Wednesday, September 2, 2009

పెళ్ళికూతురు/పెళ్లి కొడుకు ఎలా ఉండాలంటే?........


పెళ్ళంటే? పెళ్ళంటే పందిళ్ళు, లల్లల్ల, లల్లల్ల, లల్లల్ల తలంబ్రాలూ.......... ఆగండి!!!! ఎవరక్కడ కృష్ణంరాజు, శ్రీదేవి లా సాంగేస్కునేది? ఈ మధ్య పిల్లలు మరీ పాడైపోతున్నారు. చదువు గిదువు మీద ధ్యాస లేదు కాని, కాబోయే ఆవిడ/ఆయన ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒకటే imaginationలు.
చిన్నప్పుడైతే గోరింటాకు పెట్టుకోగానే "మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడు.... ఇంకేదోలా పూస్తే ఇంకొకడెవడో వస్తాడు.." అని పాడెస్కునే వాళ్ళం ఎంచక్కా. సరే, ఆ రోజుల్లో అది చాల "happening" పాట కాబట్టి అలా పాడుకున్నాం. టెన్త్ క్లాసు లో కొచ్చాక శివ సినిమా రిలీజ్ అయ్యింది. ఇంక చూస్కోండి ఏ అమ్మాయిని చూసినా "సరసాలు చాలు శ్రీవారు తాననానా...." ఇదే గొడవ. అక్కడికి నాగార్జున వీళ్ళ కిచెన్ లోకే వచ్చేసి, పింక్ చీర కట్టుకున్న వీళ్ళ తోటే duet వేసుకున్న ఫీలింగ్. ఈ విషయంలో అబ్బాయిలు అమ్మాయిలకి అస్సలు తీసిపోరు. "భోలిసి సూరత్, ఆంఖోమే మస్తి ..." అని వీళ్ళు పాడేసుకోవడమే. అసలు నాకు తెలికడుగుతాను, మన గోరింటాకు మందారంలా పండితే, వాడెవడో మంచివాడేలా అవుతాడు, మన పిచ్చి గాని. పోనీ, ఏదో చిన్నతనం లో అలా అనుకున్నామా అంటే అదీ కాదు. పెద్దయ్యేకొద్దీ ఈ పిచ్చి ముదురుతుందే తప్ప (at least, నాకు తెలిసినంత మటుక్కు) తక్కువ కాదు.

చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన అమ్మాయి ఇంకొక ఫ్రెండ్ తో "నాకైతే పెళ్లి విషయం లో కొన్ని specifications ఉన్నాయి. నాకు కాబోయే భర్త EAMCET లో టాప్ 50 రాంక్ holders లో ఒకడై ఉండాలి, IIT లో MTech చేసుండాలి, MS మాత్రం CS అయితేనే అస్సలు proceed అయ్యేది, లేకపోతే లేదు". అప్పుడా ఫ్రెండ్ అంది ... "అన్ని qualifications ఉన్నవాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు?" అని. అవును మరి మన lady ఏమో హైదరాబాద్ లో ఏదో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో electrical engineering చదివింది.


నేనిందాక చెప్పా కదా అబ్బాయిలు ఎందుకు తీసిపోరని. నాలుగైదేళ్ళ క్రితం మా university లో చదువుతున్న ఒక తెలుగు అమ్మాయికి పెళ్ళయ్యింది. బాగా ఉన్నవాళ్ళమ్మాయి అవడంతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసారని ఆ అమ్మాయి రూం మేట్స్ ద్వార అందిన సమాచారం. అది పెద్ద విషయం ఎంచేతంటే, తను ఎప్పుడు అంత డబ్బున్న పిల్లలా behave చెయ్యలేదు. అందరితో పాటే కలిసి పొయ్యి చాల friendly గా ఉండేది. సడన్ గా సంబంధం కుదరటం తో అ అమ్మాయి ఇండియా వెళ్ళే ముందర ఎక్కువ మందికి చెప్పలేదు. అందుకని వచ్చాక ఫ్రెండ్స్ (అమ్మాయిల్ని మాత్రమే) Pizza party కి పిలిచింది. ఈ విషయాలన్నీ ఎలా అయితేనేం ఇండియన్ అబ్బాయిలందరికీ తెలిసాయి. నాకు తెలిసిన అబ్బాయి తో తరువాతి రోజు జరిగిన conversation:
నేను: అబ్బ, ఇవ్వాళ ల్యాబ్ కి వచెటప్పటికి లేట్ అయ్యింది.
తె అ: ఎందుకండి నిన్న పార్టీ కేమైనా వెళ్ళారా?
నేను: (మనసులో "ఓర్నీ, నీకెలా తెలిసింది?" అనుకుని, బైటికి మాత్రం) ఔనయ్యా. భలే కనిపెట్టావే.
తె అ: నేను కనిపేట్టతానికేముందండి, అందరు అనుకుంటున్నారు?
నేను: (అందరు అంటే?) ఏమని?
తె అ: సో అండ్ సో అమ్మాయి పెళ్ళయిందని, అమ్మాయి చాల డబ్బున్న వాళ్ళ అమ్మాయి అని, పెళ్లి చాలా గ్రాండ్ గా చేసారని, ఆ అబ్బాయి సో అండ్ సో university లో Ph.D చేస్తున్నాడని, ఈ అమ్మాయి MS అవ్వంగానే వెళ్ళిపోతుందని, ........
నేను: (ఆపుతావా నాయనా? ఓరి మీ అసాధ్యం కూలా. వారం రోజుల్లో ఇన్ని విషయాలు ఎక్కడ కనిపెట్టారు? ల్యాబ్ లో రీసెర్చ్ మానేసి ఈ పనులన్నీ చేస్తున్నారా ఏంటి?) హి హి హి హి అయితే ఇప్పుడు ఏంటి?
తె అ: మీ లాంటి సీనియర్స్ ఉండి నాలాంటి వాళ్లకి లాభామేవుందండి? ఆ అమ్మాయి గురించి నాకైనా చెప్పలేదు.
నేను: (ఇంక నాకు తిక్క వచ్చేసింది) చెప్తే ఏమి చేసేవాడివి?
తె అ: మీరు introduce చేస్తే, friendship చేసుకుని, మెల్లమెల్లగా పెళ్లి వరకు తీసుకేల్లెవాడిని (మరి లాస్ట్ సెమెస్టర్ లో వాళ్ళ స్టడీ గ్రూప్ చదువుకుందామని పిలిస్తే రానన్నావ్?)
నేను: సరే ఇప్పుడేమయింది. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఇప్పుడు వెతుకుదాం (అక్కడికి నేనేదో పెళ్ళిళ్ళ పేరమ్మ లాగ)
ఇంక మొదలయ్యింది లిస్టు. ఎంతకీ ఆపడే? ఆ అమ్మాయికి చాల డబ్బులుండాలి, ఆ అమ్మాయి సన్నగా ఉండాలి, కళ్ళజోడు ఉండకూడదు, పెద్ద జడ ఉండాలి............................................................................................, చివరిగా ఆ అమ్మాయికి MS డిగ్రీ ఉండాలి అని. ఈ లిస్టు చెప్పటం అయ్యేటప్పటికి నేను రెండు experiments కి సరిపడా calculations పూర్తి చేశా.
నేను: MS ఎందుకు? నువ్వు ఎలాగో Ph.D చేస్తున్నావుగా? ఆ అమ్మయి కూడా Ph. D అయితే బావుంటుంది (నాలో పెళ్ళిళ్ళ పేరమ్మ మేల్కొంది).
తె అ: వద్దండి Ph.D ఉన్న పిల్లయితే నా మాట వినదు.
నాకప్పుడనిపించింది, ఎక్కడో ఈ లోకంలో ఒక అమ్మాయి అనుకుంటూ ఉంటుంది "మా నాన్న అన్ని కట్నం డబ్బులు, అవీ ఇచ్చినతరవాత Ph. D. ఉన్నవాడినేందుకు చేసుకోవటం దండగ, ఎంచక్కా 10th క్లాసు పాస్ అయ్యిన వాడిని చేసుకుంటే బెటర్, మన మాటైనా వింటాడు" అని.
సరే. అమ్మాయిలూ, అబ్బాయిలు ఇలా అనుకుంటే reasonable గానే ఉండొచ్చు. వాళ్ళ పెళ్లి విషయం కాబట్టి. ఇంక తల్లి తండ్రుల కోరికలు వినాలి. మా అమ్మకి బోల్డంత మంది కజిన్లు. వాళ్ళల్లో కొంత మంది కి సంబధించిన విశేషాలు:

ఒక ఆవిడ: అక్కా, భాస్కర్ కి సంబంధాలేవైన చూస్తున్నారా?
ఇంకో ఆవిడ: చెప్పానే చాలా మందికి. ఇంకా ఎవ్వరు ఏమి సంబంధాలు తీసుకు రాలే.
ఎందుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈవిడ తోటి పిచ్చ తిట్లు తినటానికా? మొన్నటికి మొన్న ఒకాయనెవరో సంబంధం మాట చెప్తే, solid గా తిట్టింది. ఈవిడ కండిషన్ ఏంటంటే, పిల్ల తెల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లగా ఉండాలిట. ఆవిడ "తెల్ల" ని అంత స్ట్రెస్ చేసింది మరి. వాళ్ళ అబ్బాయి చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువుంటాడు.

మా అమ్మ ఒక సారి వాళ్ళ ఇంకొక కజిన్ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ కి transfer అయ్యి వచ్చారని నన్ను, మా పిన్నిని తీసుకెళ్ళింది వాళ్ళింటికి. ఆవిడ తలుపు తీసి మమ్మల్ని చూస్తూనే జరిగిన conversation:
అమ్మ: ఏమే బాగున్నావా? గుర్తుపట్టవా?
ఆవిడ: గుర్తుపట్టక పోవటం ఏమిటే? ఇదెవరు? మీ అమ్మాయా? పెళ్ళయ్యిందా? అది చెల్లెలు కదూ?
అమ్మ: కాలేదే. చదువుకుంటోంది.
ఆ: అవున్లే ఈ రోజుల్లో చదువుండాలి కదా దేనికైనా. మా అమ్మాయికి మంచి సంబంధం చూడవే.
(కాళ్ళు నేప్పెడుతున్నాయి బాబు, కొంచెం కుర్చీ చూపించి మంచినీళ్ళు ఇస్తారా?)
అమ్మ: నాకే ఆడపిల్ల (నేను) ఉంది కదా? ముందు దానికి చూసుకోవాలిగా?
ఆ: నీ పిల్ల కేమే? పొట్టి వాడైనా పరవాలేదు. మా అమ్మాయి 5 6' ఉంటుంది. పోడుగువాళ్ళు దొరకటంలా.
నాకసలే నా height మీద కామెంట్ చేస్తే ఒళ్ళు మంట. టక్కున నేను మా పిన్ని లేచాం. "general bazaar లో షాపింగ్ చేసోస్తాం" అని. నాకు పొగరు లేదు కాని నేను మాత్రం మళ్లి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఎందుకేల్తాను? నన్ను అంత అవమానించాక? కదా?


ఏ విషయం లోనైనా, మనకి కొన్ని standards ఉండడం చాల అవసరం. కాకపోతే, కామన్ సెన్స్ ఉండాలి పైగా కొన్ని విషయాలని ప్రైవేటు గా ఉంచుకోవటం ఎంతైనా అవసరం. లేక పోతే నవ్వుల పాలవ్వటం ఖాయం.

7 comments:

  1. fantastic.
    ఆమధ్యనెవరో (ఏడాది పైనే అయిందనుకుంటా) వివిధ మేట్రిమోనియల్ ప్రకటనల్లోంచి, అమ్మాయిల అబ్బాయిల కోర్కెల జాబితా రాసి బ్లాగులో ప్రకటించారు. గొప్ప రంజుగా ఉన్నాయి.

    ReplyDelete
  2. ఇందాక అడగడం మరిచాను .. ఇంతకీ మీ ఆయన హైటెంత? :)

    ReplyDelete
  3. కొత్త పాళీ గారు
    అమ్మాయిల్ని వయసు, అబ్బాయిల్ని salary అడగకూడదంటారు కదా? ఇలాంటి లిస్టు లో ఇంకొన్ని చేర్చుకోండి.
    grad student ని graduation date,
    research faculty ని number of publications per year,
    scientist ని number of experiments per day
    మరియు
    భార్య ని భర్త height
    అడగకూడదు

    ReplyDelete
  4. ha ha .. good retort. I too been grad student and researcher .. so, I know and can identify with those you mention.

    ReplyDelete
  5. మొన్నీమధ్యనే నా ఇంజనీరింగు పూర్తయ్యింది. నాకు ఆర్భాటంగా చేసే పెళ్లిలు, ఇంకా క్రొన్ని కార్యక్రమాలైతే మహా చిరాకు. అసలు సంగతేంటో దానిని వదలి, అందరి మన్నలను పొందాలని చేసే వాటికి నేను అస్సలు హాజరవ్వను. కాని, ఈ మధ్య మా ఇంటిలో పిలిచిన ప్రతీ ఫంక్షన్ కు నన్ను రమ్మని ఒకటే తొందర. అసలు విషయం ఏమిటంటే, నేను మా అమ్మా నానలతో అక్కడికి వెళ్తే, నేను ఎవరినో అందరికి తెలుస్తుందంటా( అబ్బా! ఛా! రాక పోతే, నా ఉనికి అస్సలు తెలవదా?!).

    మొన్న మా దాయాదుల వారు వారింట్లో ఒక విశేషము అని పిలిస్తే, ప్రక్క వీధి వారే కాబ్బటి వెళ్ళక తప్పలేదు. అంతా బాగానే వున్నది. కాని, ఈ ముసలోళ్ళు వున్నారే, వారి గోడు మొదలైంది. వారు మా అమ్మతో "ఇంకేమిటమ్మా! మీ వాడి చదువు పూర్తయ్యింది. ఉద్యోగం కూడా వచ్చేసింది. మరి పెళ్లెప్పుడు." నాకు మండిపోయింది. ఇంకా చెప్పడానికి చాలా వుంది. ఏదో ఆవేశంలో ఇవి చెప్పేశాను. ఇంకా చెప్తే మీ బ్లాగు కంపు కంపైపోతుంది. వుంటా మరి. మా అమ్మ చపాతీ మరియు నంజుకోవడానికి సాగు చేసింది. వెళ్లక తప్పటం లేదు.

    ReplyDelete
  6. కొత్త పాళీ గారు,
    Thanks.
    సాయి ప్రవీణ్,
    చపాతీ ఎంజాయ్ చెయ్యండి.

    ReplyDelete