Monday, September 7, 2009

పరిశుభ్రత కు నోచుకోని Public Restrooms


నేను పెట్టిన title ని చూసి నేను మాట్లాడేది మన దేశం లో లేదా US లో ఉన్న బాత్రూం ల గురుంచి మాత్రమె అనుకోకండి. నేను వేరే ఎ దేశాలకి వెళ్ళలేదు కాబట్టి నా అనుభవాలు మాత్రమే వ్రాస్తున్నాను. ఇంకొక విషయం. చిన్నప్పటి నుంచి ఈ విషయం ఎవరితోటైనా మాట్లాడితే, "అబ్బ ఇప్పుడీ విషయం అంత అవసరమా?" అని తీసి పారేశారు. అందుకనే blog ముఖంగా వ్రాస్తున్నాను.

నేను స్కూల్ లో చదివింది 1980s లో. అప్పట్లో హైదరాబాద్ లో నీళ్ళ సమస్య చాలా ఘోరంగా ఉండేది. ఎంత ఘోరం అంటే రోజు ఇంటి దగ్గరికి నీళ్ళ tanker (ఆ రోజుల్లో అలానే అనే వాళ్ళం, ఇప్పుడేం అంటున్నారో తెలీదు నాకు) వస్తే పిల్లలు, పెద్ద వాళ్ళు అన్న తేడా లేకుండా బకెట్ లతో నీళ్ళు మోసి, రోజుకి సరిపడా నీళ్ళు నింపుకునే వాళ్ళం. వాటర్ tanker విషయానికి వస్తే ఇల్లుకల వాళ్ళు, అద్దె కి ఉండే వాళ్ళు అన్న తేడా ఉండేది కాదు. It was a world of tough competition. మాది "water works" generation. sodium metal తో వాటర్ react అవుతే ఏమవుతుందో చెప్పలేమేమో గాని, water tanker ఎ రోజు ఎన్ని గంటలకి వస్తుందో, ఎ బకెట్ ఎ చేత్తో పట్టుకుంటే ఎన్ని trips లో సిమెంట్ గోలెం నింపోచ్చో, ఎ అంటీ ఎన్ని గంటలకి తన బకెట్ బయట పెట్టారో, దాన్ని బట్టి మనకి ఆ రోజు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పగలం మేం. సో, మేము మా జీవితం లో ఇన్ని విషయాలు experience చెయ్యడం వల్ల నీళ్ళు చాల పొదుపుగా వాడతాం. అయితే మాకేంటి? అని మీరనడానికి లేదు. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పానంటే, మేము స్కూల్ లో చదువుతున్నప్పుడు ఒక్క బాత్రూం లో కూడా నీళ్ళు వచ్చేవి కాదు. పర్యవసానం ఎంటయ్యా అంటే, మాహా dirty గా ఉండే బత్రూమ్స్. sixth class లో ఉండగా అనుకుంటా ఒక సారి నేను స్కూల్ లో బాత్రూం లోకి చూసినట్టు జ్ఞాపకం. ఆ రోజు నేను కడుపులో తిప్పి పడిపోయ్యాను. ట్యూషన్ క్లాసు కి వెళ్లినప్పుడు ఒక ఫ్రెండ్ తో చెప్పా ఈ విషయం. తను అంది "నా స్కూల్ లో అలానే ఉంది. మా తమ్ముడి స్కూల్ లో కూడా" అని.
అందరు అంటారు ముందర సమస్య ఏంటో కనుక్కోండి, అప్పుడు సమాధానం ఆలోచించచ్చు అని. చిన్న పిల్లల మైన మాకే అనిపిస్తే, స్కూల్ లో టీచర్స్ కి, ప్రిన్సిపాల్ కి, స్కూల్ కి వచ్చే పేరెంట్స్ కి ఎవ్వరికి ఈ సంగతి పట్టలేదా? ఇంటిలో అన్ని రూమ్స్ ని క్లీన్ గా ఉంచుకున్నట్టే, స్కూల్ లో బత్రూమ్స్ ని కూడా క్లీన్ గా ఉంచాలి అని ఎవ్వరు మాతోటి ఎందుకు అనలేదు. ఎప్పుడో జరిగిన సంగతెందుకు, ఇప్పుడేం చెయ్యాలి అంటారా? నన్నడిగితే, periodical గా నోట్ బుక్ చెకింగ్, classroom inspections చేసినట్టు బాత్రూం inspections కూడా చెయ్యొచ్చేమో?

ఒక సారి ఏదో ఊరు వెళ్ళినప్పుడు, బస్సు స్టాండ్ లో దిగి, బాత్రూం కి వెళ్ళాము. అక్కడ వరసగా నాలుగైదు బత్రూమ్స్ ఉన్నాయి. లైన్ మాత్రం ఒక్కదానికే, చాంతాడంత. బాత్రూం తలుపు దగ్గర ఒకామె నించుని లోపలకి వెళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటోంది. నేనేమో పెద్ద ఫీల్ అయిపొయ్యి, "చల్ , నేను డబ్బులెందుకు ఇవ్వాలి, పక్కనున్న బాత్రూం లోకి వెళ్తా" అనుకున్నా. "jawaani ka josh" కదా, అదన్నమాట. లోపలకి వెళ్లి, నానో సెకండ్ లో బయటకి వచ్చా. మళ్ళి కడుపులో తిప్పుడు. ఆ డబ్బులు తీసుకునే ఆమె నన్ను చూసి నవ్విన నవ్వు, నేనింకా మర్చిపోలేను.

లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఒక బస్సు ప్రయాణం చేసాం. నాది లాస్ట్ విండో సీట్. ఓవర్ నైట్ జర్నీ. రాత్రి మూడు గంట్లకో ఎప్పుడో బస్సు ఆగితే నిద్ర లేచి కిటికీ తీసా గాలి కోసమని. బయటకి చూస్తే ఏముంది? ఒకాయన టైరు దగ్గరే పని కానిచ్చుకుంటున్నాడు. చిరాకొచ్చేసింది. చూస్తే చడువుకున్నవాడిలా ఉన్నాడు. ఇప్పుడనిపిస్తోంది. నాలుగు చీవాట్లు పెడితే బాగుండేది. మళ్ళి అలా చెయ్యడు అని. అసలు అందరం ఇలా మనకెందుకు గొడవ అనుకోపట్టే కదా ఇలా ఉంది పరిస్థితి? మా అమ్మమ్మ ప్రయాణానికి ముందర ఎప్పుడు అంటారు "ఊరికి బయలుదేరే ముందర, బాత్రూం కి వెళ్లి బయలుదేరండి, దారిలో మంచి నీళ్ళు ఎక్కువ తాగకండి, దారిలో బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు" అని. మరి ఎండా కాలం లో నీళ్ళు తాగకుండా ఎలా ప్రయాణం చెయ్యడం. అందరు AC ఉన్న బస్సు లో వెళ్ళడం అఫ్ఫోర్డ్ చెయ్యలేరు కదా?

ఒక సారి బోస్టన్ వెళ్ళేటప్పుడు దారిలో రెస్ట్ ఏరియా లో ఆగాం. అక్కడ బాత్రూం అయితే ఛండాలం. flush పని చెయ్యట్లేదు. బాత్రూం తలుపు తియ్యగానే, రూం అంత పేపర్లు పడేసి ఉన్నాయి. ట్రాష్ క్లీన్ చెయ్యలేదు. ఓవర్ ఫ్లో అయ్యి పోతోంది.

ఇది పరిష్కారం లేని సమస్య అని నేననడం లేదు. ముఖ్యం గా నేను ఎవ్వరిని కించపరచటం లేదు. ఇది అందరి సమస్య. మన చుట్టుపక్కల పరిశుభ్రం లేక పోతే, మన ఆరోగ్యానికే నష్టం కదా? If it is not too stinky (even if it is), I would very much appreciate it if you could share your experiences and any possible solutions to this problem.

7 comments:

  1. కొత్తపాళి గారి మాటే నాది, ఇక్కడ ఇంకా పర్వాలేదు మీరు బోస్టన్ వస్తూ ఏ I 91 or I84 మీదో ఆగి వుంటారు పాపం.. :-) ఇండియా లో చిన్నప్పుడు అసలు బయటకు వెళితే బాత్రూం అంటే మొదలు ఎక్కడా వుండేది కాదు వున్నవి అబ్బ ఎంత గలీజ్ గా వుండేవో వాటిలోకి వెళ్ళటం కంటే మంచి నీళ్ళు తాగటం మానెయ్యటం బెటర్ అనుకునే వాళ్ళము మా ఫ్రెండ్స్ అందరం. ఇండియా లో చాలా మంది వుద్యోగం చేసే ఆడ వాళ్ళకు (IT Industry కాదు లెండి) కిడ్నీ ప్రాబ్లెం వస్తుంది అట ఎక్కువ బాత్రూం కు వెళ్ళనందుకు.. ఇటూ వంటి ప్రాధమిక విషయాలలోనే ప్రగతి సాధించలేని మనం ..హ్మ్మ్ ఏమిటో మీ పోస్ట్ చూసి ఎప్పుడెప్పుడు విషయాలో గుర్తు వచ్చి కామెంటే ఒక పోస్టయ్యేటట్లు వుంది.. మంచి పోస్ట్...

    ReplyDelete
  2. Don't ever try rest rooms in rest areas. Try Starbucks :-)

    ReplyDelete
  3. నాదో వింత అనుభవం. పోయినేడు ఆగ్రాకి వెళ్ళినపుడు తొమ్మిదేళ్ళ మా పాపకి బాత్రూం అవసరమైంది. అదొక ప్రభుత్వ వస్త్రాలయం. ప్రక్కగా ఓ ఆరేడు షాప్స్ వున్నాయి. తనకి తొందర, నాకు భాష సమస్య. మొత్తానికి అసలెక్కడా బాత్రూం లేదు. వాళ్ళంతా బయట చెట్ల వెనగ్గా పని కానిచ్చేస్తారట. వాడక వదిలేసిన ఓ మూల గది చూపారు. లోనికి వెళ్ళేసరికి అది ఎంత ఛండాలంగా వుందంటే నాకేడుపు వచ్చేసింది ఆ జలదరింపుకి. పిల్లది ఆగలేకపోతుంది. నీళ్ళు లేవు. చివరికి 10 రూపాయలిచ్చి, ఒక షాప్ బయటవున్న ఎయిర్ కూలర్ నుండి కారుతున్న నీటిని ఒక చిల్లులున్న ప్లాస్టిక్ సంచిలోకి పట్టుకుని అది ఖాళీ అయ్యేలోగా నేను పి.టి. ఉషలా పరుగెట్టి .... ఇక చెప్పటానికేముంది. A place recognized as national icon. The treatment is so cheating by all - guides, vendors. And the place is so dirty.

    ReplyDelete
  4. Usha gaaru sorry for interrupting........
    its a failure of the system instead of spending 1000's of crores to statues rather thn concentrating basic facilities

    agra is the most disguisting city tht i have ever visited the culture and the slums..yuck..:(

    if taj is in southindia the matter will not not much worse as this

    ReplyDelete
  5. ఈ పరిశుభ్రత విషయంలో టూరిస్ట్ ప్లేసులన్నీ ఇలాగే ఏడుస్తాయండీ ఇండియాలో! బాగా టూర్లు తిరిగే అలవాటుంది కాబట్టి చెప్తున్నాను.ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అవసరమైన టాయిలెట్స్ విషయం మరీ ఘోరం! పిల్లలతో వెళ్తే ఇక చెప్పక్కర్లేదు.అందులో మా పాప అసలు బాత్రూములు ఎలా వున్నాయో చెక్ చేయడానికైనా సరే అవసరం లేకపోయినా "నేను బాత్ రూముకెళ్ళాలి"అంటుంది.నిజమో కాదో తెలీదు కాబట్టి తీసుకెళ్లాల్సిందే!

    ఇక ఆర్టీసీ బస్టాండుల్లో అయితే చెప్పక్కర్లేదు.తల్చుకుంటే చాలు మోక్షం వస్తుంది. పెయిడ్ టాయిలెట్స్ లో కూడా ఇదే పరిస్థితి!

    ఉషగారిలాంటి అనుభవాలు నాక్కూడా ఉన్నాయి.పూనా నుంచి మహాబలేశ్వర్ వెళ్ళే దార్లో ఒక ధాబా దగ్గర ఇదే పరిస్థితి ఎదురు కావడంతో పక్కనే ఉన్న కొండల్లోకి తీసుకెళ్ళాను పాపని.

    టూరిజం డిపార్ట్ మెంట్ వాళ్ళు "ఇంక్రెడిబుల్ ఇండియా"అని చెప్పుకునేటపుడు ఇవి కూడా కాస్త గమనిస్తే బాగుంటుంది.

    This is really a burning problem..always!

    ReplyDelete