Tuesday, June 8, 2010

New Jersey లో బాలు


ఇప్పుడే సుజాత గారు బాలు గారికి వ్రాసిన లేఖ చూసా. రెండు వారల క్రితం న్యూ జెర్సీ లో ఆయన లైవ్ ప్రోగ్రాం కి వెళ్లాం. దాని మీద టపా వ్రాద్దాం వ్రాద్దాం అని బాధకిస్తున్డగానే సుజాత గారు తట్టి లేపినట్టుగా ఉంది ఆవిడ లేఖ.
ప్రోగ్రాం సాయంత్రం ఆరున్నరకి అంటే, ఆరు గంటలకల్లా వెళ్ళాం. చాంతాడంత లైను, పట్టు చీరల్లో వచ్చిన ఆంటిలు. సరే లైనులో నిలపడ్డాక "cameras not allowed" అని గుస గుస వినిపించింది. ఆఫీసు లో అడిగితే ఆడిటోరియం రూల్స్ వేరు, ప్రోగ్రాం రూల్స్ వేరు, మీరు అర్గానైజేర్స్ ని కనుక్కోండి అన్నారు. ఆ రద్దీ లో మనకి అర్గానైజేర్స్ ఎలా తెలుస్తారులే అని మా ఆయన్ని కామెర కార్ లో దాచమని చెప్పి నేను లైను లో నిలపడ్డా. ప్రోగ్రాం మొదలయ్యేసరికి ఏడున్నర. బాలు ని స్టేజి మీదికి ఆహ్వానించినప్పుడు చాలా సేపు standing ovation. అదే రోజు ప్రముఖ గేయ రచయిత వేటూరి పోయారని, ఆయన పాట "వేదం అణువణువున నాదం" తో మొదలు పెట్టారు. అన్నట్టు ఈ ప్రోగ్రాం లో ప్రముఖ గాయని ఎస్. పి. శైలజ కూడా పాల్గున్నారు. అప్పుడు బాలు అన్నారు "మాకు సమాచారం కొన్ని గంటల ముందే అందింది. సాధారణం గా ఇలాంటి విచారకరమైన రోజున నేను ఇండియా లో అయితే ప్రోగ్రాం చెయ్యను. కాని ఇక్కడ అలా చెయ్యటానికి వీలు లేదు అందుకని నాకు చాతనైనత వరకు ఈ ప్రోగ్రాం కి న్యాయం చేస్తాను" అని. దాదాపు ఒక ఇరవై పాటల్ని ఆయ పాడుంటారు . మిగతావి శ్రీ కృష, కల్పనా మరియు శైలజ గారు పాడారు. ఆయన "శంకరా...." అని మొదలెట్టగానే auditorium అంతా ఆగకుండా చప్పట్లు. సిరి సిరి మువ్వలో "రా దిగిరా..", "వీణ వేణువైన సరిగమ.." కూడా చాల బాగా పాడారు. జనాలంతా అరుస్తూ పాటలు రిక్వెస్ట్ చేస్తే చివరికి "మీరైతే రోజు కారులో పెట్టుకుని వింటారు కాబట్టి మీకు గుర్తుంటాయి. ముప్ఫై వేలకి పైగా పాటలు పాడాను. నాకెలా గుర్తుంటాయి చెప్పండి?" అన్నారు. చివరికి భరించలేక ఆడియన్సు అరుస్తున్న పాటలన్నీ ఒక్కొక్క దాని పల్లవి పాడారు. "కుర్రాళ్ళో కుర్రాళ్ళు", "ఆరేసుకోబోయి" పాడలేదని నేను డిస్సప్పాయింట్ అయ్యాను. మధ్యలో ఒకసారి "కావాలంటే ఫోటోలు తీసుకోండి కాని వీడియొ మాత్రం తీయకండి" అని ఆయన అనంగానే మొదలైన క్లిక్లు ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు ఆగలేదు.
Belated Happy Birthday Balu.

3 comments:

  1. వెరీ నైస్ కిరణ్. నేను NC లో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళేను బాలు గారి కాన్సర్ట్ కు. నా మదర్స్ డే గిఫ్ట్ అది. ఎంత మంచి గిఫ్ట్ కదా. మీ బ్లాగ్ హారం, మాలిక లలో రాదా? చాలా మిస్ అయ్యా మీ పోస్ట్ లు. హారం మాలిక లలో కూడా కలపమని ఒక మాట వెయ్యండి వాళ్ళకు. ప్లీజ్ మాలాంటి వాళ్ళ కోసం.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete