Monday, August 24, 2009

Nancy Drew నించి ఇల్లేరమ్మ కధల దాకా నా journey

చిన్నప్పుడు మాకు స్కూల్ నించి రాగానే టిఫిన్ తినే అలవాటుండేది. పొద్దున్నా, మధ్యాన్నం రెండు సార్లు అన్నం తింటామని అమ్మ మా మీద జాలి పడి ప్రతి సాయంత్రం టిఫిన్ చేసేది. బజ్జీలు, పకోడీలు, దోసెలు మా అమ్మకి టైం లేకపోతే ఉప్మా. ఈ ఉప్మా లో చాల రకాలు ఉండేవి బియాపు రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా.... సరే ఉప్మా సంగతి వేరే పోస్ట్ లో రాస్తా లెండి. చెప్పోచేదేంటంటే, మేము ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకోగానే, మా అమ్మ మా వైపు కోపంగా చూసేది. ఇక మేం చేసేది లేక చచ్చినట్టు టేబుల్ దగ్గర కూచుని తినేవాళ్ళం. అసలు సంగతేంటంటే మా ఇంట్లో అందరికి, (ఒక్క అమ్మ కి తప్ప) ఒక పిచ్చలవాటు (మా అమ్మ వాడే పదం) ఉంది. అదేంటంటే ఏదైనా తింటుంటే పుస్తకాలు చదవటం. మీరు చిన్న చాక్లెట్ ముక్క ఇవ్వండి, మేం పుస్తకాలు వెతుకుతాం తినే ముందర. మా నాన్న వాళ్ళింట్లో అందరికి ఈ రోగం (again, మా అమ్మ వాడే పదం) ఉంది. మేమెవ్వరమ్ పుస్తకాలు లేకుండా బ్రతక లేం. Period.

స్కూల్ లో ఉన్నప్పుడు tinkle, చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, పంచతంత్ర స్టోరీస్ (తెలుగు, ఇంగ్లీష్), టిన్-టిన్, Enid Blyton వ్రాసిన Famous Five, Five Find Outers and the Dog (ఇంకా చాల సిరీస్ ఉండేవి. పేర్లు గుర్తుకు రావట్లేదు) లాంటి పుస్తకాలన్నీ ఏక బిగిన దొరికినవి దొరికినట్టే చదివేదాన్ని. పుస్తకం మొదలు పెడితే ఫినిష్ చేసే వరకు ఆగేది లేదు. సమ్మర్ లో మా అమ్మ, నాన్న నేనేదో పాపం చాల మంచి పిల్లనని నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అన్ని కోనేసేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను maths, science పాఠాలన్ని చదివేసి ప్రిపేర్ అయ్యిపోతానని. మన దగ్గర అల్లాంటి పప్పులెం ఉడకవ్. సమ్మర్ హాలిడే లో చదువుకోడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఫ్రండ్స్ చూస్తే నవ్వుతారు కూడా. కాని మధ్యాన్నం ఎండ లో ఆడుకుంటే వడ దెబ్బ (అంటే ఎండ దెబ్బ, మనం తినే వడ కాదు) కొడుతుంది కదా? మనం లైబ్రరీ నించి తెచ్చుకున్న కామిక్స్ ముందురోజు రాత్రే చదివేస్తాం కదా? అందుకని, మధ్యాన్నం పూట చక్కగా, నెక్స్ట్ ఇయర్ తెలుగు, లేదా హిందీ లేదా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివేసుకోవాలన్న మాట. టెన్త్ క్లాసు అయ్యేవరకు ఇలా కాలక్షేపం చేశా.

ఇంటర్ కి వచ్చాక ఈ EAMCET గొడవలో పడి ఇంటికి ప్రతి నెల పేపర్ అబ్బాయి తీసుకొచ్చే చందమామ తప్ప పెద్ద పుస్తకాలేం చదవలే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు. అంత చిన్చేటట్టు చదివినా ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు, అది వేరే విషయం. ఇంటర్ అయ్యాక జూన్ లో మొదలు పెట్టా మళ్ళి పుస్తకాల పరంపర. ఇంక మనం ఆల్మోస్ట్ డిగ్రీ లోకోచ్చేసాం కదా. మనం చదివే పుస్తకాలు మనం డిసైడ్ చేసేసుకోవచ్చన్నమాట. అంటే ఇప్పుడింక నాన్న మనతో లైబ్రరీ కొచ్చి మనకి పుస్తకాలు సెలెక్ట్ చెయ్యరు. మనమే చేసుకోవాలి. మొదట్లో అయితే లైబ్రరీ కెళ్ళి బుక్స్ తెచ్చులోవటం, పెద్ద అడ్వెంచర్. అప్పుడు చదివానేను Nancy Drew ఇంక Hardy Boys ఏక బిగిన. మొత్తం లైబ్రరీ లో ఉన్న అన్ని టైటిల్స్ చదివేసా.

BSc లో ఉండగా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు Mills and Boon romances గురించి. ఇప్పుడు తలచు కుంటే నవ్వొస్తుంది ఆ పుస్తకాలు ఎంత exciting గా చదివేవాళ్ళం. అమ్మ కి తెలిస్తే తిడుతుందేమో అన్న భయం. అదే టైం లో నాన్న "Reader's Digest" తెప్పించేవారు. అది చదవటం అప్పుడు అలవాటు చేసుకున్నానంటే ఇప్పటికి మానలేదు. సరే తెలుగు నొవెల్స్ ని కూడా ఓ పట్టు పడదాం అని చెప్పి లైబ్రరీ కి వెళ్లి వెతికా. అందరు ఎండమూరి, ఎండమూరి అని ఒకటే తెగ చెప్పేస్తారు కదా, అసలు ఎవరా ఎండమూరి? ఏమా కధ అని చెప్పి వెన్నెల్లో ఆడపిల్ల చదివా. అంత ఇంటరెస్టింగ్ పుస్తకం నా ఫస్ట్ తెలుగు నోవెల్ అయ్యినందుకు నాకు ఇప్పటికి చాల సంతోషం గా ఉంది. ఆ నోవెల్ లో రమ్య ని రేవంత్ కి చూపించనందుకు ఇప్పటికి నాకు ఎండమూరి గారి మీద కోపమే.

తరవాత Scientific Fiction అలవాటయ్యిది. దాంతో పాటే Womens' Era, Femina లాంటి periodicals కూడా. ఇక్కడి కొచ్చాక లైబ్రరీ విషయం లో మాత్రం నాకైతే పండగే. ఒక బుక్ మనదగ్గర పది రోజులు పెట్టుకోవచ్చు. లైబ్రరీ లో ఒకే author వ్రాసిన పుస్తకాలన్నీ ఒక దగ్గరే ఉండడంతో అవన్నీ ఒక దాని తరవాత ఒకటి చదివి, ఆ రచయత స్టైల్ ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేదాన్ని. మంచి మంచి రచయితల పుస్తకాలు చదివి, ఆ రచయిత రైటింగ్ స్టైల్ ని analyze చేసి, ఆ analysis కి పుస్తక రూపం ఇవ్వాలని నా అభిలాష. "దానికి చాల టైం ఉందిలే. ముందు పుస్తకం సరిగ్గా చదవటం నేర్చుకో. ఒక లైన్ అర్ధం కాకపోతే పేజి తిప్పేస్తావ్" అంటారా? సరే. అలాగే కానీండి.

"That's the way the cookie crumbles", "house keeper of the professor" లాంటి సైన్స్ కి సంబంధించిన పుస్తకాలు ఇక్కదికోచ్చాకే చదివాను. Motivational reading మాత్రం నాకు అలవాటవ్వలె. క్రిందటి సంవత్సరం నా స్నేహితురాలు "ఇల్లేరమ్మ కథలు" పుస్తకం ఇచ్చింది. అది చదివి మా ఆయనకీ కూడా అనువాదం చేసి చెప్పాను. చిన్నపిల్లల పుస్తకాలతో మొదలైన నా పుస్తకాల పిచ్చి, ఇల్లేరమ్మ కధల దగ్గరకోచేసరికి ఒక phase complete అయ్యినట్టనిపిస్తోంది. ఇప్పుడింక చిన్న పిల్లల చేష్టలు మానీసి, కొంచెం intellectual పుస్తకాలు మొదలెట్టాలి. ఏమంటారు?

8 comments:

  1. Can you please break the content into Paragraphs and increase the font size?

    ReplyDelete
  2. జీడిపప్పు,
    Please let me know if it looks better now.

    ReplyDelete
  3. good show.
    Keep reading and keep sharing it here.

    ReplyDelete
  4. :):)
    మంచి మంచి బొక్కులు సదివేసేసేసేసి మాతోపన్చుకోన్డా!!!
    Word Verification తీసేయండా!!

    ReplyDelete
  5. ఇంటలెక్చువల్ పుస్తకాలు చదివేసి, పనిలో పనిగా వాటిని మాలాంటి వాళ్లకి కూడా అర్ధమయ్యేలా పరిచయం చేసేస్తే ఇంకా బాగుంటుంది.. బాగుందండి మీ బ్లాగు.. టపా శీర్షికలో 'ఇల్లేరమ్మ' నన్నిటు లాక్కొచ్చింది.. కొంచమే రాశారు తన గురించి..ప్చ్...

    ReplyDelete
  6. బాగుంది మీ బ్లాగు.బాగా రాస్తున్నారు.

    ReplyDelete
  7. కొత్త పాళీ గారు, Thanks
    భాస్కర్ రామరాజు గారండే, అట్టాగే నండే
    మురళి, ఇల్లేరమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకంటే ముందు చాల మంది ఇల్లేరమ్మ గురించి వ్రాసేసారని నేనిక రాయలేదు.
    శ్రీ, Thanks

    ReplyDelete
  8. కిరణ్మయి గారు, Looks good now!

    ReplyDelete