Thursday, August 6, 2009

మా ఇంటికి భోజనానికి రండి Part 1

అసలు... వీకెండ్ ఎందుకు? అహ ఎందుకని అడుగుతున్నా? అసలు వీకెండ్ ఎందుకంటే .... మనం పొద్దున్నే, అంటే ఎ ఎనిమిదిన్నరకో లేదా తోమ్మిదిన్నరకో లేచి, పదిన్నరకి బ్రష్ చేసి, మనకిష్టమొచ్చిన టిఫిన్ మెక్కి, ఎ ఒంటి గంటకో స్నానం చేసి, కొంచెం సేపు పడుక్కుని, లేచి, ఈమెయిలు చెక్ చేసుకుని, టీవీ చూసి, వంట చేసుకుని, తిని, వాకింగ్ కి వెళ్లి వచ్చి పడుకోవటానికి. ఇలాంటి ప్రశాంతమైన వీకెండ్స్ మనం ఎంజాయ్ చెయ్యటం చూసి, దేవుడికి జెలసి వచ్చి మన బుర్రలో ఒక ఆలోచన పెడతాడు. అదేంటంటే ఎవరినైనా లంచ్ కో లేదా డిన్నర్ కో పిలవటం.
ఇంక చూస్కోండి. ఫ్రైడే నించి మొదలవుతుంది గొడవ. మా అమ్మ ఎవరినైనా భోజన్ననికి పిలిస్తే టక టకా ఎలా వంట చేసేదో తెలీదు కాని, నాకైతే పెద్ద nightmare. అలా అని నాకు వంట చెయ్యడం రాదనుకోకండి. బాగానే వండుతాను.
కాకి పిల్ల కాకికి ముద్దు కదా, ఆ టైపు లో. వంట చేసేటప్పుడు నాకోచ్చే పెద్ద ప్రాబ్లం. Taste చెయ్యకపోవటం. చిన్నప్పుడు మా అమ్మ వంట చేసేటప్పుడు చూసేదాన్ని. ప్రతి వంటకాన్ని స్టవ్ ఆఫ్ చేసేముందర చెంచా తో తప్పకుండ రుచి చూడవలసిందే. ఇప్పుడు తెలుస్తోంది. నా వంటకి వంకలు పెట్టినట్టు మా అమ్మ వంటకి ఎవ్వరు వంకలు ఎందుకుపెట్టలేదో. అయినా రుచి చేసి చూద్దాం అన్న ధ్యాసే ఉండదు నాకు. సరే డిన్నర్ invitation విషయానికొస్తే.... హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు మనం కిచెన్ లో ఉన్న అమ్మతో మాట్లాడడానికి తప్పితే అటు వైపు వెళ్ళే ఛాన్స్ లేదు. At the most, అప్పుడప్పుడు కూరని మాడిపోవకుండా కలపటం, గిన్నెల మీద మూత పెట్టటం లాంటివి చేసేదాన్నేమో. ఇక్కడి కొచ్చాక, చదువుకున్నన్ని రోజులు university ఉన్న తొట్టి గ్యాంగ్ మన టైపు వాళ్ళే కాబట్టి ఎప్పుడైనా తినటానికి రమ్మన్నా, గమ్మునోచీసి తిని లాబులకి వెళ్లి పోయేవాళ్ళు. దీపావళి, హోలీ లాంటి పండగలకి మన ఇండియన్ స్టూడెంట్ అస్సోసిఅషన్స్ ఉండనే ఉన్నాయి. చక్కగా ఇంట్లో పూజ్చ్చేసుకునోచ్చేసి "Diwali Dhamaka" లో లాగించేయ్యటమే.
ఇలా మన ఇష్టం వచినట్టు మనం బ్రతుకుతున్న రోజుల్లో మన ప్రశాంతతని భంగ పరచటానికి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవేంటంటే, చాలగోప్పగా వంట చేసే స్టూడెంట్స్ మనకి ఫ్రండ్స్ అవ్వటం, లేదా మనకి పెళ్లి అవ్వటం. నా విషయం లో ఈ రెండు జరిగాయి. Details తరువాతి post లో.

4 comments:

  1. కిరణ్మయి చాలా బాగా రాస్తున్నారు. ఇప్పుడే మొదటి సారి మీ బ్లాగ్ లోకి వచ్చాను. వెల్కం to బ్లాగ్లోకం ( అరవాయన తెలుగు పెళ్ళం భాష లో చెప్పినట్లు వుందా ఇంగ్లీష్ ను తెలుగు లో రాస్తుంటే. అవును మీ కాంబినేషన్ గురించే అంటున్నా ;-)).. మంచి ఈజ్ వుంది భాష లో, చెప్పే విధానం లో.... ఆల్ ది బెస్ట్... మీ స్వీట్స్ గోల చదివేక నాకు కూడా తీపి తినాలని వుంది వెళ్ళొస్తా మరి..
    బై ది వే "చాలగోప్పగా వంట చేసే స్టూడెంట్స్ మనకి ఫ్రండ్స్ అవ్వటం, లేదా మనకి పెళ్లి అవ్వటం. నా విషయం లో ఈ రెండు జరిగాయి." అదుర్స్ చాలా సేపు నవ్వుకున్నాను..

    ReplyDelete
  2. హ హ!!!! నాకు ఇంకా పెళ్లి కాలేదు(దానికి ఇంకా ఐదేళ్లు వేచివుండాలేమో).... బాగా మెక్కి వీధుల మీద పడి తిరిగే మిత్రులే ఉన్నారు. కనుక మీకు ఎదురైన అనుభవము నేను చవిచూడలేదు. కాని మా అమ్మ బాగా వండుతుంది. మా నాన్న అంతకన్నా బాగా రుచిని ఆశ్వాదించే వారు కావడంతో, మా తల్లిదండ్రులు బాగా అదృష్టవంతులు.

    ReplyDelete
  3. ఆహా..మొదటి పేరా అదుర్స్ ,కాకపోతే అలా వీక్ ఎండ్ నాశనం చెసే అవిడియాలన్నీ మా ఆయనకు వస్తాయి మా ఇంట్లో అయితే :)

    ReplyDelete
  4. Sorry folks
    reply ఇవ్వటం కొంచెం లేట్ అయ్యింది

    భావన, thanks ఇంతకి ఎ స్వీట్ తిన్నారు?

    సాయి ప్రవీణ్, మీ పేరెంట్స్ నిజంగా lucky.
    నేస్తం, అలాంటి అవిడియాల sources కొంచెం జాగర్తగా మానిటర్ చెయ్యండి.

    ReplyDelete