Tuesday, July 14, 2009

మావారు బంగారు కొండా......

మీకేదైనా తెలుగు సినిమా పాట గుర్తొచ్చిందా? నాక్కూడా.
అదేంటమ్మాయి? ఇన్ని రోజులు నీ బాగోగులు చూసిన అమ్మానన్నని, అన్నదమ్ములని, అక్కచెలెల్ని అందరిని పక్కన పెట్టి, మీ ఆయన గురించి రాస్తావేంటి? అనకండి. ఏదో ఈ టైటిల్ పెట్టి post వ్రాయలనిపించి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మా అయన విషయానికొద్దాం. మా ఆయనలో నాకు చాలా చాలా నచ్చే విషయం ఏంటంటే, నన్ను ఎప్పుడు కంట్రోల్ చెయ్యటానికి ట్రై చెయ్యరు. మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చక్రాలు తిప్పుకుంటే, నేను చదువుకోవటానికి US వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఇంట్లో (కార్ లో) పరిచయమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్ మే. Ph. D అయ్యిన్తరవాత తనకి NY లో ఉద్యగం వచ్చింది. నాకేమో వేరే ఊర్లో. తరవాత సంవత్సరానికి మా పెళ్ళయ్యింది. ఇప్పటికి మా పెళ్ళయ్యి మూడేళ్లు కావస్తుంది. అయినా ఉద్యోగరీత్యా వేరే ఊర్లోనే ఉంటున్నాము. కనపడిన ప్రతి వాడు, "when will you and your husband stay in the same city" అనో, "you need to make a decision soon and stay in the same place" అనో, లేక ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి "after a few years, you will have kids and stay home anyway. Why do you want to go through all these troubles" అనో హింసిస్తాడు తప్ప, ఆయన మాత్రం ఎప్పుడు job వదిలి పెట్టమని చెప్పలేదు. నా professional development కి సలహలిస్తారే కాని "నువ్వేలాగో కొన్ని రోజుల తరవాత NY కి వచేస్తావుకా? ఎందుకు చెప్పు నీకీ ప్రమోషన్ల గొడవ?" అని discouraging గ మాట్లాడరు. ఎవరినైన మా ఇంటికి డిన్నర్ కి పిలుస్తే నేను రెండు items చేస్తే నాకు సాయంగా ఆయన నాలుగు చేస్తారు. పైగా నా ఫ్రెండ్స్ వస్తే "నువ్వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వంట నేచేస్తాలే" అంటారు. ఎప్పుడైనా "అబ్బ Mango లస్సి తాగాలని ఉంది" అంటే, "సాయంత్రం రెడీగా ఉండు, ఎడిసన్ వెళ్లదాం" అంటారు. ఇదంతా తెలుగులో అనుకుంటున్నారా? ఆలా అయితే మీరు సాంబార్ లో కాలేసినట్టే. హ్హ హ్హ హ్హ. ఎందుకంటే నేనేమో తెలుగు, ఆయనేమో అరవం. మా conversation ఇలా ఉంటుంది:
"ఏమండి, ఇంద movie పొలామా?"
"Which movie"
"Lord of the Rings"
"evening ready ఆ ఇరు"
"what time ఇంటికి వరపోరే?"
"అంజు మనికి (ఐదు వెళ్ళు చూపిస్తూ)"
"సల్వార్ wear pannatumma, jeans wear pannatumma"?
"Why don't you wear a చీర today?
ఇది నిజ్జంగా నిజం. నేను exaggerate చెయ్యట్లా. ఇందులో ఉన్న మూడు languages ని మీరు ఇప్పటికే కనిపెట్టారు కదా.
ఏంటి? ఆయన మీద చాల మంచి మాటల్ని చెప్పి too much senti అయిపోతున్నానా? నాకు చిరాకు తెప్పించే పనులు కూడా చేస్తాడు ఒక్కొక్కసారి. అవి నెక్స్ట్ టపా లో చెప్తా.

5 comments:

  1. Mango లస్సి తాగాలంటే న్యూ యార్క్ నుంచి ఎడిసన్ (న్యూ జెర్సి) వెళ్లాలా? న్యూ యార్క్ లోని Lassi restaurant లొ లభ్యం కాదా? చూడండి. http://www.lassinyc.com/index.html

    ReplyDelete
  2. cbrao గారు
    ఎడిసన్ కి వెళ్తే మిగతా desi groceries పన్లన్నీ అయిపోతాయి కదా. అందుకని. పైగా మేమున్నది NY city కాదు.
    నా మొదటి పోస్ట్ లో మొదటి comment చేసినందుకు చాల Thanks.

    ReplyDelete
  3. cbrao గారు
    ఇప్పుడే మీ ప్రొఫైల్ చూసాను. మీరు writer అని తెలిసాక నాకు భయం ఎక్కువైయ్యింది. నేను blog continue చెయ్యొచ్చు అంటారా, లేక అనవసరంగా అందరిని బాధ పెట్టటం ఎందుకంటారా? I would like your input on my writing style. Please.

    ReplyDelete
  4. కిరణ్మయి గారు బాగా రాసారు.ఇంక అచ్చుతప్పులంటారా ,ఇరుకుం ఇరుకుం ..నేను బ్లాగ్ రాయడం మొదలెట్టి బోలెడు రోజులయ్యింది వాటిని సరి చేయడమే నాకు ఇంకా రావడం లేదు.. అయితే మీరు అర్జెంట్ గా తెలుగులో మావారు శ్రీవారు మా మంచి వారు అని పాడేసుకోండి.. మళ్ళా అరవం లో పాడితే ఆయనకు అర్ధం అయిపోయి మీరు గొడవ పెట్టుకున్నపుడు దెప్పుతారు :)

    ReplyDelete
  5. awesome andi..navvu aapalekapoya mee conversation chadivi.

    ReplyDelete