Monday, June 13, 2011

ఆహా నా టీవీ, ఓహో నా టీవీ

చిన్నప్పుడు టీవీ, radio కంటే ఎక్కువ పొపులర్ గా ఉండేది. దృశ్య శ్రవణ మీడియాల్లో "దృశ్య" కి ఎక్కువ ప్రాముఖ్యత దీనికి ఒక కారణం కావచ్చు. ఆ రోజుల్లో (అంటే నేను ఇప్పుడు పెద్ద ముసలి దాన్నేం కాననుకోండి,  ఇరవయ్యో ఏడు మొన్న పదిహేనేళ్ళ క్రితమే వచ్చి జస్ట్ ఏడాది దాటిందంతే. అంటే నా వయస్సు ఎంతున్తున్దంటారు?) కొన్ని పొపులర్ కార్యక్రమాలు ఉండేవి. చిత్రలహరి, చిత్రహార్, ఎ జో హాయ్ జిందగీ, హం లోఒగ్, క్విజ్ టైం. సెలవరోజుల్లో అయితే సాయంత్రం ఏడు గంటలకి వార్తలు వచ్చే ముందర ముప్ఫై నిమిషాల హైదరాబాద్ దూరదర్సన్ వారి నాటకం, అంతకు ముందు వచ్చే రైతుల కార్యక్రమం అన్ని వరస పెట్టి చూసే వాళ్ళం. స్కూల్ లో న్యూస్ చదివే పిల్లలైతే, తప్పకుండా తెలుగు, హిందీ , ఇంగ్లీష్ న్యూస్ చూస్తే గాని నిద్రపొయ్యేవారు కాదు. శాంతి స్వరూప్ అనే ఒకాయన న్యూస్ చదివే వారని నాకు బాగా జ్ఞాపకం. అలాగే ఇంగ్లీష్ లో గీతాంజలి అయ్యర్ అని ఒకావిడ చదివేది. హిందీ న్యూస్ రీడర్ ఒకావిడ తలలో సైడ్ కి గులాబి పువ్వు పెట్టుకునేది. ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. కొన్ని రోజుల తరవాత రామాయణ్ మరియు బునియాద్ ఆ తరవాత మహాభారత్ లాంటివి పొపులర్ అయ్యాయి వరసగా. తరవాత DD2 అని అనుకుంటా మొదలెట్టారు అందులో ప్రోగ్రామ్స్ నాకు అంతగా గుర్తులేవు. తరవాత కేబుల్ సిస్టం మొదలయ్యింది. ముందర మన ఇంటి దగ్గర "కేబుల్ అబ్బాయి" దగ్గర కనెక్షన్ తీసుకుని, వస్తు పోతు ఈ రోజు ఈ సినిమా వేస్తావా, ఆ సినిమా వేస్తావా అని అడిగే వాళ్ళం. ఓ ఆరు నెలలో ఏదో అనుకుంటా ఆ ప్రక్రియ సాగిన తరవాత పిచ్చ పిచ్చగా చానల్స్ రావటం మొదలెట్టి ఓ యాడాదికి అసలు ఎ ఛానల్ ఎక్కడోస్తోంది, అందులో ఎం ప్రసారమవుతోంది, remote లో ఉన్న ఈ బటన్ ఎం చేస్తుంది అని జనాలు వీర లెవెల్ లో కొట్టుకునే టైం కి మనం దేశం విడిచి ఇదిగో ఇక్కడకొచ్చాం. ఆ తరవాత భారత దేశం లో చానల్స్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు. అప్పుడప్పుడు, అమ్మ SPB గారి పాడుతా తీయగా గురించో మరోటో చెప్తే వినటం తప్ప. ఈ సుత్తంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, పోయిన సంవత్సరం అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు  ఒక అయిదారు చానల్స్ package కనెక్షన్ తీసుకున్నాం. అసలు జనాలు ఆ న్యూస్ చదవటం ఎంటండి బాబు? "ఈ రోజు ఆట లో ధోని అదరగొట్టాడు". ఏమిటిది? బాగా ఆడాడు అని చెప్పటం సొంపా? costumes అయితే కొంతమందివి పరమ వికారం గా. ఏదో వంటల కార్యక్రమం అట. ఆ anchor ఒక వంట చేసే ఆవిడని "మొదట ఎం చెయ్యాలండి?" అని అడిగితే ఆవిడ సమాధానం "స్టవ్ వెలిగించాలండి". ఆవిడ మీడియా ప్రొఫెషనల్ కాదు. అలాంటప్పుడు కొంచెం ముందర వాళ్ళతో మాట్లాడి ప్రోగ్రాం ఇంటెరెస్టింగ్ గా చెయ్యాలి కాని మరి తెలివి లేకుండా ఇదెక్కడి గొడవ. విసుగొచ్చేసింది. ఇంక మన చిన్నప్పటి టీవీ రోజులు మళ్ళి రావా?

3 comments:

  1. పక్కకి గులాబీ పువ్వు పెట్టుకునే ఆవిడ పేరు సల్మా సుల్తాన్ :)

    ReplyDelete
  2. ఇంకా మంజరి జోషి, రిని సైమన్(ఖన్నా)ఇంకా ఒక పెద్దావిడ వీళ్ళు న్యూస్ చదివే విధానం నచ్చి పూర్తిగా అర్ధం కాకున్నా (హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలూ)కూర్చుని చూసేవాళ్ళం. బసేరా, ఉడాన్, గుల్ గుల్షన్ గుల్ఫాం ఇలా ఎన్నో సీరియల్స్ ఇంటిల్లిపాది కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. వారంలో ఒక రోజు, పైగా 13 వారాల్లో ఐపోయేది కనుక సరదాగా ఉండేది. ఇప్పుడు ఆ క్వాలిటీ లేదు. 24 గంటలు, ఇన్ని రకాల చానెల్స్ చూపించాలంటే ఇంతకన్నా ఏమి ఉంటుంది?

    శ్రీరాగ

    ReplyDelete
  3. సల్మా సుల్తాన్ గురించి ప్రసీద గారు చెప్పేశారు కాబట్టి, నేను మన తెలుగు విజయదుర్గనీ, రోజారాణినీ గుర్తు చేస్తున్నా..
    మీరింకా అన్ని కార్యక్రమాలూ చూసినట్టు లేదు.. చూసి ఉంటె మీ పోస్టు మరోలా ఉండేది :))

    ReplyDelete