ఇప్పుడే సునీత గారి "వేర్ ఇస్ ది పార్టీ" పోస్ట్ చదివి కామెంట్ చేద్దామనుకున్నా. కాని చాలా పెద్ద కామెంట్ అవుతుందని నేనే పోస్ట్ తున్నా.
మా తోటి కోడల్ని వంట చేయ్యఖరలేకుండా చపాతి కొని తెచ్చేయమన్నారట. ఆన్నట్టు చెప్పటం మర్చి పోయా ఇది "kind of potluck, kind of not". అంటే ఏంటంటే, చాలా మటుకు వంటలు ఆ ఇంటావిడ చేస్తుంది, కొన్ని మాత్రం గెస్ట్‌లు పట్టుకేల్తారు. సరే ఎలాగో స్నో, స్లీట్ ల మధ్య, హోల్ ఫూడ్స్ చపాతిల పాకెట్లు పట్టుకుని సదరు హోస్ట్ ఇంటికి చేరుకున్నాం. మా అయన ఆ చపాతీలు ఉన్న బాగ్ నాకిచ్చి "నేను కార్ పార్క్ చేసాక తమ్ముడి తో వస్తాను. నువ్వెళ్ళు" అని నన్ను తోసేసాడు. లోపలికెల్తే, బయట రూం లో మగవాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు (అని నేను అనుకున్నాను). కోట్ పెడదామని చూస్తే నాకు క్లోసేట్ కనిపించలేదు. మా తోటి కోడలు తన కోట్ ని లివింగ్ రూం లో ఉన్న మెట్ల రైలింగ్ మీద, మిగతా కోట్ల మీద వేసేసి, నువ్వు కూడా అలాగే చెయ్యాలి అని నేను నీకు స్పెషల్ గా చెప్పాలా ? అన్నట్టుగా చూసింది. సరే నేను అలాగే చేసి, ముందుకి నడిచా. కిచెన్, లివింగ్ రూం కలిపి ఉన్న ఇల్లు కావడం తో కిచెన్ లో, లివింగ్ రూం లో, పక్కనే ఉన్న పిల్లల ప్లే రూం లో ఇలా పలు చోట్ల ఆడవాళ్ళూ మాట్లాడుతూ కనిపించారు (వీళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారు లెండి) మీరు గమనించ వలసిన విషయం ఏమిటంటే నేను ఇంకా లివింగ్ రూం లోపలి వెళ్ళలేదు. మా తోటి కోడలు మాయ మయి పోయింది (అంటే అక్కడి వాళ్ళల్లో కలిసిపోయింది) ఈ లోపలే ఎవరో వచ్చి నా చేతిలో ఉన్న చపాతి ప్యాకెట్లు లాగేసుకున్నారు. కొంత మంది కిచెన్ లో వంటలు చేస్తున్నారు అని నేను అప్పుడు గమనించాను. ఆ వంటల వాసన నా కొత్త కోట్ కి తగులుతుందిరా భగవంతుడా అని బాధ పడుతూ లోపలి చూసా. ఆ హోస్ట్ అంటోంది తమిళం లో "లేట్ అయ్యిందేంటి?". "మా బావగారు తోటి కోడలు ఇప్పుడే చేరారు. పాపం స్లీట్ కదా రోడ్ అంతా. లేట్ అయ్యిది" ఈ రిహార్సల్ నాకు ముందే అయిపోవడం తో నేను పెద్ద ఆశ్చర్య పడలా.
సరే గడపలోనే నిలబడ లేను కదా? మనకి తెలిసిన మొహం ఒక్కటైనా కనిపించక పోతుందా అని లోపలి వెళ్ళా. "హాయ్" అంటూ క్రితం సారి మా మరిది ఇంటికి వచ్చిన ఒక ఫ్రెండు పలకరించింది. కొంచెం సేపు మాట్లాడి వెళ్లి పొయ్యింది "let me take a look at what else is going on" అంటూ. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి పలకరిస్తే మాట్లాడటం. ఇలా ఉంటుంది conversationకొ. ఆ: Oh you don't know Tamil? Are you new here?
ఆ దంపతులు కేకు కోశాక, రస మలై తిని, "పళ్ళ పాయసం" తిని/తాగి, ఆపిల్ సైడర్ టోస్ట్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాం.
వచ్చేటప్పుడు ఎవరెవరు ఎలాంటి చీర/సల్వార్ కమీజ్ లో వచ్చారు, వాళ్ళ నగల, మరియు కార్ల details ఏంటి లాంటి విషయాలతో టైం పాస్స్ అయి పోయింది.
తరువాతి రోజు మా తోటి కోడలు నాతో "మంగమ్మ గారి తో ఏంటి మాట్లాడారు" అని అడిగింది. (అది నిజంగా ఆవిడ పేరు కాదు లెండి, నేనే సృష్టించా). మనసులో విషయాలు మనసులో దాచుకుని పైకి టిక్కు టిక్కు మంటూ, తుక్కు అన్సర్లు చెప్పలేని నేను మా సంభాషణ అంతా పూస గుచ్చినట్టు చెప్పేసా. అప్పుడా అమ్మాయి "నేను కూడా ఆవిడని అన్ని ప్రశ్నలు ఎప్పుడు అడగలేదు. మీరు బలే అడిగారు" అని నా మీద సటైరు విసిరింది. తరవాత మా అయన అన్నారు "పార్టీ లో మగవాళ్ళు చాలా మంది పరిచయం లేని వాళ్ళే. వాళ్ళ వైఫ్ కి తెలిసిన వాళ్ళ పార్టీ అని వచ్చిన వాళ్ళే. ఎవరూ ఎక్కువ మాట్లాడు కోలేదు. చాల మంది ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. It got better after we started playing games" అని.
"ఈ పోస్ట్ వ్రాయటం ద్వారా ఎవ్వరిని ఎగతాళి చెయ్యటం నా ఉద్దేశం కాదు" అని నేను పెద్ద disclaimer పెట్టను. ఎందుకంటే ఇలాంటి పార్టీలల్లో, వాటికి ముందు/తరవాతా జరిగే ప్రీ, పోస్ట్ పార్టీ వ్యవహారాలలో కొన్ని విషయాలు నాకు చాలా చికాకు. కొన్ని విషయాలు మాత్రం నాకు చాలా ఇష్టం.
పార్టీ అనేది మనకి ఇష్టమయిన వాళ్ళని పిలిచి వాళ్ళతో సమయం గడపటం. పార్టీ కి ముందర జరిగే preparations సరదాగా ఉండాలి కాని తల నొప్పి వ్యవహారం కాకూడదు.
Readers అందరికి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలను కుంటున్నాను.
-- మీ ఇంటికి సరిపోయేంత మంది నే పిలవండి. ఎక్కువ మందిని పిలిచి సోఫా, కార్పెట్ పాడయ్యి, క్లీన్ అప్ కష్టమయ్యి ఇబ్బంది పడకండి.
-- మీ ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే మీకు ఇష్టం అయిన వాళ్ళనే పిలవండి, ఇష్టం లేని వాళ్ళని మొహమాటం కొద్ది పిలిచి, వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి.
-- ఎవరైనా రాలేమంటే ఒకసారి చెప్పి వదిలెయ్యండి అంతే గాని పది సార్లు చెప్పి విసిగించకండి.
-- హోస్ట్/hostess మీ ఆవిడ/ఆయన కి తెలీక పోతే ముందు వాళ్ళని పరిచయం చెయ్యండి.
-- అలాగే మీకు తెలిసిన వాళ్ళని పార్టీ కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని వదిలేయ్యకండి. మీకు తెలిసిన అతిదులని పరిచయం చెయ్యండి. అది బేసిక్ మానర్స్.
--అందరి ఇళ్ళల్లోను చెప్పుల స్టాండ్, కోట్ క్లోసేట్ ఉండాలని రూల్ లేదు. వచ్చేవారి కోట్ తీసుకుని కావాలంటే లోపల గది లో పెట్టండి. వెళ్ళేటప్పుడు వాళ్లకి తిరిగి ఇచ్చేయ్యోచ్చు. కోట్ కి వంట వాసన అంటుకోవటం ముఖ్యం కాదు. కొంత మంది అదే కోట్ ని రేపు ఆఫీసు కి వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ కోట్ అలాగే ఉంటె కింద చెప్పుల మీద పడీ, పిల్లలు తొక్కి నానా న్యూసెన్సు అవుతుంది. అలాగే వాళ్ళ చెప్పులని ఒక మూలగా, వరసగా పెట్టమనండి. వెతుక్కోవడంలో ఇబ్బంది ఉండకూడదు.
-- బేబీ shower పార్టీ అవుతే మగ వాళ్ళని పిలవకండి. లేదా వాళ్లకి ఏదైనా సినిమానో లేక మరోటో కాలక్షేపం పెట్టండి.
-- చిన్న పిల్లలు ఉన్నప్పుడు, అందులోను పసి పిల్లలు అయితే మనింట్లో పార్టీ పెట్టక పోవటమే మంచిది.
--భోజనం చేసేటప్పుడు అందరిని పిలవండి చాలా చాల ఆకలి వేస్తున్న, భోజనం చేసి మందులు వేసుకోవాల్సిన ఆడవాళ్ళు కూడా ఉంటారని మర్చి పోకండి.

--"please feed your child first. you can start eating as soon as the men are done" అని అమ్మలకి మీరు సలహా ఇవ్వకండి. ఆవిడ పిల్లల విషయం ఆవిడ చూసుకుంటుంది.
Martha Stewart లెవెల్లో సలహాలు ఇవ్వటం యింక ఆపెస్తా. మీరు కూడా పైన లిస్టు కి dos and don'ts add చెయ్యండి మరి.
This comment has been removed by the author.
ReplyDeleteబావుంది. వ్యంగ్యం ఎక్కువయింది కాని అదిరింది. ఇంతకీ మీ వారికి మీరు ఇలా రాస్తున్నారని తెలుసా ?? :)
ReplyDeleteపిల్లలున్న పార్టీలో అత్యవసరమైతే తప్ప పౌడర్ రూమ్‌లోకి వెళ్ళకండి!
ReplyDeleteవాసు
ReplyDeleteనిజంగానే వ్యంగ్యం ఎక్కువైందా? ఎవరిని బాధ పెట్టాలని నేను వ్రాయలేదండి. కొన్ని కొన్ని విషయాలు బలే చికాకు కలిగిస్తాయి అందుకే వాటిని బ్లాగ్ ముఖంగా తెలియ చేయతమయినది.
తెరెసా
ఎందుకండీ?
అబ్బ, బోల్డు పార్టీలను ఒక్కసారిగా గుర్తు చేసి పారేశారు. మీ పాత్రలో నేను చాలా సార్లు జీవించాను! అసలు వంటం ఏమిటో కూడా తెలీకుండా "అద్భుతం, ఇదెలా చేస్తారూ?" అని అడిగి తెలుసుకున్నా!
ReplyDeleteతమిళులు, గుజరాతీల మధ్య ఒంటరి పక్షిలా చాలా సార్లు నిల్చున్నా మా ఆయన్ని తిట్టుకుంటూ!
"పార్టీ"అనగానే తయారుగా ఉండే గుజరాతీల ఓవర్ మేకప్(తెలుగు చదివే గుజరాతీలెవరన్నా ఉంటే క్షమించాలి)ను భరిస్తూ "కడీ" "ఢోక్లా" రెసిపీలు తీసుకున్నా!
పులిహోరలూ,బజ్జీలు,ఇంకా అనేకాలు పాట్ లక్ ల కోసం వండా!
మార్తా స్టూవర్ట్ లా మీరు చెప్పిన సలహాలు(నాకు మార్తా అంటే భలే ఇష్టం)నేను నిర్దాక్షిణ్యంగా పాటిస్తున్నా...ఇండియా వచ్చాక! ...పార్టీకి వెళ్ళినా..పార్టీకి నేనే పిల్చినా..!
హహహ! కిరణ్ గారూ తోలు తీసేసారు.(btw నేను మిమ్మల్ని కిరణ్ అని పొట్టిపేరుతో పిలిస్తే మీకు అభ్యంతరమైతే తెలియచెయ్యండి). ఇది ఇంకో కోణం. ఇంకా రకాలు ఉన్నాయి. నేను రాసిన ఆ ఫలానా వాళ్ళింటికి ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకూ అక్కడ ఎవ్వరూ తెలియక దేభి ముఖం వేసుకు చూడాల్సివచ్చింది. ఎగ్గొట్టాలంటే సదరు హోస్ట్ మావారికి చదువుకునేటప్పటినుండీ అంటే దగ్గర దగ్గర 25 సంవత్సరాలనుండీ ఫ్రెండ్. ఒక్కసారి అడుగుపెట్టాక, మనం నోరు విప్పాక అవతలివాళ్ళు ఫ్లాట్ ఐ తీరాలంతే!
ReplyDelete@ కిరణ్మయి గారు: మీది భాషాంతర వివాహం అన్నారు కదా. మొదటి సారి చదివినపుడు అత్తవారింటి మీద కచ్చి బాగా తీర్చుకున్నారు అనిపించింది. అంతే .
ReplyDeleteSo - you had the most typical suburban desi new year party :-)
ReplyDeleteసుజాత గారు
ReplyDeleteకొన్ని potlucks మరీ ఘోరం. ఎలా ఉంటుందంటే "మీరు మా ఇంటికి రండి, వస్తు, వస్తూ పులిహార పట్రండి"
సునీత
కిరణ్ అంటే నాకు చాల ఇష్టం. కంటిన్యూ అయిపోండి.
కొత్త పాళీ గారు
పక్కా సబ్ అర్బన్ పార్టీ. పార్టీ నా, మజాకా?