Wednesday, July 22, 2009

అమ్మ బాబోయ్ exams ..... అయ్యబాబోయ్ results

చిన్నప్పుడు నాకో అభిప్రాయముండేది. అదేంటంటే మనకి exams ఉన్నప్పుడు మనతోబాటు చుట్టుపక్కలుండే సమస్త జీవ కోటి భయం భయంగా, ప్రతి క్షణం టెన్షన్ తో ఉండాలని. పొరపాట్న ఎవరైనా నాకు ఏమాత్రం సంబంధం లేని విషయం గురించి నవ్వుకున్నాకాని నన్ను, నా exam సరిగ్గా వ్రాయలేని అసమర్ధతని చూసి నవ్వుతున్నారని నాకనిపించేది. పైగా, నా ఎగ్జామ్స్ జరుగుతుంటే ఇంట్లో ఎవ్వరు TV పెట్టకూడదు, షాపింగ్ కి వెళ్ళకూడదు, ఎంజాయ్ చెయ్యకూడదు అని తెగ రూల్స్ పెట్టేదాన్ని. ఎందుకంటే మరి నేను ఎంజాయ్ చెయ్యట్లేదు కదా అందుకన్నమాట. ఎగ్జామ్స్ మొదలవ్వగానే దేవుళ్ళకి మొక్కుకోవడం మొదలెట్టేసేదాన్ని. ఎగ్జామ్స్ మంచి మార్కులతో పాస్ చేయించు దేవుడా, సో అండ్ సో రోజు ఉపవాసం ఉంటాననో, లేక ఇంకేదో మొక్కేసేదాన్ని. ఏదైనా పేపర్ బాగా వ్రాయకపోతే ఇంటికొచ్చి పిచ్చి పిచ్చిగా ఏడిచే దాన్ని. ఇవ్వాళ్ళ పేపర్ బాగా రాయలేదు, ఫెయిల్ అయిపోతాను ... అని. On top of that ఇంకొక అలవాటుండేది. ఇంటికొచ్చి అన్నం తింటున్నప్పుడు, ఆరోజు పేపర్ ని తల్చుకుని, ఎన్నెన్ని లైన్లు వ్రాసాను, దానికి ఎన్నెన్ని మార్కులిస్తారు అని guess చెయ్యటం. At least 50% అయినా రాకపోతుందా? అని నన్ను నేను సద్దిచెప్పుకోవటం. మా అమ్మకి నేనిది బాగా అలవాటుచేసానేమో, మా తమ్ముడి exams అయినప్పుడు తెగ భయపడి పొయ్యేది. వాడు exam అయ్యాక ఇంటికి రాగానే "ఎలా రాసావురా" అని గుమ్మంలోనే అడిగేది. మా వాడికి అసలే తిక్క. వాడికి ఒళ్ళుమండి "Pen తో" అని లోపలి వెళ్లి పొయ్యేవాడు. దాంతో యుద్ధం స్టార్ట్. "చూసావా, నేనింత ఆత్రంగా అడిగితే ఎలా తిక్క సమాధానం చెప్తున్నాడో?" అని.
ఇదంతా ఒక ఎత్తైతే results ముందు ఇంకొక టైపు భయం. "అసలు పాసవుతానా, పేపర్ లో నా నెంబర్ కనిపిస్తుందా?" ఇలాంటి డౌట్ లు. మా చిన్నాన్న గారు నా ఫేస్ చూసి నాకున్న ప్రస్తుత భయం యొక్క కారణం కనిపెట్టేవారు. "దీని ఫేస్ ఇలా ఉందేంటి? Exams అవుతున్నాయా?" అనేవారు.
ఇంత stress లో మనం ఉంటె, జనాల ఉపదేసాలోకటి. "At the most ఏమవుతుంది, మళ్ళి ప్రిపేర్ అవ్వాలి అంతే కదా. Knowledge కోసం చదవాలి కాని, మార్కుల కోసం కాదు" అని. ఎహే ఉరుకొండి. నేను చదివేది మార్కుల కోసమే అంటే వినిపించుకోరు. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది. అందుకే ఎవరైనా ఎగ్జామ్స్ అని భయపడే పిల్లల్ని చూసి వాళ్లకి సింపతి చూపిస్తాను తప్ప అనవసరంగా ప్రీచింగ్ చెయ్యను.

2 comments:

  1. నిజమే పరిక్షలంటేనే నేను 10 లంఖణాలు చేసినట్లు తయారయ్యేదాన్ని..మా అక్క మాత్రం ఫుల్ మేకప్ వేసి వెళ్ళేది దానికేమాత్రం టెన్షన్ ఉండెది కాదు exam అంటే

    ReplyDelete
  2. me writing style (kadha silpam ani analemo) bagundhi

    ReplyDelete