Tuesday, September 29, 2009

పిల్లలు పిల్లల్లాగా ఉండాలి



నా చిన్నప్పుడు అమ్మ ఈ డైలాగ్ రోజుకి ఒక్కసారైనా అనడం వినేదాన్ని. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నపుడు మాలో ఎవరైనా, ఏదైనా పిచ్చి సినిమా మాటలు మాట్లాడితే మా అమ్మ కాని పక్కింటి ఆంటీలు ఎవరైనా కాని అలా అనేవారు. అలా అనంగానే మాకైతే చచ్చే సిగ్గోచ్చేసేది. కొన్ని రోజులు వరకు ఆ విషయం మర్చి పోయేవాళ్ళం కాదు. నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు, మేము ఒక కాంపౌండ్ లో ఉండేవాళ్ళం చాలా ఫామిలీస్ తో బాటు. సాయంత్రం ఇంటికొచ్చి హోం వర్క్ చేసుకుని ఆటలకి బయలుదేరేవాళ్ళం. అందరికి దాదాపు ఒకే టైం లో యూనిట్ టెస్ట్లు, ఎగ్జామ్స్ ఉండడం వల్ల అందరం ఒకే టైం లో చదువుకోవటం, ఆడుకోవటం చేసేవాళ్ళం. సమ్మర్ సెలవుల్లో అయితే ఎంత మజా నో చెప్పలేను. రిపోర్ట్ కార్డులు తెచ్చేసుకుని, రెండో, మూడో రోజులు పెద్దాళ్ళ తో తిట్లు తినేసి సమ్మర్ గొడవ మొదలు పెట్టామంటే మళ్లి జూన్ పదకొండో తారికునే అల్లరి ఆపడం. సాయంత్రాలేమో ఆడుకోవటం, మధ్యాన్నం పుస్తకాలు చదవటం, లేదా craft ప్రాజెక్ట్ పని పెట్టుకోవటం. కుట్లు, అల్లికలు, ఐస్ క్రీం స్టిక్స్ తో, అగ్గిపుల్లలతో, అగ్గిపెట్టేలతో, వెల్వెట్ పేపర్ తో craft తాయారు చేసుకోవటం. caroms, scrabble, chess, ludo లాంటి ఆటలు ఆడటం.

ఈ సుత్తంతా ఇప్పుడెందుకు కొడుతున్నానంటే, నేను క్రితం సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మా కజిన్ వాళ్ళబ్బాయిని "ఎంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు?" అనడిగితే "foundation కి వెళ్తున్నాను చిన్నమ్మా" అన్నాడు. నాకిక్కడ రెండు డౌట్లు. మొదటిది, ఫౌండేషన్ అనగా నేమి? రెండోది, తొమ్మిదో క్లాసు చదివే పిల్లాడు, ఇంత బుద్ధిగా ఎక్కడికి వెళ్తున్నాడు? అని. ఆ మాటే వాడిని అడిగా. ఫౌండేషన్ అంటే IIT foundation కోర్సు అట. ఇంక చూస్కోండి. నాకైతే cholesterol లెవెల్ పెరగకుండానే heart attack వచ్చింది. మొన్నెవరో జోక్ చేసారు. "ఒక ముగ్గు వేసే టైం లో నాలుగు EAMCET problems చేసుకోవచ్చు" అని.


కంపెటిషన్ పెరిగింది.కరక్టే. కాని తొమ్మిదో క్లాసు లో IIT కోసం రెడీ అయ్యేంత level లో నా? అసలు అంత చిన్న పిల్లలకి IIT importance ఏమి తెలుసని?ఇంకో మాట. ఇది నేను దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు జరిగింది. ఈ సారి నేను వెళ్ళినప్పుడు, ఆరో క్లాసు పిల్లాడు కూడా, IIT prep మొదలెట్టేస్తాడా?ఈ మధ్యన పిల్లలు computer గేమ్స్ తప్ప ఇంకో ఆట ఆడట్లేదు. వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు పోగొట్టుకోవట్లేదు కదా? చదువు మీద ఇంట్రెస్ట్ పోకుండా, వాళ్ళకి వాళ్ళ childhood ని ఎంజాయ్ చేసే విధంగా మనమేమి చెయ్యొచ్చు? స్కూల్ సిస్టం మార్చలేం కదా? కాబట్టి కుటుంబ వాతావరణం లోనే మార్పులు రావాలేమో?

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మా పెద్ద అక్క చదువుకునే రోజుల్లో 10th పాస్ అయ్యారంటే గొప్ప .తరువాత మా అక్క టైము లో 1st క్లాస్ వస్తే బ్రహ్మ రధం పట్టేవారు.నా టైములో ఫస్ట్ క్లాస్ అంటే పర్వాలేదు బాగా చదువుతుంది ఈ అమ్మాయి అనే వారు..ఇప్పుడు పెర్సెంటేజ్ ఎంత ?70% అంటే అంతేనా అని చీప్ గా చూస్తున్నారు. మార్పు తల్లిదండ్రుల లోనే వచ్చింది .మొన్న ఒక పాపను నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగితే టక్కున టీచర్ అంది .అంతే మిగిలిన వాళ్ళు అదేదో వినకూడని మాటలాగా మొహం పెట్టారు.వాళ్ళ అమ్మయితే ఎన్ని సార్లు చెప్పాలే డాక్టర్ అని చెప్పాలని నాలుగు అంటించింది కూడా :) నిజానికి వాళ్ళ అమ్మ పిల్ల అన్నదాని కంటే ప్రక్క వాళ్ళు ఏమనేసుకున్నారో అని భయపడింది.ఇప్పుడు అంతా పోటి ప్రపంచం.

    ReplyDelete
  3. :)మీరు వచ్చేటప్పటికి ఏంటండీ..6 వ తరగతి నుండే IIT ఫౌండేషను ఎప్పుడో మొదలయ్యింది. మా అప్పుడు పిల్లల సంఖ్యని బట్టి స్కూలులో మహా అయితే ఒకటో రెండో మూడో సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు పిల్లలని 6 వ తరగతిలో చేర్చాలని వెళితే..మీ పిల్లవాడిని ఏ సెక్షనులో వేస్తారు....IIT, olympiad, blooms, talent..అంటూ రకరకాల పేర్లతో బెదరగొట్టేస్తారు..తిప్పి తిప్పి అన్నిటిలో చెప్పేది ఒకటే..ఆల్ట్రామోడర్న్ పేర్లన్న మాట!
    @ నేస్తం :(

    ReplyDelete
  4. Parents kuuda okarini choosi okarau, kondariki ivvani manaspurthiga ishtam lekkuna pakkavallani choosi valla pillalu ekkada emi miss aipotaro ane bhayamto kuda pampistaru anukunta

    ReplyDelete
  5. పిల్లలు పిల్లల్లా వుండాలి అంటే మరి పెద్దోళ్ళు పెద్దోళ్ళు లా వుండాలి, తోడుకోడలు తొడ కోసుకుందని నే మెడ కోసుకుంట అన్నట్లు పరిగెడితే...?

    ReplyDelete