Friday, May 20, 2011

నాలో కవయిత్రి, మ్యూజిక్ డిరేక్టరిత్రి నిద్ర లేస్తోంది.... లేచింది.... లేచేసింది

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, బేబీ గురించి ఆలొచిస్తూ, పాప ఏడ్చినప్పుడు ఏమేం లాలిపాటలు పాడాలి అని నాకు తెలిసిన పాటలన్నీ గుర్తు తెచ్చుకుని ప్రాక్టీసు చేసుకునే దాన్ని.
వటపత్ర సాయి కి వరహాల లాలి, ముద్దుల మా బాబు, గుడియా రాణి ఇవన్ని రోజు పాడుకునేదాన్ని. పుట్టిన వారం రోజుల నించి రోజు సాయంత్రం మూడు నాలుగు గంటలు ఏడ్చేది. ఒక్కొక్క సారి ఆ ఏడుపు విని చాలా బాధేసేది. మా అమ్మ నాన్న అయితే గిల గిల లాదిపోయ్యేవారు ఆ ఏడుపు విని. తరవాత తెలిసింది దాన్ని "colic " అంటారని అది బేబీకి  మూడు నాలుగు నెలలు వచ్చాక దానంతటదే తగ్గి పోతుందని. దాదాపు డిసెంబర్ చివరి వరకు ఆ నొప్పి ఎలా  భరించిందో ఆ దేవుడి కే తెలియాలి. సాయంత్రం అవుతోందంటే మా అమ్మా, నాన్న భయపడి పొయ్యేవారు. ఎవరైనా ఇంటికొస్తే మాత్రం ఏడిచేది కాదు. నేను ఆఫీసు నించి వచేవరకు అమ్మ నాన్న ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నట్టు ఉండేవారు. Anyway , ఆ ఏడుపుని నా పాటలు అస్సలు ఆపేవి కాదు. దాంతో పాటలు పాడటం కొన్ని రోజులు మానేసాను. ఎవరో చెప్పారు కొంచెం secure గా బ్లాంకెట్ లో చుట్టి పెడితే కాళ్ళు చేతులు ఆడించకుండా పడుకుంటారు, అది కొలిక్ తగ్గిస్తుంది అని. అందుకని "burrito wrap " చేసి పడుకోపెట్టేవాళ్ళం. ఒకరోజు అల్లాగే చుట్టి ఎత్తుకుని ఊపుతుంటే, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు "Moe 's " లో తిన్న burrito గుర్తొచ్చింది. నాకు తెలీకుండానే ఒక పాట/కవిత వ్రాసేసి, పాడేశా. ఆశు కవిత్వం అంటారు కదా? ఆ టైపు లో. వదల మంటారా. అనఖర్లె. ఇదిగో.

పల్లవి:"చిన్న బరిటో, చిట్టి బరిటో, పొట్టి బరిటో, టుట్టి బరిటో"
అనుపల్లవి:"నిన్ని బరిటో, బన్ని బరిటో, డిన్ని బరిటో, మిన్ని బరిటో"

Guacamole ఉందా? బ్రౌన్ రైస్ ఉందా?
గ్రీన్ బీన్స్ ఉన్నాయా? పెప్పర్స్ ఉన్నాయా? "చిన్న"

కారట్స్ ఉన్నాయా? చిల్లీస్ ఉన్నాయా?
టోమాతోస్ ఉన్నాయా? సాల్సా ఉందా?  "చిన్న"

olives ఉన్నాయా? cucumbers ఉన్నాయా?
sour క్రీం ఉందా? cilantro ఉందా? "చిన్న"

ఎక్కడనించి వచ్చావు? mexico నా? puerto rico నా?
taco బెల్లా? చిపోట్లే నా? "చిన్న"

రా బరిటో , కూర్చో బరిటో
పడుకో బరిటో, నిద్రపో బరిటో
చిన్న బరిటో చిట్టి బరిటో
యమ్మి బరిటో ...... అమ్మ బరిటో

ఎలా ఉంది మన టాలెంట్? అలా తప్పట్లు కొట్టకండి. నాకసలే modesty ఎక్కువ బాబు.
అబ్బో అసలు నేను... ఆజ్జ బాబో (మెలికలు తిరిగి పోతున్న నేను)

4 comments:

  1. కేక పెట్టించావమ్మా కిరణ్మయీ! కెవ్వు! కెవ్వు

    మీరిలాగే మంచి పాటలు, లేదా కవితలు రాసి ఒక సంకలనం వేశారంటే ఆ సభకు నేను కూడా వస్తా! అసలే అమెరికా రచయితలు ఏం రాసినా సంకలనం వేయాలని ఉత్సాహపడేవాళ్ళు ఇక్కడ కోకొల్లలు!

    ఇంతకీ మీ పాటని మనస్విని ఎలా తీసుకుంది? నిద్రపోయిందా?

    పాపాయి కబుర్లు బాగున్నాయి

    ReplyDelete
  2. హ్హహ్హహ్హా కిరణ్మయిగారూఊఊఉ...నేను మీ బ్లాగుకి మధుర బ్లాగునుండి వంతెన వేసుకుని వచ్చాను!! ఆ బరిటో పాట అదుర్స్! నేను,మా చందు పడి,పడి నవ్వుకున్నాం! U r just Rockinggggg!! :)

    ReplyDelete
  3. సుజాత గారు
    సంకలనం రెడీ అవుతోది, అయ్యింది, అయిపొయింది. సభకు మీరు రెడీ నా. ఎందుకంటే పూల దండలు అవి కొంచెం భారిగా ఉండాలన్నమాట. హి హి హి
    ఇందు
    బోల్డు బోల్డు థాంక్స్

    ReplyDelete