Monday, September 14, 2009

పర భాషా గాయకులు


ఇవాళ్ళ "తెలు-గోడు" బ్లాగ్ లో "తారలెంతగా మెరిసేనో" పోస్ట్ చూడగానే, నాకు చిన్నప్పుడు నేను మహా fascinating గా విన్న "నా మది నిన్ను పిలిచింది గానమై" అనే పాట గుర్తొచ్చింది. ఈ పాట నేను మొదటి సారి ఎప్పుడు విన్నానో జ్ఞాపకం లేదు కాని, ఒక విషయం మాత్రం గుర్తుంది. ఈ పాట వినగానే, ఎదేవరో తెలుగు రానాయన పాడుతున్నాడని మాత్రం అంత చిన్న వయసులో కూడా అర్ధం అయ్యింది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే, అని అనుకుంటుంటే మా ఇంట్లో ఎవరో అన్నారు ఇది హిందీ పాటలు పాడే ఒకాయన పాడాడు అని. తరవాత్తరవాత రఫీ, కిషోర్, బాల సుబ్రహ్మణ్యం లాంటి మహా మహా గాయకులతో పరిచయమయినా (నాకు వాళ్ళు తెలుసని, వాళ్లకి తెలీదు), ఆ పాట మాత్రం నా మనసులో ఉండి పొయ్యింది. హిందీ పాటలు పాడినాయన తెలుగు పాట బలే charming గా పాడాడు కదా అనుకునే దాన్ని.

చాలా రోజుల తరువాత "రామ్మా చిలకమ్మ" అన్న పాట విడుదలయ్యి మొత్తం రాష్ట్రాన్నే ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా నేను నా ఫ్రండ్స్ తో, కసిన్స్ తో, "నాతో రావటానికి ఎవ్వరు లేరు నువ్వు రావే" అన్న మా పిన్ని తో మూడు సార్లు చూడాల్సి వచ్చింది (చూడాలని వుంది కదా?). లాస్ట్ టైం నేను చూసినప్పుడు సినిమా రిలీజ్ అయ్యి చాల రోజులే అయినా, రామ చిలకమ్మ పాట రాగానే audience లో భలే excitement ఉండింది. తరవాత ఈనాడు లో రామ చిలకల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో లాస్ట్ లైన్ నాకు ఇంకా గుర్తు. "రామ చిలకమ్మ ని, పరభాషా గాయకుడు రామ్మా చిలకమ్మా అని పాడినా...." అప్పుడు నాకర్ధమయ్యింది actually అది "రామ చిలకమ్మ" అని. మొన్నీ మధ్య పాట వింటుంటే, "రామ చిలకమ్మ" అని ఉదిత్ నారాయణ్ కరెక్ట్ గానే అన్నాడు కదా.... అనిపించింది.

సరే, వేరే పాటలు కూడా విందాం అనేసి, "రాధే గోవిందా", "కన్నుకొట్టినా" లాంటి ఉదిత్ పాడిన పాటలన్నీ విన్నా. ఉచ్చారణ లో ప్రాబ్లం లేక పోయినా ఏంటో అన్ని పాటలు ఫన్ని గా ఉన్నాయి. సరే అని శంకర్ మహాదేవన్ పాటలు విన్నా. అవి "funny meter" లో కొంచెం బెటర్ గా అనిపించాయి. ఇది లాభం లేదని ఉదిత్ తమిళ్ పాటలు విన్నా. అక్కడ కూడా ఒక funnyness (by the way, is this a word?). సరే బాలు గారి హిందీ పాటలు విన్నా. అవి గమ్మతుగా అనిపించలె. హరి హరన్ పాటలలో కూడా నాకేమి funny గా అని పించలె.

సరే మళ్లి రూట్స్ కే వెళ్లి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అని "నా మది నిన్ను పిలిచింది" విన్నా. ఈ సారి మీరు విన్నప్పుడు గమనించండి "సూర్య చంద్రులు", "అలనాటి జానకి" అన్న phrases ని రఫీ భలే గమ్మతుగా అన్నారు.
వీళ్ళంతా చాలా పేరున్న గాయకులు కదా? భాష రాకపోవటమే దీనికి కారణం అంటారా? మరి చిత్ర గారికి కూడా భాషా అంతగా రాదు కదా? అసలు నేను ఈ పోస్ట్ రాయడానికి కారణం ఏంటంటే, నేను ఈ పోస్ట్ లో "funny", "గమ్మతు" అనే పదాల్ని చాల సార్లు వాడాను. అవి తప్ప నాకు వేరే పదాలు దొరకలే. వీటికి బదులుగా వేరే ఏవైనా పదాలు వాడొచ్చా? అవేంటో నాకు చెప్తారా ప్లీజ్? లేక పోతే "అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక, పాటల్ని ఎంజాయ్ చేయ్యమ్మాయి" అంటారా? వాకే.

24 comments:

  1. తమాషా, రోత, ఛండాలం లాంటివే కాక అద్భుతం, బ్రహ్మాండం లాంటి మామంచి పదాలూ చక్కగా వాడేసి కూడా మనం తేవాలనుకున్న పెడార్ధం ఎంచక్కా తెచ్చేయొచ్చు.

    ఇక ఎంజాయ్ చెయ్యటమంటారా - ఆలోచనలు పెట్టుకోవచ్చు, ఎంజాయీ చెయ్యొచ్చు. దేన్దోవ దాందే. వెంట్రుకలేరుకుంటూ గొంగట్లోనే తినేవాళ్లు చాలామందున్నారు - మీలాగా, నాలాగా. అలాంటోళ్ల లిస్టూ, వాళ్లు అల్లప్పుడెప్పుడో నెమరేసుకున్న సంగతులూ కొన్ని ఇక్కడున్నాయి చూడండి.

    మీ బ్లాగులో నా అడ్వర్టైజ్‌మెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఇక ఆపెయ్యాలి ....

    ReplyDelete
  2. Rafee paadina 'Neandey...eenaandey" paata gurtukostondi.

    ReplyDelete
  3. @Sujatha unnikrishnan was carnatic classical singer. at least i expect he knew telugu somehow ( the great tyagraya effct. he must learn).

    తెలుగు సరిగా పలకపోతే పంటి కింద రాయిలా తగులుతుంది. నాకు తెలిసి శంకర్ మహదేవన్ పాడుతుంటే అచ్చం తెలుగు గాయకుడు పాడుతున్న ట్టే వుంటుంది.కొంతమంది వర్ధమాన గాయకులున్నారు. సోను నిగం, కైలాష్ ఖేర్,కునాల్ గంజావాలా లాంటి వాళ్ళ తెలుగు భయంకరం గా వుంటుంది. ఈమధ్య గణేష్ సినిమాలో అనుకుంటా జావెద్ అలీ ఇంకా మగధీర లో అనూజ్ మెప్పించారు.

    ReplyDelete
  4. అబ్రకదబ్ర
    మీ కామెంట్స్ చాల valuable. advertisements ఎక్కువైతే అయ్యాయి. పరవాలేదు. నేను వ్రాసే టాపిక్స్ మీద వేరే perspective చదవటానికి ఇది నాకు బెస్ట్ ఛాన్స్. ఆపకండి.
    సుజాత
    ఉన్ని గురించి మార్చే పోయాను. గుర్తు చేసి మంచి పని చేసారు.
    సత్య
    వెంటనే వింటా ఆ పాటని.
    Jingi
    Probably "పంటి కింద రాయి" was the phrase I was looking for.

    ReplyDelete
  5. SPB is a stellar failure in Hindi. When he sings, Hindi lovers would want to skew him alive for his pronunciation, intonation etc.,

    ReplyDelete
  6. యోగి .. this is one thing I 100% agree with you! SPB was horrible singing in Hindi. I used to live in Kanpur when that kaboothar ja ja movie was released .. I wanted to either wring his neck or hang myself every time I heard those songs. Unfortunately, I don't think Hindi natives found it bad or despicable - the movie was a huge hit and so were the songs.
    కిరణ్మయిగారు .. మీ థీం గురించి ఇదొక ఆలోచన.
    రఫీయేమో ద గ్రేట్ మొహమ్మద్ రఫీ.
    ఉదిత్ నారాయణేమో ఉత్తుత్తి నారాయణ. అదీ తేడా, బహుశా.

    ReplyDelete
  7. కొత్త పాళీ గారు
    అంతేనంటారా?

    ReplyDelete
  8. "అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక, పాటల్ని ఎంజాయ్ చేయ్యమ్మాయి"
    :P
    బాగా రాసారు ..
    నాకైతే హిందివాళ్ళు పాడితే తేడా స్పష్టం గా కనబడుతుంది..మన సౌత్ ఇండియన్స్ అంత తేడా తెలియదు ఉచ్చారణ దోషాలు ఎక్కువ వినబడతాయి ..
    @ అబ్రకదబ్ర గారు ఇప్పుడే మీ తాజ్మహల్ పోస్ట్ చదివాను చాలా బాగా రాసారు

    ReplyDelete
  9. "వెరైటీ" కోసం ఇలా పాడించేస్తుంటారంతే!
    తెలుగులో లతామంగేష్కర్,ఆశాభోంస్లే వంటి మహాగాయనీమణులు పాడిన బూతుపాట్లు(pun intended) మాత్రం మనం భరించలేదా..తప్పదు..అదే వెరైటీ.

    ReplyDelete
  10. కొత్త పాళీ gaaru,

    Good. At least there is something that we agree upon :)

    ReplyDelete
  11. SPB hindee paaTala gurunchi naenu Yoegi, kottapaalhee gaaritoe eakeebhavistaanu.

    ReplyDelete
  12. చాలా అర్జెంటుగా యోగి, కొ.పా గారితో ఏకీభవించేస్తున్నాను, spb హిందీ పాటల విషయాల్లో. "హం ఆప్ కే హైన్ కౌన్"? అన్న టైటిల్ సాంగ్ వింటే, మనకే కంట్లో నీళ్ళు తిరుగుతాయి. ఇక హిందీ వాళ్ళెలా విన్నారో? ముఖ్యంగా, "హైన్" (ముక్కుతో పలకాలి) అనడానికి, ఆయన "హై" అనడం భలే చికాకు.

    నాకు కొన్ని "గరిగరన్" సారీ...హరిహరన్ పాటలూ కొంచెం తేడాగా అనిపిస్తాయి. "చందురునీ మించినదీ ఆర్మ్ స్ట్రాంగా".., "టెలిఫోన్ ధ్వనితో నవ్వేదానా.." ఇలాంటివి.

    ReplyDelete
  13. "చందురునీ మించినదీ ఆర్మ్ స్ట్రాంగా". ఓర్ని అది ఆర్మ్ స్ట్రాంగా ఇన్నాళ్ళూ
    ఏదో మ్యూజిక్ బిట్ అనుకొన్నాను.

    టపా బాగుంది

    ReplyDelete
  14. లాభం లేదు. యస్. పి. బి. గురించి ఇన్నేసి కామెంట్స్ వచ్చాక ఆయన పాటలన్నీ మళ్ళి నా analytical బ్రెయిన్ ఉపయోగించి వినాల్సిందే.
    వినయ్, నేస్తం, యోగి, సునీత, రవి
    థాంక్స్

    మహేష్ కుమార్ గారు
    మీరన్నది నిజమే. వెరైటీ ఇస్ ది నేమ్ అఫ్ ది గేమ్.

    బొల్లోజు బాబా గారు
    చూసారా నా పోస్ట్ మీకు ఎంత సహాయం చేసిందో :-)

    ReplyDelete
  15. హిందీ నాసికా గాయకాగ్రేసరుల తెలుగు కన్నా ఎస్పీ బాలుడి హిందీ వంద రెట్లు మెరుగు.

    ReplyDelete
  16. And the Hindi speaking junta would say exactly the same about Balu's creepy intonation in Hindi.

    However, these are matters of personal likes/dislikes. There is no way to settle this one way or the other unless one invents a pseudo science which measures exactly nasal variations of these singers in different languages.

    But yes, Balu doesn't suck any less in Hindi than any Hindi singer sucks in Telugu.

    ReplyDelete
  17. http://ramakantharao.blogspot.com/2009/03/blog-post_11.html

    ReplyDelete
  18. బాబా గారు, అది "ఆర్మ్ స్ట్రాంగా" - అది కనుక్కోడానికి నేను ఆర్మ్ స్ట్రాంగంత కష్టపడ్డాను. చివరికి ఎలానో కనుక్కున్నా.

    ReplyDelete
  19. అబ్బా నవ్వి నవ్వి చచ్చే చావొస్తోంది ఈ పోస్ట్, కామెంట్ లు చదివి... సాజన్ సినిమా లో "బహుత్ ప్యార్ కర్ ర్ర్ర్ర్ తే హై తుంకో సనం" అని బాలు అన్నప్పుడల్ల నాకు కొంచం సిగ్గేసి అటు ఇటూ కొంచం మోమాటం గా నా నార్త్ ఇండియా స్నేహితులున్నారేమో అని చూస్తుంటా..
    ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకునేలా తిట్టేను వాళ్ళ అభిమాన గాయకుడు వుత్తుత్తి నారయణ ను ఇంకా ఆ తలకు మాసిన పాకిస్తాన్ గాయకులిని.. నాకైతే వాళ్ళ పాటలు వినగానే విరక్తి గా నిరామయం గా "భావములోను భాగ్యము నందున గోవింద గోవింద అని కొలువవో మనసా" అని పాడుకోవటమే...

    ReplyDelete
  20. "ఆ" పాకిస్తానీ గాయకుడు అద్నన్ సమీయేనా. నేను మాత్రం అతని తేరా చెహ్రా కి పెద్ద పంకాని. నాకైతే అతని గొంతులో పే.......ధ్ధ బాధ ధ్వనిస్తుంటుంది. I hurted.

    ReplyDelete
  21. రవి
    Congratulations!!!!!
    భావన
    పాడుకుంటే పాడుకున్నారుకాని, మరీ వాళ్ళని కళ్ళమ్మట నీళ్ళు వచ్చే వరకు ఎందుకండి తిట్టటం. పాపం బాధపడతారు కదా.
    Indian Minerva
    I hurted because you hurted.

    ReplyDelete
  22. ఆ వూరుకుంటారేమిటి మరి తిట్టకుండా వాళ్ళను... వాళ్ళ వాళ్ళ భాషలలో, వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, వాళ్ళ వాళ్ళ గొంతుకలతో, వాళ్ళ వాళ్ళ జనాలకు, వాళ్ళ వాళ్ళకు కావలసినట్లు పాడుకోమను (అమ్మయ్య ఆయాసం వచ్చింది ఒక నిమిషం వుండేం మంచి నీళ్ళు తాగి వస్తాను......)
    .................................................................
    అంతరాయానికి చింతిస్తున్నాము ..........
    వచ్చేసా..

    తెలుగులోకొస్తే మరి తిట్లు పడతాయి తప్పదు ..
    @ ఇండియా మినర్వా గారు ఆ పాకిస్తానబ్బాయి గొంతులో విషాదం అతను తెలుగు లో పాడితే మనకేమో గుండెలో విషాదం.. me too hurted :-(

    ReplyDelete