Monday, August 10, 2009

మా ఇంటికి భోజనానికి రండి. Part 2

చాలా గొప్పగా వంట చేసే ఫ్రండ్స్ అని చెప్పాకదా. ఇప్పుడు ఆ ఫ్రండ్స్ ని గురించి తెలుసుకుందాం. సమ్మర్ లో 4th of july వీకెండ్ కి ఫ్రండ్స్ నయాగరా వెళ్దామంటే సరే అని రెడీ అయ్యా. ఒక couple, వాళ్ళ ఫ్రండ్స్ ఇద్దరు, నేను వెళ్దామని ప్లాన్. US కి వచ్చాక నా ఫస్ట్ ట్రిప్. తొమ్మిది గంటల ప్రయాణం. మాట్లాడుకుంటూ వెళ్తుంటే టైం తెలీలేదు. ఆ ఒచ్చిన ఫ్రండ్స్ ఇద్దరిలో ఒకతనేమో ఫార్మసి డిపార్టుమెంటు లో Ph.D చేస్తున్నాడు. అబ్బ దారి పొడుగునా ఒకటే సుత్తి. తెగ బోర్. ఇంకొకతనేమో microbiology లో Ph. D చేస్తున్నాడు. చెన్నై కుర్రోడు. పుస్తకాలు, సినిమాలు అంటూ చాల కబుర్లు చెప్పాడు. మూడు రోజులు చాల సరదాగా గడిచి పోయింది. ఇంటికొచ్చేసి నా గొడవలో నేను పడిపోయాను. ఒక వారం తరవాత తెగ బిజీ గ lab lo పని చేసుకుంటుంటే, నాకోసం ఎవరో వచ్చారంటే బయటకి ఒచ్చాను. చూస్తే chennai microbiology!!! ఎందుకోచ్చాడబ్బా అని అనుకుంటుంటే "I am making Dosa tonight. Stop by on the way home" అన్నాడు. ఇంతక ముందే చెప్పాకదా university లైఫ్ లో ఎవరైనా తినడానికి పిలిస్తే మాట్లాడకుండా వెళ్లి తినోచ్చేయ్యలని. సరే ఎలాగు వంట చెయ్యటానికి ఓపిక లేదు మంచి టైం లో invitation ఒచ్చిందిలే అని వెళ్ళా. కొబ్బరి చట్ని, ఆలూగడ్డ కూర తో నోట్లో పెట్టుకుంటే కరిగి పోయేటట్టు ఉన్నాయా దోసలు. ఇదేంట్రా దేవుడా. "ఆడపిల్లలు కూడా సిగ్గుపడేటట్లు నువ్విలా దోశలు వెయ్యతమేంటి బాబూ" మొహం మీదే అడిగేసా. "it is not that hard. making the batter just takes time" తీసి పారేసినట్టుగా నవ్వుతు సమాధానం చెప్పాడు. చెప్పొద్దూ, నాకైతే బలే సిగ్గేసింది. ఇది లాభం లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని బయటకి మాతం పళ్ళికిలించి, "dosa was really tasty. Thanks" అనేసి బయటపడ్డా. నెల రోజులాగి వాడిని (ఈ నెల రోజుల్లో చాల మంచి ఫ్రండ్స్ అయిపోయాం, అందుకే వాడు అనటం), వాడి కజిన్ ని కూడా పిలిచా డిన్నర్ కి. సరే ఆరవ జనాలు కదా అని, సాంబార్ attempt చేశా (MTR mix తో). తినేసి ఏమి పెద్ద comment చెయ్యకుండానే వెళ్లి పోయ్యరిద్దరూ. చెప్పొచ్చేదేంటంటే microbiology సహాయంతో ఆతరవాత నేను చాల dinner లు, lunch లు ఇచ్చాను. superb గా వంట చేస్తాడు. అతనికి తెలీని dish లేదు. అతను భోజనానికి పిలిచాడంటే జనాలు పనులాపుకుని మరీ వస్తారు. ఆ తరవాత ఎప్పుడు దోసలు చేయ్యలనిపించినా నా apartment లో చేసేవాడు. తనకి assistant లు ఇష్టం అట. తను దోసలు చేస్తుంటే మిగతా వాళ్ళందరూ మెక్కుతూనే ఉంటారు తప్ప హెల్ప్ చెయ్యరు. కాని నేను మాత్రం, serve చెయ్యటం, దోశ మీద కూర వెయ్యటం, పొడి వెయ్యటం, ఉల్లిపాయలు తరగటం చేస్తా కదా. అందుకని తతంగమంతా మా ఇంట్లో ఉండేది. Party అయ్యాక మా రూంమేట్స్ అనేవారు "క్లీన్ అప్ పెద్ద గోల కాని, ఫస్ట్ క్లాసు దోసలు తిన్నాం. నువ్వుకూడా అల మంచిగా దోశ చెయ్యటం నేర్చుకోరాదు, మనం ఎంచక్కా ప్రతి సండే దోసలు తినొచ్చు అని". అసలు సిసలైన point ఏంటంటే, ఆ (ఈ) మహానుభావుడికి మేము కలిసిన నాలుగేళ్ళకి నన్ను పెళ్లి చేసుకోవాలనే సంకల్పం ఒచ్చింది, మా పెళ్లి కూడా అయ్యింది. తనకైతే పెర్మనెంట్ అసిస్టెంట్ దొరికింది కాని ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిస్తే చాలు మా ఇంట్లో అయితే పెద్ద యుద్ధమే. ఏది ఓ పట్టాన నచ్చదు. కూర ముక్కల size దగ్గరినుంచి అంత perfect గా ఉండాల్సిందే. ఒక్కొక్కసారైతే భలే ఒళ్ళు మండిపోతుంది. కాని end result మాత్రం మహా tasty. 2000 లో నేను చేసిన సాంబార్ ఎలా ఉంది అనడిగితే నవ్వేసి ఊరుకుంటాడు. వాళ్ళ కజిన్ "అది సాంబారా? చా?" అంటాడు. ఆ సంగతి ఎవ్వరికి చెప్పొద్దని ఇద్దరి దగ్గర స్టాంపు పేపర్ మీద సంతకం తీసుకున్నా. మా ఇంట్లో డిన్నర్ party ల గురించి, ఇంకొక మంచి cook దోస్త్ గురించి నెక్స్ట్ పోస్ట్ లో చెప్తా. మా ఆయన తినటానికి టేబుల్ ముందర కూర్చున్నారు నాదే ఆలస్యం. వస్తా.

10 comments:

  1. మీ ఇంటికి భోజనానికి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నారు?

    ReplyDelete
  2. మీ తరువత పొస్ట్ చాలా బాగు౦ది...మీ బ్లొగ్ కి మొదటి సారి వచ్చా.
    మీ పార్ట్ ఒన్ కుడా చదివా..వెర్య్ గుడ్..
    మా వారు నాకు ఒ౦ట్లో బాగోనప్పుడు కో౦చ౦ రెడి అవుతారు వ౦టకి,
    కాని నేను కిచెన్ లో ఉ౦డాలి,ఇ౦క అది ఎది,ఇది ఎ౦దుకు అని ...
    సో నాకు నేను వ౦డేస్తే గోడవ ఉ౦డదు అని అన్పిస్తు౦ది.
    నేను వెయిట్ చెస్తున్నా..మీ వ౦ట కొస౦ కాదు బాబొయ్...
    కొస౦...

    ReplyDelete
  3. శరత్, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు
    సుభద్ర, thanks

    ReplyDelete
  4. mayana vanta chestharu ,taste adiripothundi,kani badluck entante kitchen ant anenu amlli sardukovali .10nimishala sukham kosam ,twodays work endukani nenu vaddantanu.mi blog super

    ReplyDelete
  5. ఒహ్హోహ్హో.. చాలా సంతోషం. అలా ఆశలదోశలమోహావేశాల్తో మిమ్మల్ని కట్టిపడేశారన్న మాట .. చెన్నై మైక్రోబయాలజీయా, మజాకానా? మొత్తానికి మా సాంబారువారి కోడలయ్యారు. రొంబ ప్రమాదమా ఇరుక్కు.
    అవున్నిజవే, ఇంత పర్ఫెక్టుగా వొండే మొగుళ్ళతో భార్యామణులకి కష్టవే .. కావాలంటే మా యావిణ్ణి అడగండి. :) కానీ మా యింటో దోసెల ఎక్స్పర్టు మాత్రం ఆవిడే.

    ReplyDelete
  6. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు "వాడు", మ్యారేజ్ కి వచ్చే సరికి మహానుభావుడు! కానీయండి, మహిళలదే రాజ్యం. చాలా ఆహ్లాదకరంగా, మీ ఆయన దోస అంత కమ్మగా ఉంది మీ కహానీ.

    ReplyDelete
  7. మీ దోశల్లాగే కరకర లాడుతూ కమ్మగా ఉంది మీ పోస్టు! మరీ "వాడు" ఏమిటండీ మరీనూ, అప్పుడు ఫ్రెండేగా అంటారా? సరే కానీండి!

    ReplyDelete
  8. కొత్త పాళీ గారు
    ఉండండి ఇప్పుడే అడుగుతా మీ ఆవిడని. కొన్ని దోస making tips కావాలి.
    రవి
    Thanks
    సుజాత గారు
    ఈ మధ్య వాడు అనడం మానేసా.

    ReplyDelete
  9. కిరణ్మయి ఉవాచ:
    "ఈ మధ్యవాడు అనడం మానేసా."
    అయ్యో అయ్యో. మీ రక్తంలో ఫెమినిస్టు హార్మోను లెవెల్సు బాఘా పడిపొయ్యాయి. ఒక రెండు వోల్గా కథలూ, ఒక నాలుగు కొండేపూడి నిర్మల పద్యాలూ చదవండి అర్జంటుగా!

    ReplyDelete
  10. కొత్త పాళీ గారు
    హి హి హి హి. చదువుతా. ఇప్పటి వరకు చదవలే. బాగుంటాయా కధలు.

    ReplyDelete