Thursday, July 16, 2009

నేను- నా sweet tooth

చిన్నప్పుడు పుట్టిన రోజునాడు పొద్దున్నే లేచి, తలస్నానం చేసి, నాన్నగారితో నారాయణగూడ లో ఉన్న Balaji Mithai Bhandaar లో కలాకంద్, కోవా చెరో కిలో ఇంకా ఆరోజు ఫ్రెష్ గా చేసిన, మనకి చాల నచ్చేసే రెండు మూడు రకాలు చెరో పావు కిలో ఇంకా కారబ్బూంది తెచ్చేసుకుంటే కాని birthday మొదలయినట్టు అనిపించేది కాదు.
అసలు స్వీట్ ని ఎలా తినాలంటే:
మనకిష్టమొచ్చిన స్టొరీ బుక్ ని తెరిచి, కధ చదవటం మొదలుపెట్టి, చిన్న ముక్క నోటితో కొరికి, దానిని minimum ఐదు నిమిషాలు చప్పరించి, ఆ తీపి, యాలకుపొడి వాసన, కుంకుమపువ్వు (స్వీట్ లో ఉంటె) flavor ని ఆస్వాదించి అప్పుడు కొంచెం కొంచెం గా మింగాలి. ఆహా ఆ అనుభవాన్ని మాటలతో చెప్పలేము కదా.
నేను చిన్నప్పటి నుంచి desserts కి వీరాభిమానిని. స్వీట్ అంటే ఇష్టం లేని మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారంటే నేను చిన్నప్పుడు నమ్మేదాన్ని కాదు. అసలు స్వీట్ తినకుండా మనుషులు ఎలా ఉండగాలుగుతారండి. ఉగాది, దసరా, దీపావళి లాంటి పండగలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ చేసేవారు బూంది లడ్డు, కజ్జిజాయలు, లస్కోరా (దీన్నే కొబ్బరి లౌజు కూడా అంటారని తరవాత తెలిసింది). ఆహా, ఆ కర్పూరం వాసనా, చక్కర పాకం లో just వేసిననందువల్ల ఇంకా ఉన్న crispyness, తిన్నవారికే తెలుస్తుంది ఆ మజా ఏంటో.
నా లెక్క ప్రకారం స్వీట్స్ ని చాల రకాలుగా categorize చేయొచ్చు. చెప్తావినండి:
మొదటి category:
Routine type - andhra type:
Routine type అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టక టకా నారాయణగూడ వరకు వెళ్లి తెచ్చుకునే టైపు.
Andhra type అంటే ఆవైపునే ఉన్న విజయ కాటేజీ లేదా కొంచెం ఎక్కువ నడిచి చిక్కడపల్లి వరకు వెళ్లి బందర్ mithai bhandaar లో తెచ్చుకునే అరిసెలు, కాజాలు మరియు బందరు లడ్డు లాంటివి. వీటిని ఆంధ్ర టైపు అని నేను ఎందుకన్నానంటే మా ఇంట్లో ఏదైనా చిన్న సైజు ఫంక్షన్ (బారసాల లాంటిది) జరిగినా లేదా అమ్మ వైపు చుట్టాలు రాజమండ్రి ప్రాంతాలనుంచి వచ్చినప్పుడు అమ్మ అవే తెచ్చేది (లేదంటే మేం వెళ్లి తెచేవాళ్ళం). పైగా వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ కొట్టేది. "అరిసెలు ఓ అరకిలో పట్రండి. స్వీట్ తెమన్నా కదా అని "peda" అని చెప్పి నాలుగు కోవా బిళ్ళలు తీసుకురావద్దు. ఆ పేరు వింటే వాళ్ళు తినరు కూడాను". మా మావయ్య పెళ్లి కాకినాడ లో జరిగింది. అప్పుడే మనకి ఎవరో కాకినాడ కాజా introduce చేసారు. ఈ category కి ఆంధ్ర టైపు అని నేను పేరు పెట్టడానికి ఇది కూడా కారణం. MSc అయ్యాక SR Nagar లో work చేసినప్పుడు అక్కడ స్వగృహ ఫుడ్స్ అని చాల స్వీట్ షాప్స్ తెరిచారు. ఇక నాకైతే పండగే. అక్కడే మనం పూత రేకులు కూడా తిన్నాం. అసలు ఆ ఆర్టిస్టిక్ ability కి చెప్పాలండి జోహార్లు. ఆ సన్న సన్నని పేపర్ లాంటి దాని మధ్యన ఆ చక్కర పొడి. అయ్యో.......
ఇక second way of categorization: Traditional type-Almond House type
నేను కొంచెం పెద్దయ్యాక ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిన తరవాత మా ఫ్రెండ్స్, నేను కలిసి హిమాయత్ నగర్ వైపు Curry Puff, pizza లాంటివి తినటానికి వెళ్ళే వాళ్ళం. ఆరోజుల్లో అది చాల happening place. అక్కడ almond house అని early 90s లో అనుకుంట స్టార్ట్ చేసారు. ఆ షాప్ లో ప్రతి స్వీట్ లో ఒక బాదాం ఉంటుంది. ఆ షాప్ లో నేను అన్ని variety లు taste చెయ్యలేదు.
ఇక పొతే ఇంకో category. అదేంటంటే regular-Occasional
Regular అంటే ఈజీ గా దొరికే స్వీట్లు. Occasional అంటే మనకి అంత వీజీ గా దొరకవు. అప్పుడప్పుడు దొరుకుతాయి. అమ్మ, నాన్న teachers ని కలవటానికి స్కూల్ కి వచ్చినప్పుడు పక్కనే abids John bakery లో దొరికే pastry లు, ముందు చెప్పినట్లు హిమాయత్నగర్ కి వెళ్ళినప్పుడు కొంచెం డబ్బులు మిగిలితే "King and కార్డినల్ (స్పెల్లింగ్ కరెక్ట్ కదా?)" లో కొనుక్కునే pastry లు అలాన్తివన్నమాట.
గత ఐదారేళ్లుగా ఇంకో కొత్త category కనిపెట్టా. "దేశి-విదేశి" అంటే "Indian-foreign"
Indian అంటే మన ఇండియన్ grocery stores లో దొరికే మోతీ చూర్ లడ్డు, జిలేబి, బర్ఫీ లాంటివి. Foreign అంటే Panna Cotta, cannoli, Tiramisu, cheese cake లాంటివి.
మనం స్వీట్స్ ని climate ని పట్టి కూడా categorize చెయ్యొచ్చు. సమ్మర్ లో అయితే ఐస్ క్రీం లాంటివి తినాలి. చలి కాలం లో అయితే పాకం లో వేసిన జంతికలు, ఇక్కడ US లో అయితే funnel cake లాంటివి తినొచ్చు. అలాగే మనకి stress బాగా పెరిగిందనుకోండి, అది పోగొట్టుకోవటానికి కొన్ని combinations తినొచ్చు, For example గులాబ్ జామున్ ని ఒక 30 seconds వేడి చేసి chilled custurd తో తినచ్చు.
రుచిగా చేసిపెట్టే వాళ్ళు ఉండాలేకాని నాలాగ స్వీట్స్ ని లోట్టలేసుకుని తినేవాళ్ళకి కొదవా చెప్పండి? మీకు తెలిసిన లేదా మీరు కనిపెట్టిన కొత్త స్వీట్లు లేదా category లు ఎవైనా ఉంటె వెంటనే తెలియజేయగలరు.

4 comments:

  1. MAYI GAARU,
    ఇంత sweet post నేనెపుడూ చదవలేదు.ముందు మీ నడుము చుట్టుకొలత ఎంత ఉందో చెప్పండి.

    ReplyDelete
  2. నిహారిక గారు
    అమ్మా..... అడగంగానే చెప్పేస్తానేంటి? కాకపోతే మా ఇంట్లో కూడా అదే టెన్షన్. షాప్స్ లో స్వీట్స్ వైపు వెళ్తుంటే నన్ను వేరే వైపు బర బారా తోసేస్తారు.

    srujana
    Thanks

    ReplyDelete
  3. హమ్మయ్య, నేను ఇక నిశ్చింతగా పడుకుంటాను.మిమ్మల్ని shop లోకి వెల్లకుండా లాగేవాళ్ళు ఉన్నారుగా,లేకపోతే ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకున్నాను.

    ReplyDelete