Sunday, August 16, 2009

మా ఇంటికి భోజనానికి రండి Part 3

2003 లో మా university కి ఒక కొత్త అమ్మాయి వచ్చింది (పేరా? కొంచెం సేపు అంజలి దేవి అనుకోండి). కొన్ని రోజుల తరువాత మేమిద్దరం మంచి ఫ్రండ్స్ అయ్యాం. ఒక రోజు వాళ్ళింటికి లంచ్ కి వెళ్ళా. ఉగాది పండగ అనుకుంటా. పులిహోర, బెండకాయ పులుసు, ఆనపకాయ కూర అంటూ మొదలెట్టిందతే. లిస్టు ఆగట్లేదు. ఎంత బాగా చేసిందంటే home touch ఉంది అన్నింటిల్లో. వాళ్ళింటికి అప్పటినుంచి ప్రతి నెల ఒక్కసారైనా వెళ్ళేదాన్ని(పిలిచినా, పిలవకపోయినా). మా అమ్మ మూడేళ్ళ క్రితం US వచ్చినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాం. ఇంక చూస్కోండి. మా అమ్మ ఒకటే సుత్తి. "నువ్వుకూడా వంట నేర్చుకోవాలి" అని. సరే ఆ తరవాత నా పెళ్లి జరిగింది. ఇక్కడ important విషయమేంటంటే, మా అత్తగారింటిలో అందరు భోజన ప్రియులే. మా సార్ తో సహా. అంటే ఎప్పుడు ఫుల్లుగా తింటారని కాదు. tasty గా ఉన్న dishes ని appreciate చేస్తారని అర్ధం. అబ్బ అర్ధం చేసుకోరు. సరే పెళ్ళయ్యాక కొన్ని రోజులకి మా అయన ఇందిర గారి మహానంది cooking బ్లాగ్ పరిచయం చేసారు (ఆ సైట్ లోనించే నేను మొదటి సారి కూడలి కి వచ్చింది). ఇందిర గారి పుణ్యమా అని నేను చించేసా. ఆవిడ ఏది చేస్తే నేనది రిపీట్ చెయ్యడం. కూరలు, పప్పులు, పులుసులు ఒకటేంటి? రెండు మూడు సార్లు అంజలి దేవి (మా ఫ్రెండ్)మా ఇంటికొచ్చి అదిరిపోయింది. "నువ్వేనా ఈ వంట చేసినది....." అని. వాళ్ళింటికి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేను ఏంటో తెలుసా? గోంగూర పప్పు, బీరకాయ కూర, సాంబార్, పులిహోర, వడియాలు (తను పెట్టలేదు లెండి, ఉరికే వేయించింది). పైగా మరుసట్రోజు మేము బయలుదేరేలోపు ఉప్మా కూడా చేసింది. దాంతో నాకు మళ్ళి lecture మొదలు. నీకసలు ఇలాంటివి తెలిదు. చూడు ఎంత తొందరగా breakfast చేసి పెట్టిందో. ఎవరైనా మనింటికొస్తే నువ్వు కూడా వాల్లతోపాటే లేట్ గా లేస్తావు. వాళ్ళు ఎ Dunkin Donuts లో కాఫీ తాగి వెళ్ళాల్సిందే అని. నాకైతే పిచ్చ కోపమొచ్చేసింది. ఇలా ఎవరు మంచిగా వంట చేసిన నాకే తగులుకునేతట్టుంది అని చెప్పి అసలు వంట వండడంలో ఉన్న basics నేర్చుంటే అందులో ఉన్న enjoyment అర్ధమవుతుందేమో అని అటు వైపు concentration పెట్టా. అప్పుడర్థమయ్యింది కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుస్తే చాలు వంట ఆదరకోట్టేయ్యచ్చని. For example, కూర ముక్కలు "cook" అవుతున్నప్పుడే ఉప్పు వేసేస్తే ఉప్పు మంచిగా absorb అయ్యి రుచి గా ఉంటుంది. ఈ విషయం నాకు ముందు తెలీదుగా? లాస్ట్ లో ఉప్పు వేస్తే ఏదో వెలితున్నట్టు అనిపించేది. ఏంటో అర్ధమయ్యేది కాదు. ఇల్లాంటి సంగతులు తెలిసాయిగా. ఇంక చూస్కోండి. చించేసా. మొన్న మా ఇంటికి ఫ్రండ్స్ ని పిలిచాం (భోజనానికి). Tofu curry, "Puli Kozumbu" (తమిళ వంటకం లెండి, నేర్చుకున్నా. Yeah), అరిటికాయ వేపుడు, బొప్పాసకాయ కూర, పాయసం చేశా. మా ఆయనేమో ములక్కాడ సాంబార్ చేసారు. ఆ రోజు టైం లేదు అందుకే తను ఒక్క వంటకం చేసి నన్ను బ్రతికించారు. ఆ వచ్చిన వాళ్ళు, పాయసం రౌండ్ complete అయ్యాకా "మీరు వంట బలే బాగా చేస్తారు ముఖ్యంగా ములక్కాడ సాంబార్ అదుర్స్" అని (నన్ను)పొగిడి వెళ్ళారు.
ప్చ్. ఎం చేస్తాం?......

6 comments:

  1. మీ వంటల ప్రయోగాలా పార్ట్ లు అన్నీ చదువుతున్నాను చాలా బాగా రాస్తున్నారు ముఖ్యం గా మీ ప్రేమ కధ చాలా బాగుంది .. బొప్పయి కూరనా ..ఇదేదో వెరైటి గా ఉంది మా ఆయన మీద ప్రయోగించాలి :)

    ReplyDelete
  2. నేస్తం
    Thanks. వంటల గురించి వ్రాద్దమనే పోస్ట్ మొదలు పెట్టా. కాని నాకు topic ని organize చెయ్యటం సరిగ్గా రావట్లేదు. అందుకే మా అయన గురించి సుత్తి ఎక్కువైనట్లుంది.

    ReplyDelete
  3. నేస్తం
    ఇక్కడ గ్రీన్ papaya అని దొరుకుతుంది. దాంతో చేశా. పూర్తిగా పండలేదు కాబట్టి సొరకాయ కూర లాగా చెయ్యొచ్చు. ట్రై చెయ్యండి.

    ReplyDelete
  4. mi menu bagundandi.mayana kuda okate nasa.naku istamite baga chesthananta lekpothe ante ani.
    mi post bagundi

    ReplyDelete
  5. Thanks Swathi
    మా అయన ఇంకొక ఊత పదం ఏంటంటే "నువ్వు ఎం చేసినా చెయ్యకపోయినా, కిచెన్ మాత్రం క్లీన్ గా ఉంచు" అని. అంటే నేను కిచెన్ క్లీన్ చేయ్యట్లేదనే కదా అర్ధం?

    ReplyDelete
  6. మీ ఆయన గురించి సుత్తి ఏం ఎక్కువ కాలేదు. వంటల బ్లాగులు చాలా ఉన్నాయి కదా?! కాని ఇలా ప్రేమ కథ చెప్పే బ్లాగులు తక్కువ కదా(నాకు తెలిసింత వరకు. ఒకవేళ మరిన్ని వున్నాయేమో. కాని నాకు తారస పడిన బ్లాగులలో మీదే మొదటిది), అందుకే రెచ్చిపోండి. తెలుగు, తమిళ కలయిక గురించి ఇంకా చెప్పండి.

    ReplyDelete