Thursday, September 17, 2009

మన కల్చర్ ని మనమే single handed గా కాపాడుతున్నామా?


నేను Ph.D చేస్తున్నప్పుడు నా roommate ఒక బెంగాలి అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రెండు సంవత్సరాలప్పుడే వాళ్ళు US కి వచ్చేసారు. సాధారణంగా.... (ధర్మవరపు సుభ్రమణ్యం డైలాగ్ గుర్తొచ్చిందా? ఇప్పుడా కామెడీ వోద్దులెండి) ఇక్కడ పెరిగిన, ఇండియన్ origin ఉన్న పిల్లలకి మన కల్చర్ తెలీదని పెద్ద భ్రమ. నా రూంమేట్ (ఆ అమ్మాయి పేరు కొంచెం సేపు పంకజ అనుకుందాం) వాళ్ళ నాన్నగారు కూడా అలాంటి భ్రమ ఉన్న మనుషుల కోవ లోకే చెందుతారు. పంకజ కి దాదాపు 19 లేదా 20 ఏళ్ళు ఉంటాయేమో. ప్రతి వీకెండ్ 3 గంటలు బస్సు జర్నీ చేసి ఇంటికి వెళ్ళేది. వచేటప్పుడు ఆల్మోస్ట్ వారానికి సరిపడా వండిన కూరలు, పప్పులు అవన్నీ తెచ్చుకునేది. కొత్తలో, బెంగ పెట్టుకుందేమో అనుకునేదాన్ని (బెంగాలి కదా? హి హి హి హి జోకన్నమాట). తరవాత, తరవాత భోజనం తేవటం తగ్గించింది. అయినా ప్రతి వీకెండ్ వెళ్ళేది.

ఒక రోజు అడిగాను. ఇక్కడ dorms లో ఉన్న పిల్లలు అలా ప్రతి వీకెండ్ ఇంటికి వెళ్లారు కదా, నువ్వు మీ పేరెంట్స్ కి చాల క్లోజా? అని. తను నవ్వి, "మా నాన్న ప్రతి వీకెండ్ నాకు బయాలజీ, ఫిజిక్స్ లాంటి సైన్సు సబ్జక్ట్స్ అన్ని కూర్చోపెట్టి చెప్తారు, అందుకే రమ్మంటారు. అలా అయన involve అయ్యి చెప్పకపోతే, నేను నా చదువుని neglect చేస్తానని భయం". "Parents teaching their children is a natural thing for Indians. I think it is an Indian thing" అంది. నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది ఆ తరవాత నవ్వొచ్చింది. చిన్నప్పుడు అమ్మ మనల్ని కూర్చోపెట్టి చదివించిన మాట నిజమే. కాని ఇరవై ఏళ్ళు వచ్చాక కూడానా? పేరెంట్స్ కి పిల్లల చదువు మీద anxiousness ఉంటుంది. అది చాలా సహజం. అయినా, కాలేజీ కి వచ్చిన తరువాత పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి అని వీక్ టు వీక్ basis మీద పేరెంట్స్ నిర్ణయించటం ఎంత వరకు సబబు? మనకి ఒక originality డెవలప్ అయ్యేది ఆ ఏజ్ లోనే కదా? పంకజ వాళ్ళ నాన్నగారు ఇంకొక పని కూడా చేసేవారు. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పంకజ వాళ్ళ తమ్ముడిని తప్పకుండా తీసుకెళ్ళే వారు (ఏదో ఒక ఫ్రెండ్ ఇంటిలో డిష్ antenna ఉంటుంది కదా తప్పకుండా). స్కూల్ వర్క్, hobbies neglect చేసినా సరే. ఎందుకయ్యా అంటే, క్రికెట్ మన కల్చర్ లో ఒక భాగం, మన పిల్లలకి అది తెలియాలి అంటారు.

ఇక్కడ చాల మంది పిల్లల్ని వీకెండ్స్ లో తెలుగు, తమిళం (లేదా వేరే ఏదైనా మాతృభాష), శాస్త్రీయ సంగీతం, డాన్స్ క్లాస్సులకి పంపిస్తారు. వాళ్ళ హాబీ ని వాళ్ళనే ఎంచుకోమంటే బెటర్ ఏమో? hobbies కూడా మనం డిసైడ్ చెయ్యడమెందుకు?నేను ఈ విషయం పిల్లలు మరియు teenagers తోనే మాట్లాడాను (ఇలా అన్నానని నేనేదో పెద్ద సైకాలజీ expert ని అనుకునేరు. నాకంత లేదు). పేరెంట్స్ తో మాట్లాడలేదు. కాబట్టి నాకు వాళ్ళ perspective తెలీదు.
మా university లో ప్రతి university కి మల్లె ఒక ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉండేది. దాని elections అప్పుడు వినాలి ఒక్కొక్కడి కల్చర్ గోల. ఒక కల్చరేసుడు రెండో సారి కాంటెస్ట్ చేస్తున్నాడు (మొదటి సారి గెలిచాడు లెండి). అతగాడి స్పీచ్ ఇలా నడుస్తోంది "why do you think I contested last year? I think it is very important to preserve our culture. Some one has to do it you know. My wife was here that time. I did not even consult her when you all nominated me. This year, I want to be an officer for the same reason. We have to make sure this organization has capable officers who can preserve our culture". నాలుగు దేశి మ్యూజిక్ డాన్స్ పార్టీలు పెడితే కల్చర్ ని కాపాడినట్టేనా?

ఇలాంటి వాళ్ళు కొంతవరకు బెటర్. వాళ్ళింటికి వెళ్తే సుబ్భరంగా క్రికెట్ మ్యాచ్ లు, తెలుగు, హిందీ సినిమాలు చూపించి, మంచి ఫుడ్ పెడతారు (రుచి గా ఉందా, లేదా అన్నది వేరే విషయం). ఇంకొక టైపు కల్చరేస్వరులు ఉంటారు. నా ఫ్రెండ్ ఒకమ్మాయి తను కాలేజీ లో చదువుకున్నప్పటి విషయం ఇలా చెప్పింది:
నేను post graduation లో ఉండగా అనుకుంటా freshers party లో ఒక సీనియర్ ప్రబుద్ధుడు స్పీచ్ ఇస్తున్నాడు. ఇలా సాగుతోంది ".........మన సంస్కృతి ని మనం నిలబెట్టుకోవాలె. నిన్న మన కాలేజీ ల చూసిన ఒక అమ్మాయిని. జీన్స్ ప్యాంటు ఏస్కోని, బొట్టు పెట్టుకోకుండా కాలేజికి వచ్చింది. అట్లనేన కాలేజీ కి వచ్చుడు? గసొంటి బట్టలేస్కోనోస్తర? మన సంస్కృతి ఏమైపోవలె?....." మర్నాడు మేము బస్సు దిగి కాలేజీ కి వెళ్తుంటే గేటు దగ్గర ఒక పెద్ద గ్రూప్ వచ్చే పొయ్యే అమ్మాయిల మీద కామెంట్లు. ఆ గ్యాంగ్ లో ఈ అబ్బాయి కూడా ఉన్నాడు. గేటు దగ్గర నిలపడి అమ్మాయిలకి సైట్ కొట్టటం కూడా ఈ మధ్య కల్చర్ లో భాగం అయిపొయింది. అవును మరి, ప్రతి సినిమా లో బేవార్సు గా రోడ్డు మీద కూచుని లైన్లు వేసే వాళ్ళనే హీరోయిన్లు ప్రేమించేసి, duet పాడేసి, పెళ్లి చేసేసుకుంటారు.

నా ఒపీనియన్ లో culture అనేది చాలా broad concept. Everyone defines it in their own way. ఇలా చేస్తే కల్చర్ ని కాపాడొచ్చు, ఇలా అయితే లేదు అన్న రూల్ ఏమి లేదు. కాకపోతే ఇతరులకి (ముఖ్యంగా తమ పిల్లలికి) ఇబ్బంది లేకుండా, వాళ్ళ మనసులకి కష్టం కలగకుండా చూసుకుంటే మంచిది. నా మటుక్కి నేను సంస్కృతిని కాపాడడానికి ఎం చేసానా అని ప్రశ్నించుకుంటే, నాకేమి జవాబు దొరకట్లేదు. ఇక పైనే ఆలోచించాలి ఏమి చెయ్యొచ్చో. ప్రియమైన చదువరులారా, మీరేమంటారు? కల్చర్ గూర్చియు, మరియు దానిని కాపాడుటకై మనము చేయవలిసిన కృషిని గూర్చియు దయచేసి మీ మీ అభిప్రాయములు చెప్పుడు. (ఎలా ఉంది మన గ్రాంధికం?)

23 comments:

  1. తమ చుట్తో ఉన్న సంసృతి తమకు నచ్చింది కాక పొతే తల్లిదండ్రులూ ఎక్కువ భయ పడటం సహజమే కదా.
    ఆ భయం ఇండియా లో మంచి కాలనీ లో పిల్లలు పెరుగుతున్నప్పుడు ఉండదు. అందుకే ఇక్కడ అంత రూల్స్ పెట్టరు.
    అడవిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉందాం కదా.. .

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Culture అన్నది మీరన్నట్లు స్వేఛ్ఛాయుతంగా నేర్చుకునేదంటే నేనేకీభవించను. అది బలవంతంగా నేర్పేది కాకపోయినా మన చుటూ ఉన్న పరిస్థితుల మూలంగా అలవడుతుంది.

    సంస్కృతి - ఆవశ్యకత ఇక్కడ చదవండి
    http://vikaasam.blogspot.com/2009/08/blog-post_02.html

    ReplyDelete
  4. నాకు ఎప్పుడు డౌట్ కిరణ్మయి ఈ కల్చరాగ్రేస్వరుల బాధ ఏమిటో అని.. అక్కడికి కల్చర్ అంతా వీళ్ళే మోస్తున్నట్లు,
    అసలు కల్చరంటే బట్టలా.... ఐతే ఇప్పుడు మనం (అంటే సరిగ్గా మనమంటే మనమే కాదు మన అమ్మ నాన్న అత్త మామ గట్రా గట్రా) వేసుకున్న, వేసుకుంటున్న బట్టలు మన కల్చర్ లో మొదట నుంచి వున్నవేనా?
    పండగలు... ఐతే మనం చేసుకునే పండగలు ఎక్కువ భాగం హిందువులవే, కల్చర్ దేశానికి సంభందించినది కదా ( కాదా... ఐతే ఎవరి మతాలు చేసుకునే పండగలు అన్ని కలిపి మన కల్చర్ అంటారా బుర్ర గోక్కుంటున్న నేను)
    మాటలా .... ఎక్కడ మాటలు ఎవరి మాటలు.. (మళ్ళీ బుర్ర గోక్కుంటూ)
    ఆలోచనలా... పైన బట్టలకు ( చస్ బట్టలు అనకూడదేమో వస్త్రాలు అనాలేమో కల్చర్ ప్రకారం) వేసిన ప్రశ్నే ఇక్కడ కూడా...

    ఎవరక్కడ ఇటు గా వచ్చి కల్చర్ కు డెఫినిషన్ ఇచ్చి పొండి (కొంచం అక్కడా ఇకాడ ఇంగ్లీస్ రాసేను కల్చర్ కాదేమో.... )
    కాలానుగుణం గా మారేది కల్చరా...

    ReplyDelete
  5. మొదటి వ్యాఖ్యాత చెప్పినట్లు చెయ్యండి (Just install Add-Telugu widget button on your blog) కల్చర్ కాపాడబడుతుంది :-)

    మీ టపాలో చాలా గందరగోళం ఉంది. ఎక్కడ్నుండి ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు.

    అన్నిట్లో కాకపోయినా, కొన్నిట్లో తల్లిదండ్రుల మార్గదర్శకత్వం - అప్పుడప్పుడూ మూర్ఖంగా అనిపించినా - ఉండాల్సిందే. పట్టువిడుపులూ ఉండాల్సిందే. ఇది కల్చర్ ఒక్కదానికే కాదు, జీవితంలో చాలా విషయాలకి వర్తించే విషయం. 'నా జీవితం, నా ఇష్టం' అనాల్సింది ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడ్డాక.

    ReplyDelete
  6. హతోస్మి!
    నేనూ ఒకప్పుడి ఇలాంటి కల్చరాసురుణ్ణే. బహుశా ఇప్పటికీ కొద్దిగా ఆ ఛాయలున్నాయేమో!

    ReplyDelete
  7. Vinay, Chemsitry
    మైత్రేయి, బృహ:స్పతి, భావన, అబ్రకదబ్ర కొత్త పాళీ
    recent గా నేను కొంత మంది పిల్లలతో మాట్లాడాను. వాళ్ళందరి తల్లిదండ్రులు రెండు, మూడు decades క్రితం ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆ పిల్లలు మాటల్లో అన్నారు "My parents say that I am good for nothing but eating, sleeping and sh*****g and some other friend's daughter is better than me because she sings Indian classical music". అప్పటినుంచి నేను పిల్లలపెంపకం (ఇక్కడ US లో) గురించి ఆలోచించాను. ఇండియన్ కల్చర్ ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో ever green topic కాబట్టి దాని గురించి నా అభిప్రాయం వ్రాసాను. I am very interested in knowing what parents have to say about this.

    ReplyDelete
  8. నా వరకూ కల్చరు అంటే -

    మా పాపాయి, వాళ్ళ తాతయ్యతోనో, అమ్మమ్మ తోనో చక్కగా కన్ ఫ్యూజను లేకుండా మాట్లాడుకోవడం. ఒకరి మాటలు ఇంకొకరికి అర్థం కావడం. కొంచెం చాదస్తపు నిర్వచనం లా ఉన్నా, దీన్నుంచీ చాలా మానసిక శాంతి దొరుకుతుంది.

    ReplyDelete
  9. కిరణ్మయి నిజమే ఇది ఎప్పుడు చాలా హాట్ టాపిక్. ఈ విషయం లో నేను రవి గారికి వోటు వేస్తున్నా... భాష...... మనది అనుకున్న మనం నమ్మే విలువలను కొంత వరకైనా మన తరువాతి తరానికి అందించే ఒక మంచి సాధనం... ఇక్కడ పిల్లలను పెంచటం ఒక యజ్ఞమే...పాపం వాళ్ళ మీద చాలా స్ట్రెస్స్ వుంటుంది, మన మేమో ఇంట్లో ఒక లా వుంటాము వాళ్ళకేమో బయట అంతా వేరే గా వుంటుంది రెండిటికి మధ్య సమన్వయం సాధించటానికి వాళ్ళ వయసెంత వాళ్ళెంత, ఐనా పాపం ఇక్కడ పిల్లలు చాలా వరకు ప్లెయిన్ గా వుంటారు, ఏమనుకుంటారో అది చెపుతారు. చిన్నప్పటి నుంచి కొంచం నచ్చ చెప్పుకోవటం, మంచి చెడు వితరణ సరిగా వారికి అర్ధం అయ్యేట్లు చెపితే పాపం చాలా వరకు ఇక్కడ పిల్లలు మంచి గా వుంటారు. మా వంటి పేరెంట్స్ కేమో మేమే మొదటి తరం వాళ్ళం ఇంకా అక్కడ ఇక్కడ మధ్య తేడాలను సర్దుకుంటూ వుంటాము, మాకేమి కావాలో మాకే తెలియదు మా స్ట్రెస్స్ మాకు వుంటుంది, వుద్యోగం,పని పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళటం వీటన్నిటి మధ్య బొంగరం లా తిరుగుతుంటాము దానికి తగ్గట్లు పిల్లలు చదవక పోయినా మాట వినక పోయిన వెధవ మనసు తెగ బాధ పడుతుంది. ఒక పేరెంట్ గా అది నేను గమనించింది. ఆడ పిల్లలు కొంచం టీనేజ్ లో ఎక్కువ రెట మతం గా వుంటారు చాలా సహనం గా వ్యవహరించాలి, అలా కాకుండా ఇంకా, ఇలా వాళ్ళ అమ్మాయి అది చేసింది, ఇది చెయ్యలేదు నువ్వు అని పోటి పెడితే మరీ రెట మతం గా తయారు అవుతారు, కాని మా పరిస్తితి కూడా ఆలోచించండి, రెండు సూట్ కేసు లు బోలెడన్ని జ్ఞాపకాలను వెంట పెట్టుకుని వస్తాము, మేము సెట్టిల్ అయ్యి పిల్లలకు అందరికంటె మంచి చదువు మంచి జీవితం ఇవ్వాలని ప్రతి క్షణం తాపత్రయం పడుతు వుంటాము (ఎవరు పడమన్నారు అని వాళ్ళు అడుగుతారనుకోండి) అది ఎంత కష్టమో పిల్లలకు తెలియదు, మనం చెప్పం, అది మళ్ళీ ఇష్టం వుండదు మనకు, అన్నిటిలో (చదువు లో) పై చేయి గా వుండక పోతే మనుగడ లేదు అనే సమాజం నుంచి, కాలం నుంచి వచ్చాము మేము (నిజానికి అదే నిజం ఇక్కడ కూడా). ఇంత ఎందుకు అండీ మనలను మన తల్లి తండ్రులు పెంచేప్పుడూ వుపయోగించిన పద్దతులు దాదాపు గాఇక్కడ ఏమి పనికి రావు. నేను అనుకోవటం ఎక్కడైనా ఇదే సంగతి అనుకుంటా ఈ కాలానికి. ప్రేమ తోనే జయించగలం, వాళ్ళు దానిని అలుసు గా తీసుకోకుండా జాగ్రత్త పడుతు... అబ్బో రాకెట్ సైన్స్ లా వుందా వుంటుంది మరి పిల్లలా మజాకా నా అదేదో సినిమా లో పవన్ కల్యాణ్ అన్నట్లు పిల్లలు, ప్రేమ, చికాకులు ఒక పేకేజ్ లా వస్తాయి మరి.. ఇదే ఒక పోస్ట్ లా ఐపోయిందా...

    ReplyDelete
  10. @ Kiranmayi .. I'd like to know your opinion about this story.
    Indian Values
    You could write here, or as a comment in my blog. Thanks in advance.

    ReplyDelete
  11. మాస్టారు, పెద్ద assignment ఇచ్చారుకద. I will read through it and get back.

    ReplyDelete
  12. కొత్త పాళీ గారు
    It was a good story. Everyone has their own way of defining Indian values. For Krishna Kumar, it was virginity. I am not surprised. A lot of guys are like that. Note that I am saying guys, I don't care where they grew up.
    (Dear readers, I will not get into the discussion of "Don't girls have their own faults? Yes they do but that is not the point of discussion here. We can make it a separate post if you all would like.)
    Children who grew up here have a chance to understand the best of both worlds. The world that they grow up in and the other, that their parents grew up in, India. I guess finally it comes back to raising children with "Values" not "Indian values". Because if Krishna Kumar had a sense of values, he clearly would not have the double standards and he would not make uninformed conclusions about Neeraja.

    Did I pass your test?:-)

    ReplyDelete
  13. Thank you so much for taking the time to read and writing such a detailed comment.
    Absolutely no test, I assure you. Since we were talking about preserving culture in your post, I thought the topic of the story is relevant - and wanted to hear your take on it.
    Thanks again.

    భావన గారు, ఆ మందహాసపు మర్మమేమి? కాస్త విప్పి చెబితే ముత్యాలు రాలవు గదా? కథ గురించి (మీరు చదివుంటే) మీరు కూడా కామెంటితే, నాకు ఒకటికి రెండు దొరికినట్టే సంబర పడతాను.

    ReplyDelete
  14. ఎంత మోసం చేసారు కొత్త పాళీ గారు
    మీరే మీరని నాకు ఇప్పుడే తెలిసింది. అక్కడికి మా ఆయన చెపుతూనే ఉంటారు "pay attention to detail" అని. మనం వింటే కదా. సుబ్భరంగా మీకు రిప్లై వ్రాసినతరవాత ఇంటికొస్తుంటే అనిపించిది రచయిత గురించి కొంచెం detail గా చూడాల్సింది అని. ఈమాట లో మీ స్టోరీస్ నేను చదువుతాను. Nice to meet you.
    భావన అందుకే నవ్వారేమో? అవునా భావన?

    ReplyDelete
  15. నేను ఎందుకు నవ్వేనంటే కిరణ్మయి చెప్పేసేరు కదా. చాలా బాగా అనలైజ్ చేసి, "మీరు బాగా రాసేరండీ" అనలేదు అంటే ఈమె కథ లో నిమగ్న మైపోయి ఈయనే రాసేరు అని అర్ధం కాలేదు అనుకుంటా అనే చిన్ని చిరునవ్వు, ప్లస్ బాగా వివరించినందుకు మెచ్చుకోలు చిరునవ్వు కూడా...
    ఇంక నా అభిప్రాయమంటారా.. చాలా బాగా రాసేరు అండీ, ఈ కథ నేను ఎప్పుడో చదివేను. "ఈ మాట " కాకుండా ఇంకా వేరే ఏదైనా మేగ్ జైన్ లో వచ్చిందా? ఇక్కడ పెరిగిన మన అమ్మాయిలకు ఈ సోకాల్డ్ ఇండియన్ వేల్యూస్ గురించి బాగానే అర్ధం అవుతుంది, చిన్నప్పటి నుంచి మన పెంపకాలలో ని హిపోక్రసి చూస్తూనే వుంటారు కదా.. ( is my comment in contrary with Kiranmayi's comment?) పాపం ఆ వాసంతి కి అది పెద్ద గా తెలియదు ఏమో. క్రిష్ణ (అబ్బ గుండె పట్టేస్తోందండి ఆ చెడ్డ అబ్బయికి క్రిష్ణ అని పేరు పెట్టేరు) ఆ క్రిష్ణ కుమార్ కు (అమ్మయ్య ఇప్పుడు కొంచం ఈజీ గా వుంది తిట్టటానికి) అంత కంటే గొప్ప అభిప్రాయం వున్నట్లు చూపిస్తే నేను అనుకునే దాన్ని నాసీ ఏమిటీ ఇలా అబద్దాలు రాసేస్తున్నారు కథల లో అని. ఈ కథ ఎంతో బాగా ఎత్తి చూపింది మన పిల్లల పెంపకాలలో మనం చేసే తప్పులు ఇంకా వాళ్ళ ఆలోచనా ధోరణులు.. I clearly can see Vasanthi, Neeraja and Krishna kumar's portraits in front of me, So the purpose of the story served I guess isn't it.... Kudos to you Sir

    ReplyDelete
  16. భారతీయ సంస్కృతా!!!! అదేమిటి? అలాంటి బ్రహ్మపదార్థం ఒకటుందా?

    ReplyDelete
  17. కొత్త పాళి గారు , పైన కామెంట్ లో " So the purpose of the story served I guess isn't it.... " అన్నది నాకు కనిపించా యి ఆ పాత్రలు అని కాదు, రచయత రాసిన కధ నుంచి పాత్రలు ఒక సగటు పాఠకుడి కళ్ళముందు సజీవమై అవిష్కరింప చేయటం ఆ రచన సాధించగల గొప్ప గుణాలలో ఒకటి అంటారు కదండి అది మీరు నా వంటి సగటు పాఠకురాలికి తెప్పించగలిగేరు అని నావుద్దేశ్శం అన్నమాట..

    ReplyDelete
  18. అదే మహేష్ భారతీయ సంస్కృతి అంటే పద్దతి గా బట్టలు వేసుకుని, పద్దతి గా అమ్మ నాన్న చెప్పినట్లు విని... పెద్ద వాళ్ళకు, సమాజానికి వీలైతే దేశానికి మంచి పేరు తీసుకుని రావటం..

    ReplyDelete
  19. @భావన: అదే భారతీయ సంస్కృతైతే, ఆ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉందని తెలియజెయ్యడానికి ఆనందిస్తున్నాను.

    ReplyDelete
  20. అల్పుడెపుడు బ్లాగు ఆవేశములతోడ
    సజ్జనుండు బ్లాగు చెలిమితోడ
    కత్తి చీల్చునెట్లు, పూమాలలెరుగునా
    విశ్వదాభిరామ వినుర వేమ


    కిరణ్మయిగారూ, మీ చర్చకు ఇంతమందిమి స్పందించామంటే అందరినీ ఆలోచింపజేసిందనే...:)

    ReplyDelete
  21. Great post.

    Sorry for not writing my comment in telugu. I need to learn how to post comments in telugu.

    Here is my view on this topic:
    Culture gives values and if you leave those values, there is no culture exists. So, 'values' and 'indian values' are slightly different. If it matters, every culture has its own values but many of them are common.

    I prefer my self to keep indian values but i don't care much about indian culture.

    ReplyDelete