ఫ్రండ్స్ చెప్పినవి ఎన్నెన్నో. మాల్స్ లో, వాల్మార్ట్ లో ఇంకా చాల చోట్ల. ఈ గొడవేమిటో, ఎప్పుడాగుతుందో? దార్లో నిలబెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టటం ఎప్పుదాపుతారో ఏమో? మీకు ఉన్నాయా అనుభవాలు. అయితే చెప్పండి మరి.
అసలు నాకేమనిపిస్తోందంటే వీసా stamping అవ్వంగానే ఇక్కడికొచ్చే జనాలకి ఈ విషయం మీద క్లాసు తీసుకుని పంపిస్తే బెటర్ అని. ఏమంటారు?

7 comments:

  1. నాకు కూడా 2-3 నెలల క్రిత్రం ఇలాంటిదే అయింది. వాల్‌మార్ట్‌లో కూరగాయలు తీసుకుంటుంటే, ఒక "తెగుల"బ్బాయి వచ్చి "Where is the nearest Indian grocery store?" అంటూ మొదలెట్టేడు. నేను త్వరగా కట్ చేసి (5 నిమిషాలలో) బయటపడగలిగేను.

    ReplyDelete
  2. Ha ha ha.. I got the similar kind of experience.. But I ragged that guy, he never tried to talk to me after that..

    ReplyDelete
  3. మాకివన్నీ కొత్తండీ.. కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తి టై కట్టుకుని వినయంగా నవ్వగానే ముఖం సాధ్యమైనంత బిజీగా పెట్టి (అలా ఎలా అని అడక్కండి, అదంతే) ఆటను ఏ వస్తువు గురించి చెప్పబోతుంటే అది "మా ఇంట్లో ఉంది, థాంక్స్" అనడమే అలవాటు.. బాగున్నాయి మీ రెండు టపాలూ.. కొనసాగింపు ఉందా??

    ReplyDelete
  4. :)
    " International Farmer మార్కెట్ "
    మీరట్లాంటానా?

    "ప వి:"she is your missusఆ?" (నన్ను చూపించి)"
    హ హ హ వూదం గారి యింగ్లీషు యూలివ్ లాంగా గుర్తు చేశారు!!!

    PS: you need to write more regularly.

    ReplyDelete
  5. KK , అశోక్ చౌదరి
    "త్వరగా కట్ చేసి" అంటే సరిపోదు. అసలు మీరు వాళ్లకి ఎం చెప్పారో మాకు చెప్పాలి. మరి మాకు ideas కావాలి కదా.
    మురళి
    కొత్త అంటే మిమ్మల్ని రోడ్డు మీద ఎవ్వరు పీడించటం లేదన్నమాట. శుభం. అదే బెటర్. ఇంకా ఇంటికి వచ్చే సేల్స్ వాళ్ళ సంగతంటారా. చెప్పులేసుకుని తలుపు తీసి "మేమిప్పుడే బయటకి వెళ్తున్నాం" అని మేము చెప్పటం నాకు గుర్తు. మరి ఇప్పుడు ఆ ట్రిక్ పనిచేస్తోందో లేదో? ఇప్పటికి ఈ అనుభవాలు చాలు అని readers నే కొనసాగించమని అడిగా.
    కొత్త పాళీ మాస్టారు,
    మీకు కూడా ఆ అబ్బాయి తగిలాడా ఏంటి? encouragement కి చాలా థాంక్స్ అండి.
    తప్పకుండా వ్రాస్తాను. మూడ్ వస్తే చెలరేగి పోవటమే. చదివే వాళ్ళు ఉండాలే కాని.

    ReplyDelete
  6. ఆ విధముగా పరిచయమై మిత్రులయిన వాళ్ళను గురించి కూడా వ్రాస్తే బాగుంటుంది. 40 సంవత్సరాల క్రిందట university of Chicago లో 'రేస్తోరెంట్ ఎక్కడుందండీ' అని అడగటంతో మొదలయిన పరిచయం ఇంకా గాఢంగానే ఉన్నది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  7. హ హ హ మాకూ అయ్యాయి ఆ ప్రహసనాలు. అబ్బ ఎవరన్నా పలకరిస్తారంటేనే భయం, దడ ఒక స్టేగ్ లో ఈ క్షణం మిత్రులు ఏ క్షణాన శతృవులు అవుతారో అని అదొక బెంగ, మరి నిన్నటీ దాకా బాగున్నారా ఎక్కడా మొన్న సినిమాలో కనపడలేదు అని పలకరించే మొహం హటాత్తు గా ------ బ్రాండ్ మొహం పెడితే భయం వెయ్యదు. :-( బాగా రాసేరు.

    ReplyDelete